BigTV English

Meat Cultivation : మాంసం పంటకు పెరుగుతున్న క్రేజ్..

Meat Cultivation : మాంసం పంటకు పెరుగుతున్న క్రేజ్..

Meat Cultivation : కోళ్లను, మేకలను ఇలాగే తినుకుంటూపోతే నాన్ వెజ్ లవర్స్‌కు కొన్నాళ్లకు నాన్ వెజ్ దొరకదని వెజీటేరియన్లు పలుమార్లు ఎగతాళి చేస్తుంటారు. ఈ విషయాలు పలువురు శాస్త్రవేత్తలు సీరియస్‌గా తీసుకున్నారో ఏమో.. మాంసాన్ని పండించవచ్చేమో అనే ఆలోచన చేశారు. గత కొన్నేళ్లుగా మాంసాన్ని పండించడంపై వారు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల ఈ పరిశోధనలకు తగిన రిజల్ట్ వచ్చినట్టుగా వారు ప్రకటించారు.


జంతువు లేకుండానే ఇప్పుడు మాంసం అనేది లభిస్తుంది అంటూ గుడ్ ఫుడ్ ఇన్‌స్టిట్యూట్ (జీఎఫ్ఐ) శాస్త్రవేత్తలు ప్రకటించారు. అంటే వారు ప్రారంభించిన మాంసం పంట పరిశోధన సక్సెస్ అయినట్టుగా వారు ఇన్‌డైరెక్ట్‌గా బయటపెట్టారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కల్టివేటెడ్ మీట్ కంపెనీ ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి కంపెనీల సంఖ్య 156కు చేరుకుంది. ఇతర ఫుడ్ సంస్థలు కూడా పరిశోధనల్లో భాగమవ్వాలని ఈ కల్టివేటెడ్ మీట్ సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టాయి.

అమెరికాలో మాంసం పండించడం కోసమే ప్రత్యేకంగా కొన్ని స్టార్టప్స్ ప్రారంభమయ్యాయి. ఇటీవల మార్చ్‌లో ఇలాంటి ఒక స్టార్టప్ ముందుగా పంది మాంసాన్ని పండించడం మొదలుపెడతామని, ఆ తర్వాత ఇతర రకాల మాంసాలను కూడా పండించడానికి ప్రయత్నాలు మొదలుపెడతామని ప్రకటించింది. ఇంకొక సంస్థ ఏకంగా తాము 10 వేల టన్నుల మాంసాన్ని పండించి చూపిస్తామని ఛాలెంజ్ చేసింది. అంతే కాకుండా ఇతర సంస్థల్లో భారీ పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ సంస్థ సిద్ధంగా ఉంది.


ఈ మాంసం అనేది అమెరికాలో ఉండే ప్రతీ ఒక్కరికి సులువుగా మార్కెట్లో దొరికేలాగా తయారు చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ప్రయోగాలు పూర్తిగా అయిపోకముందే మాంసం పంటను కమర్షియల్ చేసేశారు. పెరుగుతున్న జనాభా పరంగా, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ మార్కెట్ ముందుకు వెళ్తోంది. అదే దిశగా పెట్టుబడులు కూడా పెడుతోంది. ప్రైవేట్ సంస్థలు మాత్రమే కాకుండా ప్రభుత్వాలు కూడా ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

మీట్ రీసెర్చ్‌లో పెట్టుబడులు పెట్టడానికి అమెరికాలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చాయి. కానీ ఈ రీసెర్చ్ ప్రారంభంలో పెట్టుబడిదారులు దీనిపై చూపించనంత ఆసక్తి ఇప్పుడు లేదని, మెల్లగా తగ్గిపోతూ వస్తోందని శాస్త్రవేత్తలు గమనించారు. రీసెర్చ్ వల్ల బయటికొచ్చిన రిజల్ట్ పెట్టుబడిదారులను సంతృప్తి పరచకపోవడం కూడా దీనికి ఒక కారణం అయ్యిండొచ్చని వారు భావిస్తున్నారు. అంతే కాకుండా ప్రజలు కూడా మాంసాన్ని పండించే కాన్సెప్ట్‌ను పూర్తిగా నమ్మలేకపోతున్నారని బయటపెట్టారు. అయినా కూడా ఈ కమర్షియల్ బిజినెస్‌కు ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని ప్రైవేట్ సంస్థల పరిశోధకులు భావిస్తున్నారు.

Tags

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×