Samantha Father Passes Away: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత (Samantha). ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతుండగా.. ఇప్పుడు మరో విషాదం ఆమెను చుట్టుముట్టింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు (Joseph Prabhu )మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. “నాన్నను ఇక కలవలేను” అంటూ పేర్కొంటూ హార్ట్ బ్రేకింగ్ ఏమోజీ ని షేర్ చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించారు సమంత. ఇక సమంతకు సానుభూతి తెలియజేస్తూ అభిమానులు సెలబ్రిటీలు పోస్ట్లు పెడుతున్నారు.
సమంత తండ్రి మృతి..
సమంత తన తండ్రి మరణించినట్టు ఇంస్టాగ్రామ్ లో అధికారికంగా వెల్లడించింది. కానీ ఆయన ఏ కారణాల చేత మరణించారు అనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు.. సమంతకు ధైర్యం చెబుతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో మరింత ధైర్యంగా ఉండాలని ఆమెకు సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా సమంత తండ్రి మరణించడంతో ఉన్న తోడు కూడా కోల్పోయింది అంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
అన్నీ చేదు జ్ఞాపకాలే..
గత నాలుగు సంవత్సరాలుగా సమంతకు అన్నీ చేదు జ్ఞాపకాలే మిగులుతున్నాయని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఎంతో ఇష్టపడి, ప్రేమించి, పెళ్లి చేసుకున్న నాగచైతన్య (Naga Chaitanya) విడాకుల పేరిట దూరమయ్యారు. అప్పుడే మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంది సమంత. ఇక ఆ బాధ నుంచి బయటపడదామనుకుంటే సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఒకటి.. తనను అసభ్యకరంగా కామెంట్లు చేయడమే కాకుండా ఆమెపై తప్పుడు ఆరోపణలు చేసి, ఆమెను మరింత ఇబ్బందులకు గురి చేశారు. ఈ సమస్యల నుంచి తేరుకునే లోపే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. మయోసైటిస్(Myositis)వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చికిత్స తీసుకోవడానికి విదేశాలకు కూడా వెళ్ళింది. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. అంతేకాదు ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా విరామం ఇచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే ఈ సమస్య నుంచి బయట పడుతూ ఉండగా.. ఇప్పుడు తండ్రి కూడా మరణించడంతో ఈమె మరింత దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారం. ఏదేమైనా సమంత ఇలాంటి కష్ట సమయాలలో మరింత ధైర్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సమంత సినిమాలు..
ఒకవైపు ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమిస్తున్న ఈమె.. మరోవైపు సినిమాలతో అభిమానులకి మంచి వినోదాన్ని పంచుతోంది. అందులో భాగంగానే ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె, ఇందులో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. ముఖ్యంగా విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె, మరొకవైపు నిర్మాతగా మారింది. తాజాగా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నిర్మిస్తున్న సమంత.. సినిమాను ప్రకటించింది కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. మరొకవైపు హిందీలో వరుస సినిమాలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తోంది.