Budget Smartphone: భారతీయ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా మరోసారి సంచలనం సృష్టించింది. ఈసారి ఏకంగా ఐఫోన్ 16 ప్రోను పోలి ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. దీని ధర రూ. 7,000 లోపు ఉండటం విశేషం. లావా గత సంవత్సరం ఆకట్టుకునే ఫీచర్లతో బడ్జెట్ ఫోన్‌ల శ్రేణిని ప్రారంభించింది. ఈ సంవత్సరం కూడా అదే ధోరణిని కొనసాగిస్తోంది.
ఐఫోన్ 16 ప్రోకు పోటీ
ఈ క్రమంలోనే లావా షార్క్ పేరుతో కొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఐఫోన్ 16 ప్రోను పోలి ఉంది. ఈ ఫోన్ ధర రూ. 6,999 మాత్రమే కావడం విశేషం. దీంతో ఇది రియల్‌మీ, రెడ్‌మి, పోకో, ఇన్ఫినిక్స్ వంటి బ్రాండ్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
లావా షార్క్ రంగు
లావా షార్క్ రెండు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. టైటానియం గోల్డ్, స్టీల్త్ బ్లాక్. ఈ ఫోన్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అయితే దీనిని 8GB RAMకి విస్తరించుకోవచ్చు. వినియోగదారులు మైక్రో SD కార్డ్ ద్వారా నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
Read Also: Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్.
లావా షార్క్ స్పెసిఫికేషన్లు
లావా షార్క్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే, ఇది 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ పరికరం ప్రీమియం పంచ్-హోల్ డిజైన్‌ను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో నీరు, ధూళి నిరోధకతను అందిస్తుంది. ఈ ఫోన్ యూనిసోక్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది రోజువారీ పనులకు మంచి పనితీరును నిర్ధారిస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్
లావా షార్క్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W USB టైప్-C ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుంది. ఈ ఫోన్ Android 14పై నడుస్తుంది. కనెక్టివిటీ కోసం, ఇది డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.0, Wi-Fi వంటి ఫీచర్లను కలిగి ఉంది.
కెమెరా ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం లావా షార్క్ మోడల్లో వెనుకవైపు 50MP AI కెమెరాను అందిస్తున్నారు. ఇది అద్భుతమైన ఫోటోలు తీసుకోవడానికి సహాయపడుతుంది. 8MP ముందు కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఉపయోగించుకోవచ్చు. కెమెరా మాడ్యూల్ ఐఫోన్ 16 ప్రోను పోలి ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వెనుకవైపు LED ఫ్లాష్‌తో వస్తుంది.
ప్రధాన ఫీచర్లు
-5000mAh బ్యాటరీ
-18W USB టైప్-C ఛార్జింగ్
-Android 14 ఆపరేటింగ్ సిస్టమ్
-డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.0, Wi-Fi
-కెమెరా ఫీచర్లు
-వెనుక 50MP AI కెమెరా (LED ఫ్లాష్‌తో)
-ముందు 8MP సెల్ఫీ కెమెరా
తక్కువ ధరకే
లావా షార్క్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో గట్టి పోటీదారుగా నిలుస్తోందని చెప్పవచ్చు. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. డిజైన్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వంటి అన్ని అంశాల్లో ఇది ఆకట్టుకునేలా ఉంది. కేవలం రూ. 6,999 ధరలో ఇలాంటి ఫోన్ అందుబాటులో ఉండడం వినియోగదారులకు మంచి అవకాశమని చెప్పవచ్చు.
Read Also: BHIM 3.0: భీమ్ యూపీఐ కొత్త వెర్షన్..మరింత ఫాస్ట్, …