Devni Devi Success Story: జీవితంలో ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి వయసుతో సంబంధం లేదని చాలా మంది అంటుంటారు. మంచి ఉద్దేశం, కష్టపడే తత్త్వం, గుండె ధైర్యం ఉంటే ఏ చిన్న ఆలోచనైనా ఎక్కడికో తీసుకెళ్లగలదని అభిప్రాయపడుతుంటారు. సరిగ్గా దీనిని నిజం చేసి చూపించారు పాట్నాకు చెందిన ఓ మహిళ. 65 ఏళ్ల వయసులో రూ.20కి రుచికరమైన ఆహారాన్ని అందించి.. దానిని ఏకంగా రూ.2.5 కోట్ల బిజినెస్ మలిచారు. ప్రస్తుతం ఈ బామ్మ బిజినెస్ ప్రయాణం ఎంతో మంది స్ఫూర్తిగా నిలుస్తోంది.
‘స్టార్టప్ యూనివర్స్’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ సదరు మహిళ గురించి, ఆమె వ్యాపార ప్రయాణానికి సంబంధించిన విశేషాలను షేర్ చేసింది. ఈ పోస్ట్ ప్రకారం.. దేవ్‌ని దేవి అనే మహిళ తన ఇంటి భోజనంతో ప్రజల హృదయాలను గెలుచుకుని.. ఫుడ్ ఇండస్ట్రీలో అద్భుతాలు సృష్టించారు. 65 ఏళ్ల వయసులో ఆమె పాట్నాలో కేవలం రూ. 20లకే భోజనం అందించడం మొదలుపెట్టారు. తక్కువ ధరలో మంచి భోజనం కోరుకునే విద్యార్థులు, కార్మికులు, కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. అనతి కాలంలోనే ఆమెకు బ్రాండ్ ను తెచ్చిపెట్టింది.
Devni Devi, known as “Amma,” transformed her life from a small Patna kitchen into a ₹2.5 crore food empire (@ammakitchen.patna). Married at 16, she fed a family of 25 for decades before spotting students enduring poor-quality meals. Starting with ₹20 dishes despite family scepticism, her venture now thrives, proving age is no barrier.
👉🏽Building a Legacy Meal by Meal
Amma’s canteen serves nutritious, affordable food to students, scaling from humble beginnings to employ locals and feed thousands daily, as shared in a video by @dil_chahe_ghumna. Her journey highlights grit amid challenges like initial silence from loved ones.
👉🏽Roots of Resilience
Post-marriage, Amma’s days revolved around cooking for 25, honing skills that fuelled her business. The pivotal moment came observing subpar student meals, sparking her solo push against doubts, leading to rapid growth without formal training.
👉🏽The Logical Indian Perspective
Devni Devi’s tale embodies kindness and empathy, turning personal hardship into communal good, fostering harmony through shared nourishment. It inspires us all to embrace second chances for positive change. What dream will you chase, no matter your age?
⚡️⚡When will you turn your passion into purpose?
Devni Devi, Patna kitchen, food empire, Amma canteen, women entrepreneurs, inspirational journey, student meals, The Logical Indian
#DevniDevi #AmmaKitchen #PatnaFoodEmpire #WomenEntrepreneurs #Inspiration #StudentMeals #NeverTooLate #TheLogicalIndian #WomenEmpowerment #WomensDay
— The Logical Indian (@LogicalIndians) March 7, 2026
Also Read: గృహిణులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.1 లక్ష పెట్టుబడితో.. ఇంటి నుంచే చేయగల 4 సూపర్ బిజినెస్‌లు!
రుచి, శుచికి పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తుండటంతో కొద్ది కాలంలోనే ఆమె వద్దకు వచ్చే కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో క్రమంగా ఆమె క్యాటరింగ్ సేవలను సైతం ప్రారంభించారు. అదే సమయంలో ఎక్కువ మందికి తన ఫుడ్ ను అందించే ఉద్దేశంతో ‘అమ్మ కిచెన్’ పేరుతో రెస్టారెంట్ ను సైతం ప్రారంభించారు. తద్వారా రూ. 2.5 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆమె స్థాపించుకున్నారు. కష్టపడే తత్వం, నైపుణ్యం ఉండేలా కానీ.. వ్యాపారాన్ని ప్రారంభించడానికి వయసు ఏమాత్రం అడ్డంకి కాదని దేవ్‌ని దేవి మరోమారు నిరూపించారు.
Also Read: మృత్యుంజయుడు.. ఏనుగు రెండుసార్లు తొక్కినా చెక్కుచెదరలేదు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!