Akhil Akkineni Wedding: కొన్ని బంధాలు ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తాయో ఎవరం చెప్పలేం. మరికొన్ని బంధాలు విడిపోయినా కూడా బలంగా ఉంటాయి. అలాంటి గట్టి బంధమే అక్కినేని అఖిల్ – సమంతలది. వదిన.. తల్లి తరువాత తల్లి లాంటింది అంటారు. అఖిల్ కూడా సామ్ ను తల్లిలానే భావించేవాడు. అక్కినేని నాగ చైతన్య- సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటి పెద్ద కోడలిగా అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అఖిల్ ఆమెను ఒకేలా గౌరవించాడు. గౌరవిస్తూనే వస్తున్నాడు.
చై – సామ్ మధ్య రిలేషన్ ఎలా ఉండేదో అందరికి తెలుసు. కానీ, అంతకుమించిన బంధం అఖిల్ – సమంతల మధ్య ఉండేది. సామ్ ఎప్పుడు అఖిల్ ను తన చిన్న తమ్ముడిలా భావించేది అంట. అఖిల్ కూడా.. వదినను ఎంతో ప్రొటెక్ట్ చేసేవాడు. ఎక్కడికి వెళ్లినా.. అన్న లేకపోతే అయ్యగారే వదినకు బాడీగార్డ్. అయ్యగారిని సామ్ ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉండేదట. ఇప్పుడు అయ్యగారు పెళ్లిచేసుకున్నాడు. నేటి ఉదయం జైనబ్ రవ్జీ మెడలో అఖిల్ మూడు ముళ్ళు వేశాడు. అక్కినేని ఇంట ఎంతో ఆనందకరమైన వేడుక జరుగుతున్న వేళ.. అక్కినేని ఇంట సామ్ లేదు. ప్రస్తుతం ఇదే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతుంది.
చై – సామ్ మ్యారేజ్ ఎంత గ్రాండ్ గా జరిగిందో అందరికీ తెల్సిందే. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా డ్యాన్స్ చేస్తూ ఎంతో ఆనందంగా వారి పెళ్లి జరిపించారు. ముఖ్యంగా అఖిల్ అయితే.. అన్న పెళ్లిని దగ్గరుండి చూసుకున్నాడు. పెళ్లి కొడుకును చేయడం దగ్గర నుంచి మండపం వద్దకు తీసుకెళ్ళేవరకు అన్న పక్కనే కనిపించాడు. వదిన సామ్ ని కూడా పెళ్ళిలో ఆట పట్టిస్తూ.. డ్యాన్స్ లు వేస్తూ సంతోషంగా కనిపించాడు. ఇప్పుడు అఖిల్ పెళ్ళిలో సామ్ ఉంటే అదే పని చేసేది. ఎంతో ఆనందంగా మరిదిని దగ్గరుండి రెడీ చేసేది. అక్కినేని ఇంట సామ్ నవ్వుతూ పెళ్లికి వచ్చిన గెస్టులను రిసీవ్ చేసుకుంటూ కనిపించేది. అఖిల్ పెళ్ళిలో సామ్ లేని లోటు కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
చై – సామ్ విడిపోయాక కూడా అఖిల్ చాలాసార్లు సామ్ గురించి మాట్లాడాడు. సామ్ సైతం అఖిల్ కి బర్త్ డే విషెస్ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. వదినా మరిదిగా వారు విడిపోయినా.. అంతకుమించిన ప్రేమ బంధం వారి మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. పైకి చెప్పకపోయినా.. సామ్ కూడా అఖిల్ విషయంలో ఇదే అనుకుంటూ ఉండొచ్చు. పెళ్లి తరువాత సామ్ కచ్చితంగా అఖిల్ కు బెస్ట్ విషెస్ చెప్తుంది అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక సామ్ ప్లేస్ ను రీప్లేస్ చేసిన శోభితా.. అక్కినేని ఇంట పెద్ద కోడలి హోదాలో ఎంతో హుందాగా కనిపించింది. చై- శోభితా పట్టు బట్టల్లో అఖిల్ పెళ్ళికి హాజరయ్యారు. కొత్త జంట చూడముచ్చటగా ఉంది. టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయ్యగారి కొత్త జీవితం బావుండాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.