Jio Netflix Offer: రిలయన్స్ జియో తన యూజర్ల కోసం మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులో ఉంటుంది. ఫ్రీ కాల్స్, అధిక డేటాతో పాటు నెట్ ఫ్లిక్స్ ను ఉచితంగా కోరుకునేవారి కోసం రూ. 1,299 పరిచయం చేసింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా నిర్ణీత కాలానికి నెట్ ఫ్లిక్స్ మెుబైల్ వెర్షన్ కంటెంట్ ను ఉచితంగా వీక్షించే వెసులుబాటు దక్కనుంది. ఈ నేపథ్యంలో రూ.1,299కి సంబంధించిన మరిన్ని బెనిఫిట్స్ గురించి ఈ కథనంలో చూద్దాం.
ఈ ప్లాన్ ను జియో 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకుంటే నెట్ ఫ్లిక్స్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ తో పాటు ప్రతీ రోజూ యూజర్లకు 2GB డేటా లభించనుంది. అలాగే దేశంలోని ఏ నెట్ వర్క్ కైనా అపరిమితంగా ఫ్రీ కాల్స్ చేసుకోచవచ్చు. దీంతో రోజుకు 100 ఎస్ఎంఎస్ లను సైతం జియో ఈ ప్లాన్ కింద అందిస్తోంది.
ఈ ప్లాన్ లో నెట్ ఫ్లిక్స్ మెుబైల్ వెర్షన్ తో పాటు జియో హాట్ స్టార్ ను సైతం ఉచితంగా జియో ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా జియో టీవీ యాప్ కంటెంట్ ను ఫ్రీగా వీక్షించే యాక్సెస్ ను సైతం అందిస్తోంది. దీంతో పాటు 12 నెలల పాటు కాన్వా ప్రో లైట్ సబ్ స్క్రిప్షన్ ను సైతం యూజర్లు పొందొచ్చని జియో వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఇదే ప్లాన్ కింద అర్హులైన యూజర్లకు అపరిమిత 5G డేటాను సైతం జియో అందిస్తుంది. 5G మెుబైల్ ఉండి.. 5G నెట్ వర్క్ పరిధిలో ఉన్న యూజర్లు ఈ సేవలను వినియోగించుకోవచ్చని జియో వర్గాలు చెబుతున్నాయి. అలా వీలులోని పక్షంలో ప్రతీరోజూ జియో అందించే 2GB డేటాతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.
Also Read: ఏపీలో మళ్లీ మోగిన ఎన్నికల నగారా.. నేడు పెండింగ్ పురపాలికలు.. రేపు తొలి దశ పంచాయతీలకు నామినేషన్లు!