E-Paper
Advertisement

ఇంకా పాత గీజరే వాడుతున్నారా? ఈ 5 సంకేతాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి, లేదంటే ప్రమాదం తప్పదు!

ఇంకా పాత గీజరే వాడుతున్నారా? ఈ 5 సంకేతాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి, లేదంటే ప్రమాదం తప్పదు!
Advertisement

Geyser Warning Signs: చలికాలం మొదలవగానే ప్రతి ఇంట్లో గీజర్ వాడకం బాగా పెరిగిపోతుంది. పొద్దున్నే వేడినీళ్లతో స్నానం చేయాలన్నా, వంటగదిలో చిన్నచిన్న పనులకైనా గీజర్ లేనిదే రోజు గడవదు. అయితే, మనం రోజూ వాడే పాత గీజర్ ఉన్నట్టుండి పూర్తిగా ఆగిపోకుండా, పాడయ్యే ముందు కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని మనం గమనించకుండా వదిలేస్తే.. తీరా చలి పెరిగాక రిపేర్ల కోసం సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అంతేకాదు.. నీళ్లు లీక్ అవ్వడం లేదా షాక్ కొట్టడం లాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి.. మీ గీజర్ పాడైపోయే ముందే ఇచ్చే ఆ ముఖ్యమైన వార్నింగ్ సిగ్నల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గీజర్ కింద నీరు కారుతుంటే..

గీజర్ కింద తరచూ నీరు చేరడం లేదా పైపుల దగ్గర తడి కనిపించడం చిన్న విషయం కాదు. ట్యాంక్ లోపల తుప్పు పట్టి లీక్ ఏర్పడి ఉండొచ్చు. అయితే ప్రతిసారీ ట్యాంక్ పాడైందని అనుకోవాల్సిన అవసరం లేదు. పైపు జాయింట్లు వదులవడం, వాల్వ్ లేదా డ్రెయిన్ భాగంలో సమస్య ఉండటం వల్ల కూడా నీరు బయటకు రావచ్చు. కారణం ఏదైనా.. మీరే తెరిచి చూడకుండా టెక్నీషియన్‌తో చెక్ చేయించండి.

వేడి నీటి రంగు మారడం..

Advertisement

కుళాయి నుంచి వచ్చే వేడి నీరు పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తే.. చల్లని నీరు మాత్రం స్పష్టంగా ఉంటే గీజర్ లోపల తుప్పు ఉండే అవకాశం ఉంది. ట్యాంక్‌ను తుప్పు నుంచి కాపాడే యానోడ్ రాడ్ కాలక్రమంలో అరిగిపోతుంది. దాన్ని మార్చాల్సి రావచ్చు. అయినా రంగు మారడం ఆగకపోతే ట్యాంక్ పరిస్థితిని నిపుణుడితో పరీక్షించాలి.

Also Read: ఫ్లాగ్‌షిప్ ఫోన్లకే బాప్ లాంటి Vivo X500.. భారత్ యూజర్ల కోసమే ప్రత్యేకంగా రెడ్ కలర్ వేరియంట్!

గీజర్ నుంచి సౌండ్ రావడం..

Advertisement

గీజర్ నుంచి పాపింగ్, గలగల లేదా గట్టిగా కొట్టినట్టు శబ్దాలు వస్తున్నాయా? నీటిలోని ఖనిజాలు ట్యాంక్ అడుగున పేరుకుపోవడం దీనికి ఒక కారణం. ఆ పొర వేడి సరిగా పాకకుండా అడ్డుకుంటుంది. అలాగే నీరు వేడెక్కేందుకు మునుపటి కంటే ఎక్కువ సమయం పడితే హీటింగ్ ఎలిమెంట్ లేదా థర్మోస్టాట్‌లో లోపం ఉండొచ్చు. ట్యాంక్ శుభ్రం చేయడం లేదా దెబ్బతిన్న భాగాన్ని మార్చడం అవసరమా అనేది టెక్నీషియన్ నిర్ణయించాలి.

రిపేర్లు పెరిగితే మార్చాల్సిందే:

తరచూ రిపేర్లు చేయించాల్సి వస్తూ ఖర్చు పెరుగుతుంటే కొత్త గీజర్ కొనడం మంచిది. స్టోరేజ్ గీజర్లు సుమారు 10 నుంచి 15 ఏళ్లు పనిచేయవచ్చు. ట్యాంక్‌లెస్ మోడళ్లు సరైన మెయింటెనెన్స్‌తో 20 ఏళ్లకు మించి కూడా పనిచేయొచ్చు. నీటి నాణ్యత, వాడకం, సర్వీసింగ్‌ను బట్టి ఈ కాలం మారుతుంది. థర్మోస్టాట్, హీటింగ్ ఎలిమెంట్ వంటి చిన్న సమస్యలు రిపేర్‌తో సరిచేయవచ్చు. కానీ ట్యాంక్ తుప్పు పట్టి లీక్ అవుతుంటే లేదా సమస్యలు మళ్లీ మళ్లీ వస్తుంటే గీజర్ మార్చాల్సిందే. చలికాలం మొదలయ్యే ముందే ఒకసారి సర్వీసింగ్ చేయించుకుంటే ఇబ్బందులు తగ్గుతాయి.

Also Read: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ వచ్చిన రూ.299 రీఛార్జ్ ప్లాన్, కానీ ఒక ట్విస్ట్!

Tags

Related News

రూ.461కే డిజిటల్ డిస్‌ప్లే ఇయర్‌బడ్స్..మార్కెట్‌లో హల్ చల్ చేస్తున్న మోడల్

Airtel సూపర్ ప్లాన్.. రోజూ 2.5GB డేటా, కాల్స్, అమెజాన్ ప్రైమ్, 18+ ఓటీటీలు ఫ్రీ.. ఇంకా మరెన్నో!

ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ వచ్చిన రూ.299 రీఛార్జ్ ప్లాన్, కానీ ఒక ట్విస్ట్!

ఫ్లాగ్‌షిప్ ఫోన్లకే బాప్ లాంటి Vivo X500.. భారత్ యూజర్ల కోసమే ప్రత్యేకంగా రెడ్ కలర్ వేరియంట్!

మీ అకౌంట్ ఖాళీ కావద్దంటే..ఈ ఫేక్ బ్యాంకింగ్ ట్రిక్స్ తప్పక తెలుసుకోండి!

Airtel బాటలో Jio.. ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ రీఛార్జ్ ఆఫర్.. ఏ ప్లాన్లపై వర్తిస్తుందంటే?

చలికాలంలో ఎయిర్ ప్యూరిఫయర్ ఫుల్ స్పీడ్‌తో పనిచేయాలంటే.. ఈ 4 తప్పులు అస్సలు చేయొద్దు!

Big Stories

Advertisement
×