E-Paper
Advertisement

క్రేజీ ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న Huawei MatePad 11.5..ధర ఎంతంటే?

క్రేజీ ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న Huawei MatePad 11.5..ధర ఎంతంటే?
Advertisement

Huawei MatePad 11.5: టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం ఉపయోగించే గాడ్జెట్లు కూడా అప్‌డేట్ అవుతున్నాయి. సాధారణ ఎంటర్ టైన్మెంట్ కోసం మాత్రమే కాకుండా, ఆఫీస్ వర్క్ , ఆన్‌లైన్ క్లాసుల కోసం చాలా మంది ఇప్పుడు ల్యాప్‌టాప్‌లకు బదులుగా.. పవర్-ఫుల్ ట్యాబ్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవకే చెందుతుంది Huawei MatePad 11.5 With Keyboard. కేవలం రూ. 33,999 ధరలో లభిస్తున్న ఈ మోడల్ మార్కెట్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిస్‌ప్లే, విజువల్ ఎక్స్‌పీరియన్స్:

ఈ కొత్త హువావే ట్యాబ్‌లో 11.5 ఇంచుల 2.5K ఫుల్‌వ్యూ డిస్‌ప్లేను అందించారు. ఇది 2456 × 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో.. వస్తుంది. అంతే కాకుండా.. ఇది 120Hz స్మార్ట్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల స్క్రీన్ స్క్రోలింగ్ ఈజీగా, ఎలాంటి లాగ్స్ లేకుండా ఉంటుంది. పేపర్‌ మ్యాట్ డిస్‌ప్లే టెక్నాలజీ.. కారణంగా కంటిపై పడే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. స్టూడెంట్స్ ఎక్కువ సేపు చదువుకోవడానికి, ఈ-బుక్స్ చదవడానికి ఈ స్క్రీన్ చాలా బాగుంటుంది.

Advertisement

పవర్-ఫుల్ పెర్ఫార్మెన్స్, స్టోరేజ్:
మల్టీటాస్కింగ్ లవర్స్ కోసం ఇందులో పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను అందించారు. దీనికి తోడు 8 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. దీని వల్ల హెవీ యాప్స్ రన్ చేయడం..ఒకే సమయంలో వేర్వేరు ట్యాబ్స్ ఓపెన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఫోటోలు, వీడియోలు, పెద్ద డాక్యుమెంట్లు అన్నీ స్టోర్ చేసుకోవడానికి 256GB మెమరీ సరిపోతుంది. హార్మొనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పని చేసే ఈ టాబ్ పీసీ తరహా ఫీల్ ఇస్తుంది.

కీబోర్డ్ సపోర్ట్, ప్రొడక్టివిటీ:

ఈ ప్యాకేజింగ్‌లో ముఖ్యంగా.. చెప్పుకోవాల్సింది దీని స్మార్ట్ కీబోర్డ్ గురించే. దీనికి అటాచ్ చేయగల.. కీబోర్డ్ రావడం వల్ల, ఇది సాధారణ ట్యాబ్ లా కాకుండా చిన్న ల్యాప్‌ టాప్‌లా మారి పోతుంది. టైప్ చేయడం, అఫీస్ డాక్యుమెంట్లు తయారు చేయడం, ఈమెయిల్స్ పంపడం వంటి పనులను ఎంతో వేగంగా పూర్తి చేయెచ్చు. ఆన్‌ లైన్ క్లాసులు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ గాడ్జెట్ అని చెప్పొచ్చు.

Advertisement

Also Read: రూ.7,190కే 5 స్టార్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు చూస్తే మతిపోతుంది!

బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్:

ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా రోజంతా పని చేయడానికి వీలుగా ఇందులో.. పెద్ద 10,100 mAh బ్యాటరీను వాడారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 14.. గంటల పాటు నిరంతరం వీడియో ప్లేబ్యాక్ లేదా వర్క్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. 40 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే.. బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది.

కెమెరా,ఇతర ఫీచర్లు:

ఫోటో గ్రఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ట్యాబ్ వెనుక భాగంలో 13 MP ఆ టోఫోకస్ కెమెరాను అందించారు. అలాగే ఆఫీస్ మీటింగ్స్, ఆన్‌లైన్ క్లాసుల కోసం ముందు వైపు 8 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఆడియో ఫీల్ మెరుగు పరచడానికి నాలుగు స్పీకర్లు, రెండు మైక్రోఫోన్లు, హువావే హిస్టెన్ 9.0 సౌండ్ టెక్నాలజీని ఉపయోగించారు. Wi-Fi 6, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.

మార్కెట్లో లభిస్తున్న ధర, ఫీచర్లను పరిశీలిస్తే.. రూ. 33,999కే లభించే ఈ మోడల్ నిజంగా ఒక వాల్యూ ఫర్ మనీ డివైస్. మీరు తక్కువ బడ్జెట్‌లో ఒక చక్కటి పోర్టబుల్ డివైస్ కోరుకుంటే దీన్ని తప్పకుండా కొనొచ్చు.

Related News

డబ్బు మనది.. పర్మిషన్ నెటిజన్లది, వైరల్‌ చైనా యాప్ కథేంటి?

జియో అదిరిపోయే ఆఫర్.. రూ.111, రూ.459 రీఛార్జ్‌లపై.. ఫ్రీగా స్నాప్‌చాట్ సబ్‌స్క్రిప్షన్!

BSNL ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్.. జస్ట్ రూ.1 కే 24 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ డేటా, ఫ్రీ కాల్స్!

రూ.7,190కే 5 స్టార్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు చూస్తే మతిపోతుంది!

రూ.749కే ‘హామర్ వేవ్’బ్లూటూత్ స్పీకర్..ఫీచర్లు చూస్తే అస్సలు వదలరు!

రూ.999కే 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో..ఇయర్ బడ్స్,డోంట్ మిస్

తక్కువ ధరలో..స్టైలిష్ లుక్స్‌తో సరికొత్త స్పీకర్,సౌండ్ నెక్స్ట్ లెవెల్!

Big Stories

Advertisement
×