E-Paper
Advertisement

చె*ప్పుతో కొడతా.. మనుషులేనా.. ట్రోలర్స్ పై ఫైర్ అవుతున్న రాధమ్మ కూతురు!

చె*ప్పుతో కొడతా.. మనుషులేనా.. ట్రోలర్స్ పై ఫైర్ అవుతున్న రాధమ్మ కూతురు!
Advertisement

Radhamma kuthuru:కంటెంట్ క్రియేటర్ గా కెరియర్ మొదలుపెట్టి.. “గాజులు గాజులు గాజులు గలగల” అనే పాటతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది రాధమ్మ కూతురు అలియాస్ దివ్య. ఈ ఒక్క పాటతో ఏకంగా 25 మిలియన్ల వ్యూస్ సాధించి క్రేజ్ తెచ్చుకున్న ఈమె.. ఇందులో దుర్గామాత అమ్మవారి దీక్షలో రీల్స్ చేయడం పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ పూలు పెట్టుకొని దుర్గామాత దీక్షలో ఇలా రీల్స్ చేయడం ఏంటి ? అంటూ మండిపడ్డారు. దీంతో దీనికి కౌంటర్ గా మాల తీసిన వెంటనే ఈమె ఏకంగా చెప్పు చూపిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మీరు అసలు మనుషులేనా?

ఈ మేరకు ఆమె తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఒక రేంజ్ లో మండిపడింది రాధమ్మ కూతురు.” చె*ప్పు తీసుకొని కొడతాను. అసలు మీరు మనుషులా? పశువులా.. నోటికి అన్నం తింటున్నారా? లేక గడ్డి తింటున్నారా? నేను దీక్షలో ఉన్నాను. ఏమీ అనను అని చెప్పేసి అన్ని మాటలు ఎలా మాట్లాడుతారు అండి. ఏంటి నేను అమ్మవారి దీక్ష రీల్స్ కోసం తీసుకున్నానా? ఒకసారి నా అకౌంట్ ఓపెన్ చేసి చూడండి.. నా గత వీడియోలలో రెండు రోజులు అమ్మవారి కోసం, మరో రెండు రోజులు మా అమ్మ కోసం, ఒక రెండు రోజులు డాన్స్ వీడియోలు చేసుకున్నాను. అప్పుడు రాని బ్యాడ్ కామెంట్స్… అప్పుడు రాని బ్యాడ్ ట్రోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి?

దీక్ష వేసుకొని రీల్ చేయకూడదా?

Advertisement

ఎందుకంటే నేను ఒక్క రోజులో ఒక్క పాటతో ఆ స్థాయికి వెళ్ళాను కాబట్టి.. ఈరోజు నన్ను ఇంతలా దిగజారి మరీ మాట్లాడుతున్నారా.? నేనేమీ అనను అనుకున్నారా? నాకు ఒక ఫ్యామిలీ ఉంది. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు.. వారంతా ఏమనుకుంటారు అనే జ్ఞానం లేదా? ఒక ఆడపిల్ల మీద అన్ని అభాండాలు ఎలా వేస్తారు? దీక్ష తీసుకున్న వాళ్లు రీల్స్ చేయకూడదు అని ఎక్కడైనా రాసి ఉందా? నేనేమైనా తప్పుడు పని చేశానా ? నేను ఇన్ఫ్లుయెన్సర్ని .. ఇంకొకరిని పెట్టుకోలేదు.. నేను బింద మీద బిందె పెట్టి.. చూపులతో గుచ్చి గుచ్చి లాంటి పాటలు ఏవి నేను పాడట్లేదు. అమ్మవారి పాటలు మాత్రమే పాడుతున్నాను. దానికి తప్పేముంది. ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు.

ALSO READ:గూస్ బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. సైన్స్ కే సవాల్ విసురుతూ!

నా కాలికింది ధూళితో సమానం..

Advertisement

ఆడపిల్ల ఎదిగింది కదా చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎన్ని కామెంట్స్ చేసినా.. ఎన్ని ట్రోల్స్ చేసినా.. నా వెంట్రుకతో కూడా పీకలేరు. బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోండి. ఏమైనా చేసుకోండి.. మీరంతా నా కాలి కింద ధూళితో సమానం.. నన్ను కన్న తల్లి, ఆ దుర్గామాత నా వెంట ఉన్నంతవరకు మీరు ఏం చేసుకోలేరు” అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Tags

Related News

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భద్ర అవుట్..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో సుమతికి ఏమైంది..? అరుణ్, బాలు గొడవ.. ఏడ్చిన ప్రభావతి..

Podarillu Today Episode : మహాకు సారీ చెప్పిన విక్కీ.. మహా మాటతో విక్కీ షాక్.. చక్రీ, మహా కలిసిపోతారా..?

Illu Illalu Pillalu Today Episodes: నర్మదా పై వేదవతి సీరియస్.. అంజలి పై చందు ఫైర్.. ధీరజ్ కు దొరికిన చందు..

Brahmamudi Serial Today Episode November 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ ను భయపెట్టిన భ్రమరాంబ 

Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బకు ఝలక్.. అవనిపై ప్రశంసలు.. ఇది కదా అసలు ట్విస్ట్..

Thursday TV Movies : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

Big Stories

Advertisement
×