Internet Safety For Teenagers : డిప్రెషన్… వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. నిజానికి ఈ సమస్యతో బాధపడే వారిలో టీనేజర్స్ ఎక్కువగా ఉన్నారనే విషయం తాజా అధ్యయనంలో తేలడంతో ప్రతీ ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది. ఆన్లైన్లో ఎక్కువగా గడిపే పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా పేరెంట్స్ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలుపుతున్నారు.
భోపాల్ ఎయిమ్స్ కు చెందిన పలువురు విద్యార్థులు చేసిన అధ్యయనంలో టీనేజ్ పిల్లలు ఆన్లైన్తో ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో తేలింది ఇందులో షాపింగ్ విషయాలు సైతం బయటపడ్డాయి. ఆన్ లైన్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ దాదాపు 33.1% టీనేజర్స్ డిప్రెషన్ తో బాధపడుతున్నారని, 24.9% మంది తెలియని ఆందోళనతో సతమతమవుతున్నారని తేలింది. నిజానికి ఈ విషయం టీనేజర్స్ కన్నా తల్లిదండ్రులకే పెద్ద పరీక్షగా మారింది. మరి పిల్లల కోసం అసలు ఏం చేయాలి? ఎందుకు టీనేజ్ వయసులోనే ఈ డిప్రెషన్ కు వెళ్తున్నారంటే..
చిన్న వయసు నుంచే ఆన్లైన్ లో ఎక్కువగా గడపడంతో పిల్లలు టీనేజ్ వయసుకు వచ్చేసరికి తెలియని మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ యువతను తెలియకుండానే పక్కదారి పట్టిస్తున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు అధ్యాయనాలు తెలిపాయి. UNICEF నివేదిక ప్రకారం లక్ష 75 వేల మంది పిల్లలు ప్రతి 30 సెకండ్లకు ఒకరు ఇంటర్నెట్లో లాగిన్ అవుతున్నట్టు తేలింది. ఇటువంటి అంతులేని కనెక్టివిటీ కొన్ని సమయాల్లో విద్యా, వినోదంను అందించినప్పటికీ వారి మానసిక పరిస్థితిని తీవ్ర ప్రమాదంలో నెట్టేస్తున్నట్టు తెలుస్తోంది.
టీనేజర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలు సోషల్ మీడియా కారణంగానే ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. తమకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని ఊహించుకొని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్ గేమ్స్ ద్వారా మరి మానసిక పరిస్థితి దిగజారిపోతున్నట్టు సైతం తెలుస్తోంది. ఆన్లైన్ గేమ్స్ లో విపరీతమైన స్పీడు ఉండటం ఆ వేగాన్ని బయట ప్రపంచంలో అందుకోలేకపోవడంతో సమస్యల తలెత్తుతున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా ఆన్లైన్లో హానికరమైన కంటెంట్, సైబర్ క్రైమ్స్ వంటివి పిల్లల మానసిక పరిస్థితిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. హింస , అశ్లీలత వంటి వయస్సుకు సంబంధంలేని విషయాలు తెలుసుకుంటున్నట్లు తేలింది. తప్పుదారి పట్టించే సమాచారం లేదా తారుమారు చేసిన కంటెంట్ ను సైతం నేర్చుకుంటున్నారని చెప్పుకొచ్చింది. పిల్లలు తమకు సంబంధించిన వ్యక్తిగత డేటాకు అనధికారిక యాక్సెస్ ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది. ఇలాంటి కంటెంట్ ఈ విషయంలో తల్లిదండ్రుల సైతం అప్రమత్తంగా ఉండాలని లేదంటే తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైమ్స్ తో పాటు ఆన్లైన్ లైంగిక దోపిడీ, తప్పుడు సమాచారం, బెదిరింపులు వంటి వాటికి చిన్న వయసులోనే ఎదుర్కొంటే డిప్రెషన్ తో పాటు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు సైతం వస్తాయని.. వీటిని చిన్న వయసులోనే కట్టడి చేయాలని, ప్రతీ ఒక్క పేరెంట్ E సేఫ్టీ గైడ్ ను ఆచరించాలని హెచ్చరిస్తున్నారు.
ALSO READ : 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం – ప్రజల స్పందన ఎలా ఉందంటే?