Best Inverter For Home Under 6000: ఎండాకాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా మనల్ని వేధించే ప్రధాన సమస్య కరెంట్ కోతలు. కరెంట్ పోతే ఇంట్లో.. ఫ్యాన్ తిరగక, లైట్ వెలగక నరకం కనిపిస్తుంది. ఇలాంటి టైమ్‌లో.. మసక చీకట్లను తరిమికొట్టేందుకు బడ్జెట్ ధరలో ఒక సూపర్ సొల్యూషన్ వచ్చేసింది. అదే Luminous Eco Watt Plus 750 Square Wave Inverter. కేవలం రూ.5,299 కే లభిస్తున్న ఈ లూమినస్ ఇన్వర్టర్, మిడిల్ క్లాస్ ఇళ్లకు ఎలా పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుందో.. దీని స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ఇన్వర్టర్ అనగానే మెజారిటీ ప్రజలకు గుర్తొచ్చే నమ్మకమైన బ్రాండ్ ‘లూమినస్’. బడ్జెట్ రేంజ్‌లో ఐకానిక్ మోడల్‌గా తీసుకొచ్చిన ఇన్వర్టరే ఈ Luminous Eco Watt Plus 750. చిన్న కుటుంబాలు, సింగిల్ బెడ్‌రూమ్ లేదా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ఇది ఒక బెస్ట్ పవర్‌హౌస్‌గా నిలుస్తుంది. మరి ఇంత తక్కువ ధరకే లభిస్తున్న ఈ స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్‌లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు ఏంటో ఒక లుక్కేద్దామా.
ఈ లూమినస్ ఎకో వాట్ ప్లస్ 750 ఇన్వర్టర్ 675 VA కెపాసిటీతో , 567 Watts రేటెడ్ పవర్‌తో వస్తుంది. అంటే కరెంట్ పోయినప్పుడు మీ ఇంట్లో ఉన్న అవసరమైన వస్తువులను ఇది ఈజీగా రన్ చేయగలదు. నార్మల్‌గా దీనిపై..
3 ఫ్యాన్లు
3 ట్యూబ్ లైట్లు లేదా LED బల్బులు
1 టీవీ
ల్యాప్‌టాప్ , మొబైల్ ఛార్జర్లు
వీటన్నింటినీ ఒకేసారి ఎలాంటి లోడ్ టెన్షన్ లేకుండా చాలా స్మూత్‌గా రన్ చేసుకోవచ్చు.
ఈ ఇన్వర్టర్ లో ఉన్న ఒక క్రేజీ ఫీచర్ ఏంటంటే.. ఇందులో Advanced Three-Stage Charging మైక్రోకంట్రోలర్ ఆధారిత డిజైన్‌ను ఇచ్చారు. ఇది బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేయడమే కాకుండా.. బ్యాటరీ లైఫ్‌ని కూడా పెంచుతుంది. బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయినప్పుడు కూడా ఇది చాలా తక్కువ వోల్టేజ్ (దాదాపు 95V) వద్ద నుంచే ఛార్జింగ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. దీని వల్ల వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్న ఏరియాల్లో కూడా ఇది తోపులా పనిచేస్తుంది.
రూ.5,299 ధరలోనే లూమినస్ సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడలేదు. ఇందులో ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, బ్యాటరీ రివర్స్ పొలారిటీ ప్రొటెక్షన్ , డీప్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంటే ఇంట్లో ఏవైనా హై-లోడ్ వస్తువులు కనెక్ట్ చేసినా లేదా షార్ట్ సర్క్యూట్ అయినా ఇన్వర్టర్ ఆటోమేటిక్‌గా పవర్ కట్ చేసి అలర్ట్ చేస్తుంది. దీని వల్ల మీ ఇన్వర్టర్ , ఇంట్లోని హోమ్ అప్లయన్సెస్ చాలా సేఫ్‌గా ఉంటాయి.
Also Read: చేతి వేలికే స్మార్ట్ ఫీచర్స్.. రూ.2,999 బడ్జెట్‌లోనే బోట్ స్మార్ట్ రింగ్!
ఈ ఎకో వాట్ ప్లస్ 750 ఇన్వర్టర్ అన్ని రకాల బ్యాటరీలకు సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర ఫ్లాట్ ప్లేట్ బ్యాటరీ ఉన్నా, ట్యూబులర్ బ్యాటరీ ఉన్నా, లేదా లో-మెయింటెనెన్స్ లోకల్ బ్యాటరీ ఉన్నా సరే.. దీని వెనక ఉన్న చిన్న స్విచ్ ద్వారా బ్యాటరీ టైప్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీని ఓవర్ ఛార్జ్ అవ్వకుండా కాపాడుతుంది.
ఇది ఒక Square Wave Inverter. అంటే ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్లతో పోలిస్తే.. ఇది నడుస్తున్నప్పుడు ఫ్యాన్ల నుంచి కొద్దిగా ‘హంమ్మ్’అనే శబ్దం వస్తుంది. అలాగే మిక్సీలు, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్లు లాంటి సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్ దీనిపై రన్ చేయకపోవడమే మంచిది. మీకు సైలెంట్ ఆపరేషన్ కావాలి అనుకుంటే బడ్జెట్ పెంచి సైన్ వేవ్ ఇన్వర్టర్ చూసుకోవాలి.
మీకు బ్రాండెడ్ క్వాలిటీ కావాలి, తక్కువ బడ్జెట్‌లోనే ఇల్లు వెలగిపోవాలి అనుకుంటే Luminous Eco Watt Plus 750 కి తిరుగులేదు. కేవలం రూ.5,299 ధరలో లూమినస్ బ్రాండ్ నమ్మకం, వారంటీ, సాలిడ్ పవర్ బ్యాకప్ లభించడం నిజంగా సూపర్ డీల్. కరెంట్ కోతలకు గుడ్ బై చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.