E-Paper
Advertisement

ఫ్రై,బేక్,గ్రిల్ అన్నీ ఒక్క చోటే!రూ.2,599కే ఎయిర్ ఫ్రైయర్

ఫ్రై,బేక్,గ్రిల్ అన్నీ ఒక్క చోటే!రూ.2,599కే ఎయిర్ ఫ్రైయర్
Advertisement

KENT air fryer 4L: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై.. ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. అయితే.. రుచికరమైన స్నాక్స్ తినాలనే కోరికను ఆపుకోవడం చాలా కష్టం. ఇలాంటి వారి కోసమే కెంట్ అద్భుతమైన పరిష్కారంగా.. ‘ఎయిర్ ఫ్రైయర్’లను తీసుకువచ్చింది. ఈ మోడల్ తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు అందిస్తుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

Advertisement

తక్కువ నూనెతో ఆరోగ్యకరమైన వంటలు:

ఈ ఎయిర్ ఫ్రైయర్ మెయిన్ హైలైట్ ఏంటంటే, ఇది సాధారణ వంట పద్ధతులతో పోలిస్తే.. దాదాపు 80% తక్కువ నూనెను ఉపయోగిస్తుంది. అంటే.. మీరు సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ వింగ్స్ వంటి ఐటమ్స్‌ను కేవలం తక్కువ నూనెతో లేదా అసలు నూనె లేకుండా అత్యంత రుచిగా తయారు చేసుకోవచ్చు. దీని వల్ల కొలెస్ట్రాల్ భయం లేకుండా మీకు నచ్చిన స్నాక్స్ రోజూ లాగించేయెచ్చు.

పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ :

Advertisement

ఈ ఎయిర్ ఫ్రైయర్‌లో 1300W పవర్ ఫుల్ హీటింగ్ ఎలిమెంట్ను వాడారు. అలాగే ఇందులో లేటెస్ట్ రాపిడ్ హీట్ సర్క్యులేషన్ ,టెక్నాలజీ ఉంది. దీని వల్ల గాలి వేగంగా ప్రసరించి.. ఆహారాన్ని అన్ని వైపుల నుంచి సమానంగా , వేగంగా ఉడికిస్తుంది. దీని కెపాసిటీ 4 లీటర్లు ఉండటం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు లేదా నలుగురు సభ్యులు ఉండే.. ఫ్యామిలీకి ఇది సరిగ్గా సరి పోతుంది. ఒకే సారి కాస్త ఎక్కువగా స్నాక్స్ లేదా వంటకాలను తయారు చేసుకోవచ్చు.

మల్టీ-ఫంక్షనల్ వంటకాలు:

ఇది కేవలం ఫ్రై చేయడానికి మాత్రమే కాకుండా.. మల్టీపర్పస్‌గా పని చేస్తుంది. ఈ ఒక్క డివైస్‌తో మీరు ఫ్రై , బేక్ , గ్రిల్, రోస్ట్ వంటి రకరకాల వంటలను ఈజీగా చేసుకోవచ్చు. కేక్స్ బేక్ చేయడం, చికెన్ గ్రిల్ చేయడం వంటి ప్రయోగాలను కిచెన్‌లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు.

అడ్జస్టబుల్ టెంపరేచర్, సేఫ్టీ ఫీచర్లు:

వివిధ రకాల ఆహార పదార్థాలకు తగినట్లుగా ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఇందులో ప్రత్యేకమైన నాబ్ ఇచ్చారు. దీని సహాయంతో ఉష్ణోగ్రతను 80 నుంచి 200 డిగ్రీల సెల్సియస్ వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. అంతే కాకుండా.. వంట పూర్తయిన తర్వాత డివైస్ దానంతట అదే ఆగి పోయే ఆటో కట్-ఆఫ్ ఫీచర్ ఇందులో ఉంది. దీ నివల్ల ఆహారం మాడిపోకుండా సురక్షితంగా ఉంటుంది. అంతే కాకుండా కరెంట్ కూడా ఆదా అవుతుంది. దీనిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి మహిళలకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

Also Read: రూ.7,190కే 5 స్టార్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు చూస్తే మతిపోతుంది!

ధర:

మార్కెట్లో లభిస్తున్న ఇతర బ్రాండ్ల ఎయిర్ ఫ్రైయర్లతో పోలిస్తే.. కేవలం రూ. 2,599 ధరకే లభిస్తున్న ఈ మోడల్ నిజంగా ఒక బెస్ట్ డీల్. తక్కువ బడ్జెట్‌లో.. ఆరోగ్యకరమైన లైఫ్‌ స్టైల్ కోరుకునే ప్రతి ఒక్కరూ తమ కిచెన్‌లో కచ్చితంగా ఉంచుకోవాల్సిన గాడ్జెట్ ఇది.

Related News

చిరు వ్యాపారులకు NPCI బంపర్ ఆఫర్.. యూపీఐ వాడితే ఇకపై క్యాష్‌బ్యాక్, సౌండ్ బాక్స్ ఫ్రీ!

జియో బంపరాఫర్.. ఆ ప్లాన్‌పై 84 రోజులు నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్!

చిన్నరూమ్స్ కోసం బెస్ట్ స్మార్ట్ టీవీ..తక్కువ ధరలో 1000+ యాప్స్,వాయిస్ కంట్రోల్ ఫ్రీ!

క్రేజీ ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న Huawei MatePad 11.5..ధర ఎంతంటే?

డబ్బు మనది.. పర్మిషన్ నెటిజన్లది, వైరల్‌ చైనా యాప్ కథేంటి?

జియో అదిరిపోయే ఆఫర్.. రూ.111, రూ.459 రీఛార్జ్‌లపై.. ఫ్రీగా స్నాప్‌చాట్ సబ్‌స్క్రిప్షన్!

BSNL ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్.. జస్ట్ రూ.1 కే 24 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ డేటా, ఫ్రీ కాల్స్!

Big Stories

Advertisement
×