MOSS Endura TWS earbuds: ప్రస్తుత కాలంలో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కోరుకునేవారి కోసం మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చింది క్వాడ్-మిక్ ENC, తక్కువ లేటెన్సీ గేమింగ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ ఇయర్ బడ్స్ కేవలం రూ.1,422 ధరకే లభిస్తున్నాయి. ట్రెండ్‌లో ఉన్న ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ యొక్క పూర్తి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం టెక్ లవర్స్ స్టైలిష్‌గా ఉండే గాడ్జెట్లను ఇష్టపడుతున్నారు. అయితే ఈ మోడల్ ఇయర్ బడ్స్ చాలా కాంపాక్ట్, మోడ్రన్ డిజైన్‌తో వస్తాయి. దీని ఛార్జింగ్ కేస్ చాలా మృదువుగా ఉండి, పాకెట్‌లో పెట్టుకోవడానికి ఎంతో ఈజీగా ఉంటుంది. ఇయర్ బడ్స్ చెవుల్లో సరిగ్గా సరిపోయేలా వీటిని డిజైన్ చేశారు. వ్యాయామం చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు లేదా ఆఫీస్‌లో ఎక్కువ గంటలు పెట్టుకున్నప్పటికీ ఇవి చెవుల నుండి జారిపోకుండా గట్టిగా పట్టుకుని ఉంటాయి.
ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ అందించే సౌండ్ అవుట్ పుట్ చూస్తే.. నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో పవర్ ఫుల్ డ్రైవర్లను వాడటం వల్ల మ్యూజిక్ వింటున్నప్పుడు డీప్ బేస్ , క్లియర్ వోకల్స్ స్పష్టంగా వినిపిస్తాయి. రాక్, పాప్ లేదా క్లాసికల్ మ్యూజిక్ ఏదైనా సరే ప్రతి బీట్‌ను చాలా ఎంజాయ్ చేయొచ్చు. తక్కువ ధరలో.. ఇంత మంచి ఆడియో ఫీల్ అందించడం ఈ ఇయర్ బడ్స్ యొక్క ప్రత్యేకత.
ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్ , ఆఫీస్ కమ్యూనికేషన్స్‌లో కాల్స్ క్లారిటీగా ఉండటం చాలా ముఖ్యం. ఈ మోడల్‌లో క్వాడ్-మిక్ ENC టెక్నాలజీని అందించారు. దీని వల్ల మనం రద్దీగా ఉండే రోడ్లపై వెళ్తున్నప్పుడు.. లేదా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చుట్టు పక్కల వచ్చే సౌండ్ ఇతరులకు వినిపించకుండా ఇది అడ్డుకుంటుంది. అవతలి వారికి మన గొంతు స్పష్టంగా,క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తుంది.
చాలా మంది వైర్ లెస్ ఇయర్ బడ్స్ కొనేటప్పుడు బ్యాటరీ బ్యాకప్ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు.ఈ మోడల్ ఆ విషయంలో అస్సలు నిరాశపరచదు. ఇది సుమారు 50 గంటల వరకు లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.ఒక్క సారి ఛార్జ్ చేస్తే రోజంతా.. ఎలాంటి టెన్షన్ లేకుండా మ్యూజిక్ వినొచ్చు. అంతే కాకుండా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే ఛార్జ్ ఎక్కించుకోవచ్చు.
గేమ్స్ ఆడే వారికి ఆడియో సింక్ చాలా ముఖ్యం. గన్ ఫైరింగ్ లేదా కార్ మూమెంట్స్ సమయంలో సౌండ్ కొంచెం ఆలస్యంగా వస్తే గేమింగ్ అనుభవం దెబ్బతింటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ మోడల్ లో లో లేటెన్సీ గేమింగ్ మోడ్ ఇచ్చారు. దీని వల్ల గేమింగ్ ఆడేటప్పుడు ఆడియో, వీడియో మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్‌గా సింక్ అవుతుంది. బ్యాటిల్ రాయ్ గేమ్‌లు ఆడే వారికి ఇది చాలా ఉపయోగ పడుతుంది.
Also Read: రూ.500 లోపు.. బెస్ట్ ఉమెన్స్ వాచ్ మోడల్స్!
ఇది లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీతో వస్తుంది. ఫోన్ లేదా లాప్‌టాప్‌తో ఇయర్ బడ్స్‌ను కనెక్ట్ చేయడం క్షణాల్లో జరిగిపోతుంది. కనెక్షన్ మధ్యలో కట్ అవ్వడం లేదా లాగ్ అవ్వడం లాంటి సమస్యలు రావు. అంతే కాకుండా ఇవి వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉండటం వల్ల వర్షంలో తడిచినా లేదా జిమ్‌లో చెమట పట్టినప్పటికీ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. టచ్ కంట్రోల్స్ ద్వారా పాటలను మార్చడం, కాల్స్ లిఫ్ట్ చేయడం కూడా వీటితో ఈజీ.
మార్కెట్లో లభించే ఇతర ఖరీదైన బ్రాండ్లతో పోలిస్తే.. ఈ మోడల్ కేవలం రూ.1,422 ధరకే లభించడం గ్రేట్. తక్కువ బడ్జెట్‌లో 50 గంటల బ్యాటరీ బ్యాకప్, క్వాడ్-మిక్ ENC కాల్ క్వాలిటీ , గేమింగ్ ఫీచర్లు కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ . బడ్జెట్ ఫ్రెండ్లీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్!