BigTV English

Microsoft: ఇకపై పాస్‌వర్డ్ లేకుండానే మైక్రోసాఫ్ట్ ఖాతాలు..కానీ ఇవి మాత్రం తప్పనిసరి

Microsoft: ఇకపై పాస్‌వర్డ్ లేకుండానే మైక్రోసాఫ్ట్ ఖాతాలు..కానీ ఇవి మాత్రం తప్పనిసరి

Microsoft: సాధారణంగా అనేక మంది వారి సోషల్ మీడియా ఖాతాలకు ఉపయోగించే పాస్‌వర్డ్‌లను మర్చిపోతుంటారు. ఆ క్రమంలో అనేక సార్లు ఫర్ గాట్ పాస్ వర్డ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ ఈ సంప్రదాయాన్ని మార్చాలని నిర్ణయించింది. ఇకపై కొత్త మైక్రోసాఫ్ట్ ఖాతాలకు పాస్‌వర్డ్‌లు అవసరం లేదని కంపెనీ ప్రకటించింది. దీనికి బదులుగా పాస్‌కీలు, ఫేస్ ఐడి, వేలిముద్ర ప్రామాణీకరణ లేదా భద్రతా కీల వంటి కొత్త సురక్షితమైన ప్రత్యామ్నాయాలను వినియోగదారులు ఉపయోగించవచ్చని తెలిపింది. ఈ మార్పు ఎందుకు, ఇది ఎలా పనిచేస్తుందనే విషయాలను తెలుసుకుందాం.


పాస్‌వర్డ్‌ల బలహీనతలు
పాస్‌వర్డ్‌లు ఒకప్పుడు ఆన్‌లైన్ భద్రతకు ప్రమాణీకంగా ఉండేవి. కానీ, ప్రస్తుతం వాటిలో లోపాలు కూడా ఉంటున్నాయి. మైక్రోసాఫ్ట్ ప్రకారం, పాస్‌వర్డ్‌లు ఇప్పుడు భద్రత, వినియోగం రెండింటిలోనూ విఫలమవుతున్నాయి. ఫిషింగ్ దాడులు, హ్యాకింగ్, మానవ తప్పిదాలు పాస్‌వర్డ్‌లను లొంగిపోయేలా చేస్తున్నాయి.

సులభమైన పాస్‌వర్డ్‌లు
ఈ క్రమంలో ఒక్క సెకనులోనే దాదాపు 7,000 పాస్‌వర్డ్ ఆధారిత సైబర్ దాడులు జరుగుతున్నాయని మైక్రోసాఫ్ట్ అంచనా వేసింది. 2023తో పోలిస్తే, ఈ సంఖ్య క్రమంగా పెరిగింది. సులభమైన పాస్‌వర్డ్‌లను ఎంచుకోవడం వల్ల హ్యాకర్‌లకు ఈజీగా దొరికిపోతున్నారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పాస్‌వర్డ్‌లను పూర్తిగా తొలగించి, మరింత సురక్షితమైన, వేగవంతమైన పాస్‌కీల వైపు మారాలని నిర్ణయించింది.


Read Also: Sony 65 Inch TV: సోనీ టీవీపై రూ.65 వేల తగ్గింపు ఆఫర్..బిగ్ డీల్..

పాస్‌కీ అంటే ఏంటి
పాస్‌కీలు అనేవి సాంప్రదాయ పాస్‌వర్డ్‌లకు ఆధునిక ప్రత్యామ్నాయం. ఇవి FIDO (ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్‌లైన్) అలయన్స్ అభివృద్ధి చేసిన సాంకేతికత. దీనిలో మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు భాగస్వాములు. పాస్‌కీ అనేది మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో నిల్వ చేయబడిన ఒక క్రిప్టోగ్రాఫిక్ కీ. ఈ కీ మీ వేలిముద్ర, ఫేస్ ఐడి, లేదా పరికర పిన్‌తో అనుసంధానించబడి ఉంటుంది. దీన్ని సరళంగా చెప్పాలంటే, పాస్‌కీ మీ ఖాతాకు ఒక డిజిటల్ తాళం లాంటిది.

లీక్ అయ్యే ప్రమాదం
పాస్‌కీల గొప్పతనం ఏంటంటే, వాటిని హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యం. ఫిషింగ్ దాడులు పాస్‌కీలకు పనికిరావు. డేటా లీక్‌లు ఉండవు. ఈ క్రమంలో మీ డేటా పరికరంలో సురక్షితంగా నిల్వ చేయబడుతుంది. కాబట్టి లీక్ అయ్యే ప్రమాదం లేదు. అంతేకాదు, పాస్‌వర్డ్‌లా గుర్తుంచుకోవాల్సిన ఇబ్బంది లేదు. మీరు మీ ఫోన్‌ను అన్‌లాక్ చేసినట్లే, ఒక స్కాన్ లేదా పిన్‌తో సైన్-ఇన్ అవుతారు.

98 శాతం సక్సెస్
మైక్రోసాఫ్ట్ (Microsoft) గణాంకాల ప్రకారం పాస్‌కీలతో సైన్-ఇన్ చేయడం 98% విజయవంతమవుతుంది. అయితే పాస్‌వర్డ్‌లతో ఇది కేవలం 32% మాత్రమే. అంతేకాదు, పాస్‌కీలతో సైన్-ఇన్ చేయడం 8 రెట్లు వేగవంతంగా చేసుకోవచ్చు. FIDO అలయన్స్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 15 బిలియన్ ఖాతాలు ఇప్పటికే పాస్‌కీలను స్వీకరించాయి.

మైక్రోసాఫ్ట్ దీర్ఘకాల దార్శనికత
మైక్రోసాఫ్ట్ ఈ మార్పును రాత్రికి రాత్రి తీసుకురాలేదు. ఇది దశాబ్ద కాలంగా దీనిపై పరిశోధన చేసింది. 2015లో విండోస్ హలోతో ప్రారంభమైన ఈ దార్శనికత, బయోమెట్రిక్ ప్రామాణీకరణను ప్రవేశపెట్టింది. ఇప్పుడు, మైక్రోసాఫ్ట్ పూర్తిగా పాస్‌వర్డ్ రహిత ప్రపంచాన్ని కోరుతోంది. దీని ఉద్దేశం ప్రతి సైన్-ఇన్ విధానాన్ని సురక్షితంగా ఉంచడమే.

పాస్‌వర్డ్ లేకుండా
కొత్త మైక్రోసాఫ్ట్ ఖాతాలు ఇప్పుడు డిఫాల్ట్‌గా పాస్‌వర్డ్ లేకుండా సృష్టించబడతాయి. ఇప్పటికే ఉన్న వినియోగదారులు కూడా తమ పాస్‌వర్డ్‌ను తొలగించి, పాస్‌కీలకు మారే అవకాశం కల్పించబడింది. మైక్రోసాఫ్ట్ ఒక కొత్త సైన్-ఇన్ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టింది. ఇది పాస్‌కీలు లేదా బయోమెట్రిక్ ఎంపికలను చూపిస్తుంది. ఇది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు. ఇది డిజిటల్ భద్రత విషయంలో మన విధానాన్ని మార్చే నిర్ణయం.

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×