BigTV English

Laila : వాలెంటైన్స్ డేను టార్గెట్ చేసిన విశ్వక్ సేన్

Laila : వాలెంటైన్స్ డేను టార్గెట్ చేసిన విశ్వక్ సేన్

Laila : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) త్వరలోనే ‘లైలా’ (Laila) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ కెరీర్ లో 12వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీతో రామ్ నారాయణ అనే దర్శకుడు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ ఫస్ట్ లుక్ లో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.


విశ్వక్ సేన్ హీరోగా, రామ్ నారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘లైలా’ (Laila). ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ మూవీకి తనిష్క్ బాగ్చి సంగీతం అందించారు. తాజాగా ‘లైలా’ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ, మేకర్స్ విశ్వక్ సేన్ కొత్త లుక్ ని రిలీజ్ చేశారు. అందులో విశ్వక్ సేన్ స్టైలిష్ గాగుల్స్ ధరించి, డ్యూయల్ ప్యాంట్ తో ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చాడు. ఇక ఈ సినిమాను వాలెంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టుగా ఆ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.

అంతేకాకుండా లైలా ఫస్ట్ గులాబీని 2025 న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నామంటూ క్యూరియాసిటీని పెంచారు. మొత్తానికి వాలెంటైన్స్ డేకు ఎంటర్టైమెంట్ బ్లాస్ట్ ఉండబోతుందని రిలీజ్ డేట్ ను, అలాగే న్యూ ఇయర్ కి ‘లైలా ఫస్ట్ గులాబి’ అనే పేరుతో టీజర్ ను రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు.


కాగా విశ్వక్ సేన్ కు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. ఒక్క ‘గామి’ సినిమా తప్ప, ఆయన హీరోగా నటించిన మిగతా సినిమాలేవి పెద్దగా ఆడలేదు. ముఖ్యంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ‘మెకానిక్ రాఖీ’ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ‘మెకానిక్ రాఖీ’ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించారు. నవంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

దీంతో ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ, విశ్వక్ సేన్ ఖాతాలో రెండు డిజాస్టర్లు పడడం గమనార్హం. అందుకే విశ్వక్ సేన్ ఇప్పుడు ఆశలన్నీ ‘లైలా’ (Laila) సినిమా పైన పెట్టుకున్నారు. పైగా ఈ సినిమాలో ఆయన మొదటిసారి లేడి గెటప్ లో కనిపించబోతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే మిడ్ రేంజ్ సినిమాలకు డేట్లు దొరకడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. అందుకేనేమో ముందుగానే సినిమా జానర్ కు తగ్గట్టుగా ‘లైలా’ (Laila) మేకర్స్ రిలీజ్ డేట్ కోసం ముందుగానే వాలంటైన్స్ డే రోజను ఖరారు చేశామని ప్రకటించారు. మరి వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే విశ్వక్ సేన్ కు కలిసి వస్తుందా అనేది చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×