E-Paper
Advertisement

Deepfake : డీప్‌ఫేక్‌పై మెటా కొరడా.. ఏం చేయబోతోందంటే!

Deepfake : డీప్‌ఫేక్‌పై మెటా కొరడా.. ఏం చేయబోతోందంటే!
Advertisement

Deepfake : డీప్ ఫేక్.. ఈ రోజుల్లో ఈ పదం ప్రతీ ఒక్కరిని ఎంతగా భయపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ డిఫెక్ట్ బారిన పడి ఎందరో సెలబ్రెటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు ఎంత అవగాహన కల్పించినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర డిప్ ఫేక్ ఎఫెక్ట్ తో తప్పుడు సమాచారం ప్రసారమవుతుంది. ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ ను అరికట్టేందుకు మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోలను తేలికగా గుర్తించేందుకు వీడియో సీల్ అనే ఫీచర్ ను త్వరలోనే తీసుకురాబోతుంది.

డిప్ ఫేక్ ను అరికట్టేందుకు మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. వీడియోలను గుర్తించేందుకు కొత్త టోల్ ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ టూల్ తో డీప్ ఫేక్ కంటెంట్ పై వాటర్ మార్క్ కనిపిస్తుంది. దీంతో చూసిన యూజర్స్ ఈ వీడియో అబద్ధమని తేలికగా కనిపెట్టేస్తారు.

Advertisement

కృత్రిమ మేధస్సు (AI) తో రూపొందించే డిప్ ఫేక్ తో జరుగుతున్న అనర్ధాలు ఎన్నో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజుల్లో సెలబ్రిటీల ఇమేజ్ ను వాడుకుంటూ వీడియోలు రిలీజ్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. దీంతో పక్కదారి పట్టే అవకాశం ఎక్కువగా ఉందని గ్రహించిన టెక్ నిపుణులు, సైబర్ క్రైమ్ పోలీసులు సైతం ఈ విషయాలపై ఇప్పటికి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నివారణ లేకపోవడంతో మెటా తాజాగా కీలక నిర్ణయం తీసుకొని ఈ వీడియోలను అరికట్టే సన్నాహాలు చేస్తుంది. డీప్ ఫేక్ తో వీడియోలు చేసిన తర్వాత వాటి మీద వాటర్ మార్క్ వచ్చే విధంగా కొత్త టూల్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. వీడియో సీల్ అనే ఈ సాధన త్వరలోనే తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మెటా ఈ విషయంను క్లైమ్ చేసినట్టు, టూల్ ఓపెన్ సోర్స్ ను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ టూల్ వీడియో క్వాలిటీని ప్రభావితం చేయదని.. కానీ వీడియో పైన వాటర్ మార్క్ మాత్రం కనిపిస్తుందని చెప్పుకు వచ్చింది.

మెటా వీడియో సీల్ టూల్ – 

Advertisement

AI వినియోగం పెరగడంతో డీప్‌ఫేక్‌లు ఇంటర్నెట్‌ను ఆక్రమిస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఇంటర్నెట్, ఏఐ, డీప్ ఫేక్ కోసం కోసం తెలియని వారు ఖచ్చితంగా పక్క దోవపట్టే విధంగా వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో తప్పుడు సమాచారం ప్రచారం అవుతుంది. వస్తువులతో పాటు దృశ్యాలు, వ్యక్తిత్వాలు సైతం ప్రభావం చూపించడంతో తప్పుడు సమాచారం చాలా వేగంగా జనాల్లోకి వెళ్ళిపోతుంది, ఇది ఇలాగే కొనసాగితే ఎన్నో ప్రమాదాలు తప్పవని.. మోసాలు, స్కామ్స్ చేయడానికి సైబర్ నేరస్తులు వెనకడుగు వేయరని, అందుకే డీప్ ఫేక్ ను అరికట్టడం ఎంతైనా అవసరమని మెటా భావిస్తున్నట్లు తెలుస్తుంది.

రోజు రోజుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని పనితీరును మెరుగుపరుచుకుంటూ అన్ని విషయాల్లో చొచ్చుకుపోతుంది. ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ కంటెంట్ ను గుర్తించడం మరింత కష్టతరంగా మారుతుంది. తాజాగా ఓ సర్వే ప్రకారం 70 శాతం ప్రజలు వాయిస్ ను గుర్తించలేకపోతున్నారని, నిజమైన వీడియో ఏదో డిఫెక్ట్ వీడియో ఏదో గుర్తించడం కష్టతరంగా మారుతుందని తెలిపుతున్నారు.  ఇక 2022లో కేవలం ఉత్తర అమెరికాలోనే డీప్‌ఫేక్ మోసాలు 1,740 శాతం జరగగా.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 1530 శాతం పెరిగాయని Sumsub అనే మరో నివేదిక తెలిపింది.

ALSO READ : ఓపెన్ AIపై పనిచేసి.. ఆ తీరునే తప్పుపట్టాడు. చివరకు శవమయ్యాడు! అతని చివరి పోస్ట్ లో ఏముందంటే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×