BigTV English

Rajinikanth: ఏపీ విజన్ 2047.. చంద్రబాబును తెగపొగిడేసిన తలైవా..

Rajinikanth: ఏపీ విజన్ 2047.. చంద్రబాబును తెగపొగిడేసిన తలైవా..

Rajinikanth latest Speech(AP News Updates): రజినీకాంత్. సినిమాల్లో సూపర్‌స్టార్. రాజకీయాల్లో వేలు పెట్టబోయే.. వెంటనే వెనక్కి తీసుకున్న జాగ్రత్తపరుడు. ఆయనకు పాలిటిక్స్ గురించి బాగా తెలుసు. అందుకే, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన తలైవా.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దని అనుభవం చెబుతోందంటూనే చంద్రబాబును పొగడకుండా ఉండలేకపోయారు.


చంద్రబాబు 30 ఏళ్లుగా తనకు మంచి మిత్రుడని రజినీకాంత్ చెప్పారు. బాబును మొదట మోహన్‌బాబు తనకు పరిచయం చేశాడని.. పెద్ద నాయకుడు అవుతాడని మోహన్‌బాబు అప్పట్లోనే చెప్పాడని గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని.. జనాల కోసం 24 గంటలూ ఆలోచిస్తుంటారని చెప్పారు. చంద్రబాబు విజనరీ గురించి.. దేశంలోని రాజకీయ నేతలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఘనత, టాలెంట్ ఇక్కడి వారికంటే బయటివారికే ఎక్కువ తెలుసని చెప్పారు.


ఐటీ, డిజిటల్ వరల్డ్ గురించి చంద్రబాబు అప్పుడే ఊహించారని.. హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చారని కొనియాడారు. బిల్ గేట్స్, బిజినెస్ టైకూన్స్‌ను హైదరాబాద్‌కు రప్పించి వారితో పెట్టుబడులు పెట్టించారని చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో లక్షలాది మంది తెలుగువాళ్లు ఐటీ జాబ్స్ చేస్తున్నారంటే అందుకు కారణం చంద్రబాబేనన్నారు రజినీకాంత్. ఈమధ్య తాను హైదరాబాద్ వెళ్లానని.. జూబ్లీహిల్స్, సైబరాబాద్ సైడ్ వెళితే.. అది హైదరాబాదా? న్యూయార్కా? అనిపించిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రతీ బర్త్‌డేకు తాను ఎక్కడున్నా.. చంద్రబాబు విష్ చేస్తారని చెప్పారు. ఏపీ కోసం చంద్రబాబు విజన్ 2047 రెడీ చేస్తున్నారని.. అది కార్యచరణలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్కడికో వెళ్లిపోతుందని కితాబిచ్చారు రజినీకాంత్.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×