Inzamam-ul-Haq On IND VS SL Semis: ఆసియా కప్ రైజింగ్ స్టార్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) చివరి దశకు వచ్చేసింది. ఇవాల్టి నుంచి సెమీ ఫైనల్స్ షురూ కానున్నాయి. మొదటి సెమీ ఫైనల్స్ శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా జూనియర్ జట్ల మధ్య ఇవాళ దోహాలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యహ్నాం 3.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరగగా… పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq On IND VS SL Semis) కీలక వ్యాఖ్యలు చేశాడు. యూఏఈపై గెలిచినంత ఈజీగా శ్రీలంక జూనియర్ జట్టుపై టీమిండియా గెలవడం అసాధ్యమని హెచ్చరించాడు.
ఈ మ్యాచ్ లో కచ్చితంగా శ్రీలంక విజయం సాధించి, ఫైనల్ కు దూసుకు వెళ్తుందని అంచనా వేశాడు. ఒకవేళ అదృష్టవశాత్తు టీమిండియా గెలిస్తే మాత్రం.. ఫైనల్స్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. ఈ సారి ఆసియా కప్ టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ నిలుస్తుందని అంచనా వేశాడు. ఎవరిని కుట్రలు చేసినా గెలిచి టైటిల్ తీసుకువెళ్తామని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ స్పష్టం చేశాడు.
టీమిండియా వర్సెస్ శ్రీలంక (IND VS SL ) మధ్య తొలి సెమీ ఫైనల్ ఇవాళ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq ) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సెమీ ఫైనల్స్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు తేలిపోతారని పరువు తీశాడు. యూఏఈ, నేపాల్ పైన ఆడినంత ఈజీగా శ్రీలంకను ఫేస్ చేయడం కష్టమేనని తెలిపాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా టాపార్డర్ కుప్పకూలుతుందని హెచ్చరించాడు. వైభవ్ సూర్యవంశీ మొన్న డబుల్ సెంచరీ చేశాడు కదా..? ఇవాల్టి మ్యాచ్ లో మాత్రం పది పరుగులు కూడా దాటబోడంటూ చురకలు అంటించాడు. పసికూనల పైన మాత్రమే టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడతారని.. పెద్ద జట్ల బౌలర్లను వీళ్లు ఎదుర్కోలేరు అంటూ హేళన చేశాడు. టీమిండియా మొదటి బ్యాటింగ్ చేస్తే 100 లోపు ఆల్ అవుట్ అవుతుందని సెటైర్లు పేల్చాడు. సరే సెకండ్ బ్యాటింగ్ చేస్తే… కనీసం 150 పరుగుల తేడాతో ఓడిపోతుందని పంచనా వేశాడు.