Flipkart Big Billion Days 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ కోసం ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి సేల్ అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులకు అక్టోబర్ 8 నుంచే ముందస్తు యాక్సెస్ లభించనుంది. దీంతో నచ్చిన ఫోన్, ల్యాప్‌టాప్ లేదా ఇతర గ్యాడ్జెట్‌ను అందరికంటే ముందే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, టీవీలు, టీవీఎస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, స్మార్ట్ హోమ్ డివైజ్‌లపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. అయితే ఏ ప్రొడక్ట్‌పై ఎంత తగ్గింపు ఉంటుందనే పూర్తి వివరాలను ఫ్లిప్‌కార్ట్ ఇంకా వెల్లడించలేదు. సేల్ దగ్గర పడే కొద్దీ మరిన్ని డీల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది.
షాపింగ్ బడ్జెట్ తగ్గించుకోవాలనుకునేవారికి బ్యాంక్ ఆఫర్లు ఉపయోగపడతాయి. యాక్సిస్ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో చెల్లిస్తే 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడేవారికి కూడా 10 శాతం వరకు ఆదా చేసే అవకాశం ఉంది. అయితే కనీస కొనుగోలు విలువ, గరిష్ఠ డిస్కౌంట్ వంటి నిబంధనలు వర్తించే అవకాశం ఉంది.
Also Read: కొత్త ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? Asus తెచ్చిన ఈ 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
ఫ్లిప్‌కార్ట్ సొంత పేమెంట్ సర్వీస్ సూపర్ మనీని తొలిసారి ఉపయోగించే వారికి అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ అందించనుంది. అంటే సరైన బ్యాంక్ ఆఫర్‌తో పాటు క్యాష్‌బ్యాక్ కూడా కలిస్తే తుది ధర మరింత తగ్గొచ్చు. అయితే చెల్లింపు చేసే ముందు ఆఫర్ నిబంధనలు చూసుకోవడం మంచిది.
ఈసారి ఫ్లిప్‌కార్ట్ ప్రైస్ క్రాష్, బీబీడీ స్పెషల్స్, టిక్ టాక్ డీల్స్, బ్రాండ్ అవర్స్, డబుల్ డిస్కౌంట్, రష్ అవర్స్ వంటి ప్రత్యేక సేల్ ఈవెంట్లను కూడా తీసుకురానుంది. కొన్ని డీల్స్ పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉండొచ్చు. అందుకే కొనాలనుకున్న ప్రొడక్ట్స్ ధరలను ఇప్పటి నుంచే గమనిస్తే.. సేల్ సమయంలో నిజంగా మంచి డీల్ దొరికిందో లేదో సులభంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కొనేవారు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు కలిపి తుది ధరను చూసుకోవడం మంచిది.
ఇక సేల్ సమయంలో ఫ్లాష్ డీల్స్ కోసం తొందరపడే ముందు, సాధారణ రోజుల్లో ఉన్న ధరతో పోల్చి చూడటం కూడా అవసరం. అలా చేస్తే డిస్కౌంట్ నిజంగా ఎంత ఉందో తెలుస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి మరిన్ని ధరలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ ఆఫర్ల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు షాపింగ్ లిస్ట్ రెడీగా ఉంచుకోవచ్చు. ముందే ప్లాన్ చేసుకోవచ్చు.
Also Read: iPhone 18 Proలో లేనివి ఫోల్డబుల్‌లో ఎందుకు? యాపిల్ చేసిన ఈ 5 ప్రయోగాలు మైండ్ బ్లోయింగ్!