Phone Obsolete| స్మార్ట్‌ఫోన్లు ఈ రోజుల్లో మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. కేవలం ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు మాత్రమే కాకుండా, బ్యాంకింగ్, ఆన్‌లైన్ పేమెంట్లు, క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్లు వంటి రోజువారీ అవసరాలను తీరుస్తాయి. మీరు మీ ఫోన్‌ను చాలా కాలం నుంచి ఉపయోగిస్తుంటే, అది మార్చాల్సిన సమయం వచ్చినట్లు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ప్రతి నెలా కొత్త ఫోన్ మోడల్స్ వస్తున్నాయి, అయితే అందుకని మీ ఫోన్ పాతదైపోయిందని కాదు. కొత్త ఫోన్ కొనే ముందు, మీ ఫోన్ ఎన్నాళ్లుగా ఉపయోగిస్తున్నారు, దానిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చూడాలి. నిర్ణయం తీసుకునే ముందు కొన్ని విషయాలను గమనించాలి.
అప్‌డేట్స్ చూడండి
మొదట, మీ ఫోన్‌కు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తున్నాయా? లేదా? అని చెక్ చేయండి. కొన్ని బ్రాండ్లు 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తాయి. కానీ కొన్ని 2 సంవత్సరాలు మాత్రమే ఇస్తాయి. సగటున 4-5 సంవత్సరాలు అప్‌డేట్స్ వస్తాయి. మీ ఫోన్ కొని ఈ సమయం దాటితే, కొత్త ఫోన్ గురించి కొనేందుకు ఆలోచించాలి. అయితే మీ అవసరాలు.. ఫోన్ ఉపయోగం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.
తర్వాత, మీ ఫోన్ స్లోగా రన్ అవుతుందా లేదా తరచూ హ్యాంగ్ అవుతుందా అని గమనించండి. పాత ఫోన్లు కొత్త టెక్నాలజీతో పోటీపడలేవు. కొత్త ఫోన్ కొనాలనుకుంటే మీ బడ్జెట్ కూడా ముఖ్యం. ఫోన్ స్లో అవడం వల్ల పనులు ఆలస్యమవుతాయి, అందుకే అప్‌గ్రేడ్ ఆలోచించడం మంచిది.
బ్యాటరీ, హార్డ్‌వేర్ సమస్యలు
చివరగా, ఫోన్ బ్యాటరీ దెబ్బతిన్నా లేదా హార్డ్‌వేర్ సమస్యలు తలెత్తుతుంటే, కొత్త ఫోన్ తీసుకోవడం మంచిది. ఒకసారి హార్డ్‌వేర్ సమస్య వస్తే, మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే, పాత ఫోన్లలో కొన్ని యాప్స్ సపోర్ట్ చేయకపోవచ్చు. ఇది సెక్యూరిటీ సమస్యలకు దారితీస్తుంది. అలాంటి సందర్భాల్లో పాత ఫోన్‌ను వదిలేసి కొత్తది కొనడం తెలివైన నిర్ణయం.
మీ ఫోన్ ఎలా పనిచేస్తోంది, మీ అవసరాలు ఏమిటి, బడ్జెట్ ఎంత అనే విషయాలను బేరీజు వేసుకుని కొత్త ఫోన్ కొనే నిర్ణయం తీసుకోవాలి. సరైన సమయంలో ఫోన్ మార్చడం వల్ల మీ పనులు సాఫీగా సాగుతాయి, సెక్యూరిటీ సమస్యలు కూడా తప్పుతాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, మీకు సరిపడే స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోండి.
జూన్ నెలలో రూ.50,000 లోపు బడ్జెట్‌లో గొప్ప ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. గేమింగ్, ఫోటోగ్రఫీ, రోజువారీ ఉపయోగం కోసం ఈ ఫోన్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు రియల్‌మీ GT 7, వన్‌ప్లస్ 13R, సామ్‌సంగ్ గెలాక్సీ A56, iQOO 12 వంటి ఫోన్లు టాప్ ఎంపికలు.
రియల్‌మీ GT 7: రూ.39,999 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల AMOLED స్క్రీన్, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 6,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. డైమెన్సిటీ 9400e ప్రాసెసర్ శక్తివంతమైన పనితీరును ఇస్తుంది. 7,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 15 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది. 50MP కెమెరా కూడా బాగుంది.
వన్‌ప్లస్ 13R: రూ.42,999 నుంచి, ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల AMOLED స్క్రీన్, 4,500 నిట్స్ బ్రైట్‌నెస్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉన్నాయి. 6,000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, 4 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, AI ఫీచర్లు ఆకర్షణీయం.
సామ్‌సంగ్ గెలాక్సీ A56: రూ.41,999 నుంచి, 6.7-అంగుళాల సూపర్ AMOLED స్క్రీన్, ఎక్సినోస్ 1580 ప్రాసెసర్, 50MP కెమెరా, 6 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఉన్నాయి. స్టైలిష్ డిజైన్ ఉంది.
iQOO 12: రూ.50,000 లోపు, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3, 144Hz AMOLED స్క్రీన్, 5,000mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్, 50MP ట్రిపుల్ కెమెరాతో ఇది శక్తివంతమైన ఎంపిక.
ఈ ఫోన్లు బడ్జెట్‌లో అద్భుత పనితీరు, డిస్‌ప్లే, బ్యాటరీ జీవితాన్ని అందిస్తాయి. మీ అవసరాలు, బడ్జెట్ ఆధారంగా ఎంచుకోండి.