స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో లావా, iQOO, మోటోరోలా వంటి బ్రాండ్‌లు తమ లో బడ్జెట్ 5G ఫోన్‌లతో గొప్ప ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ ఫోన్‌లు తక్కువ ధరలోనే అద్భుతమైన పనితీరును అందిస్తాయి. అయితే ఈ మూడు బ్రాండ్లకు చెందిన కొత్త ఫోన్లు లావా బ్లేజ్ AMOLED 2 5G, iQOO Z10 లైట్ 5G, మోటో G45 5G ఫోన్‌లను ఫీచర్లను పోల్చి ఏది బెటర్ అనేది తెలుసుకుందాం.
లావా బ్లేజ్ AMOLED 2 5G: 6GB RAM + 128GB స్టోరేజ్‌తో ₹13,499
iQOO Z10 లైట్ 5G: 6GB RAM + 128GB స్టోరేజ్‌తో ₹10,999
మోటో G45 5G: 4GB RAM + 128GB స్టోరేజ్‌తో ₹10,999
ధర విషయంలో iQOO, మోటో G45 తక్కువ ధరతో లావా బ్లేజ్ కంటే బెటర్. అయితే iQOO ముందంజలో ఉంది.
లావా బ్లేజ్ AMOLED 2 5G: 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Full HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. AMOLED స్క్రీన్ రంగులు స్పష్టంగా, లోతుగా కనిపిస్తాయి.
iQOO Z10 లైట్ 5G: 6.74-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్. ఇది మంచి స్క్రీన్ అయినప్పటికీ, AMOLEDతో పోలిస్తే కొంచెం తక్కువ క్వాలిటీ.
మోటో G45 5G: 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 720×1600 రిజల్యూషన్. ఇది సరళమైన డిస్‌ప్లే అయినప్పటికీ, లావా యొక్క AMOLED స్క్రీన్‌తో పోటీ పడలేదు.
అంటే డిస్‌ప్లే విషయంలో లావా స్వల్ఫ ఆధిక్యంలో ఉంది.
లావా బ్లేజ్ AMOLED 2 5G: MediaTek Dimensity 7060 ప్రాసెసర్‌తో పవర్ ఫుల్ పనితీరు అందిస్తుంది.
iQOO Z10 లైట్ 5G: MediaTek Dimensity 6300 6nm ఆక్టా-కోర్ ప్రాసెసర్, రోజువారీ ఉపయోగానికి సరిపోతుంది.
మోటో G45 5G: Qualcomm Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌తో మంచి గేమింగ్, మల్టీటాస్కింగ్ అనుభవాన్ని ఇస్తుంది.
లావా బ్లేజ్ AMOLED 2 5G: స్టాక్ ఆండ్రాయిడ్ 12తో ఈజీ, క్లిన్ ఇంటర్‌ఫేస్.
iQOO Z10 లైట్ 5G: ఆండ్రాయిడ్ 15, Funtouch OS 15తో కొత్త టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
మోటో G45 5G: ఆండ్రాయిడ్ 14తో వస్తుంది, ఇది లావా కంటే కొత్త వెర్షన్.
ఇక్కడ iQOO ముందంజలో ఉంది.
లావా బ్లేజ్ AMOLED 2 5G: 6GB RAM (LPDDR5) + 128GB UFS 3.1 స్టోరేజ్, 6GB వర్చువల్ RAM.
iQOO Z10 లైట్ 5G: 4GB, 6GB, లేదా 8GB RAM (LPDDR4x) + 128GB లేదా 256GB స్టోరేజ్ ఆప్షన్లు.
మోటో G45 5G: 8GB RAM (LPDDR4x) + 128GB UFS 2.2 స్టోరేజ్, 16GB వర్చువల్ RAM.
iQOO అగ్రస్థానంలో ఉంది.
లావా బ్లేజ్ AMOLED 2 5G: 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్.
iQOO Z10 లైట్ 5G: 6,000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ లైఫ్ అద్భుతం.
మోటో G45 5G: 5,000mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్.
iQOO లో పెద్ద బ్యాటరీ ఉంది. కానీ ఛార్జింగ్ విషయంలో లావా పై చేయి సాధించింది.
లావా బ్లేజ్ AMOLED 2 5G: 50MP AI ప్రైమరీ కెమెరా + 8MP ఫ్రంట్ కెమెరా.
iQOO Z10 లైట్ 5G: 50MP ప్రైమరీ + 2MP డెప్త్ సెన్సార్ + 5MP ఫ్రంట్ కెమెరా.
మోటో G45 5G: 50MP ప్రైమరీ + 2MP మాక్రో లెన్స్ + 16MP ఫ్రంట్ కెమెరా, సెల్ఫీలకు ఉత్తమం.
కెమెరా పరంగా మోటో G45 సూపర్.
లావా బ్లేజ్ AMOLED 2 5G: AMOLED డిస్‌ప్లే మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఆకర్షణీయంగా ఉంది.
iQOO Z10 లైట్ 5G: పెద్ద 6,000mAh బ్యాటరీ, బహుళ RAM ఆప్షన్లతో బడ్జెట్‌లో ఉత్తమం.
మోటో G45 5G: Snapdragon ప్రాసెసర్, 16MP ఫ్రంట్ కెమెరాతో ఒక సమతుల్య ఎంపిక.
మొత్తంగా చూస్తే.. మంచి స్పీడ్, బ్యాటరీ లైఫ్, తక్కువ ధర కావాలనుకుంటే iQOO Z10 లైట్ టాపర్. రెండవ స్థానంలో మోటో G45 5G నిలుస్తుంది.
Also Read: iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్