BigTV English

IT Returns:- డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి… ఐటీ కాలం వచ్చేసింది

IT Returns:- డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి… ఐటీ కాలం వచ్చేసింది
This image has an empty alt attribute; its file name is feature-47.jpg

IT Returns:- ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇందుకోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఇప్పుడే సిద్ధం చేసి పెట్టుకోవాలి. పైగా రైతులు తప్ప ఎవరైనా సరే ట్యాక్స్ రిటర్న్స్ చేయాల్సిందే. ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నా లేకుండా ఫైలింగ్ మాత్రం తప్పనిసరి. పైగా ఐటీ రిటర్న్స్ కోసం సీఏల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకుని మీ అంతట మీరే ఆన్‌లైన్‌లో ఫైల్ చేయొచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ వెబ్‌సైట్‌లో ఐటీఆర్ ప్రక్రియ మరింత ఈజీగా చేశారు. సో, ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, వ్యాపారులు, ఇతరులు ఎవరైనా ఐటీఆర్ చేయొచ్చు.


ఉద్యోగాలు చేస్తున్న వాళ్లైతే.. ఐటీఆర్ కోసం ఫామ్-16 సమర్పించాలి. వీటిని మీరు జాబ్ చేస్తున్న కంపెనీలే ఇస్తాయి. వీటితో పాటు ఏఐఎస్/ టీఐఎస్, బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్, పెట్టుబడి పథకాల్లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్, ఇతర డివిడెండ్లు, ఇంటి అద్దె, బ్యాంకుల్లో చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వాటిపై వడ్డీ ఆదాయం, పిల్లలకు ట్యూషన్ ఫీజు చెల్లింపులు, హౌసింగ్ లోన్ తీసుకుని ఉంటే.. ఈఎంఐ చెల్లింపుల పత్రాలు, బీమా పాలసీ ప్రీమియం పేమెంట్స్ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

ఐటీ రిటర్న్స్‌లో భాగంగా టీడీఎస్ పనికొస్తుందేమో చూడాలి. ఫామ్-16లో ఉన్న ప్రకారమే సాలరీ డిటైల్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. అన్ని రకాల డిడక్షన్లు రిజిస్టర్ చేశారా.. ఏమైనా తేడాలు ఉన్నాయా.. అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా తేడాలు ఉంటే… కంపెనీ మేనేజ్‌మెంట్‌ను అడగాలి. ఇక ఫామ్-16తోపాటు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్, టాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ వివరాలు కూడా చూడాలి. దీంతోపాటు 26ఎఎస్‌నూ చెక్ చేసుకోవాలి. ఇందులో మీ ఇన్ కం, పే చేసిన టాక్స్ డిటైల్స్ ఉంటాయి. ఈ పత్రాలన్నీ డౌన్ లోడ్ చేసుకుని పెట్టుకోవాలి.


కేవలం సాలరీ మాత్రమే తీసుకుంటూ ఉంటే.. ఐటీఆర్-1 ఫైల్ చేయొచ్చు. పెట్టుబడి పెడుతుంటే.. వాటిపై లాభాలు వస్తుంటే.. ఐటీఆర్-2 గానీ, ఐటీఆర్-3 గానీ ఎంచుకోవాలి. ఆదాయం లెక్క గట్టడంలో పొరపాట్లు చేయొద్దు. 

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×