South Eastern Railway Apprentice Recruitment 2024: రైల్వే సంస్థ మరోసారి కొలువుల జాతరకు శ్రీకారం చుట్టింది. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను మొదలుపెట్టింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు rrcser.co.in లేదంటే iroams.com/RRCSER24 వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా మొత్తం 1,785 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఆన్ లైన్ ద్వారానే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలన్నది. ఏ ఇతర పద్దతిలో అప్లికేషన్లు తీసుకోమని రైల్వే సంస్థ వెల్లడించింది.
⦿ అప్లై చేసుకునేందుకు లాస్ట్ డేట్
నవంబర్ 28న నోటిఫికేషన్ రాగా, డిసెంబర్ 27 వరకు దరఖాస్తులు తీసుకోనున్నట్లు రైల్వే సంస్థ వెల్లడించింది.
⦿ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్
అప్రెంటిస్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మెట్రిక్యులేట్ లేదంటే 10వ తరగతి పాస్ కావాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే NCVT/SCVT జారీ చేసిన ITI పాస్ సర్టిఫికేట్ (అప్రెంటిస్‌షిప్) ఉండాలి.
⦿ ఏజ్ లిమిట్ ఎంత?
అభ్యర్థులు జనవరి 1, 2025 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
⦿ ఎలా అప్లై చేసుకోవాలంటే?
❂ముందుగా సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారిక వెబ్ సైట్ www.rrcser.co.in ని ఓపెన్ చేయాలి.
❂ఆ తర్వాత iroams.com/RRCSER24/applicationAfterIndexకి వెళ్లాలి.
❂అర్హత, డెడ్ లైన్, సూచనల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ను చూడాలి.
❂ఆ తర్వాత ‘New Registration’ మీద క్లిక్ చేయాలి.
❂మీ పేరు, ఆట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ సహా ఇతర వివరాలను ఫిల్ చేయాలి.
❂ఆ తర్వాత పోర్టల్ లోకి లాగిన్ కావాలి.
❂పర్సనల్, ఎడ్యుకేషన్ వివరాలతో పాటు అడ్రస్ ఎంటర్ చేయాలి.
❂పాస్ పోర్ట్ ఫోటో, సంతకం, ధృవపత్రాలతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి.
❂ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి రసీదును తీసుకోవాలి.
❂వివరాలను సరిచూసుకుని అప్లై చేసుకోవాలి.
❂అప్లై చేయడం పూర్తి అయిన తర్వాత మీ రిసీట్ ను డౌన్‌లోడ్ చేసి ఉంచుకోవాలి.
Read Also:వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పట్లో పట్టాలెక్కవా? అసలు విషయం చెప్పేసిన రైల్వేమంత్రి!
November 29,2024 14:14 pm
⦿అప్లికేషన్ ఫీజు
అప్రెంటిస్ పోస్టు కోసం దరఖాస్తు చేసేకునే అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PWD వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, మహిళా అభ్యర్థులందరికీ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఫీజు చెల్లింపు డిజిటల్ పద్దతి ద్వారా చేయాల్సి ఉంటుంది.
⦿సెలెక్షన్ ఎలా ఉంటుంది?
మెరిట్ జాబితా మెట్రిక్యులేషన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ఉద్యోగ అర్హత కోసం కనీసం 50 శాతం మార్కులు అవసరం. అన్నిసబ్జెక్టులలోని మార్కులను పరిగణనలోకి తీసుకుని మొత్తం శాతాన్ని లెక్కిస్తారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారిక వెబ్ సైట్ ను చూడాలని రైల్వేశాఖ సూచించింది.
Read Also: దూసుకెళ్తున్న హైదరాబాద్ మెట్రో.. ఆ కారిడార్‌లో రోజుకు ఏకంగా అంతమంది ప్రయాణిస్తున్నారట!