BigTV English

Mangoes: మామిడికి డేంజర్ బెల్.. వీళ్లు మనుషులేనా? మరీ ఇలా చేస్తారా?

Mangoes: మామిడికి డేంజర్ బెల్.. వీళ్లు మనుషులేనా? మరీ ఇలా చేస్తారా?

Mangoes: ఉదయం ఆకుపచ్చ రంగులో ఉన్న మామిడికాయ.. సాయంత్రానికే పసుపుపచ్చ కలర్ లోకి మారిపోయి పండుగా మారుతుంది. ఏ మంత్రదండముతోనే మాయచేస్తున్నారు అనుకునేరు. మరి ఇది ఎలా సాధ్యపడే ప్రక్రియ. మాయలేదు మర్మం లేదు జస్ట్ క్యాల్షియం కార్బైడ్ ఉంటే చాలు. వినడానికే కాదు, చూడ్డానికీ రంగు కూడా వావ్ అనిపించినా.. తింటే మాత్రం రుచిపచీ ఉండదు. పైగా అదో విషతుల్యం. మనల్ని ఊరించే మామిడిపండు కోసం మనమే డబ్బులిచ్చి విషాన్ని కొనుక్కోవడమన్నమాట. కంటికి ఇంపుగా కనబడే మామిడి లో అలా ఎందుకు మారుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


ఇక్కడ మామిడి ఫేమస్ కానీ..
మామిడి మార్కెట్ లో దొరికే మామిడికి మనదేశ రాష్ట్రాలతో పాటుగా దేశవిదేశాలలో మంచి పేరుంది. కానీ, ఇప్పుడు ఆ మామిడి పండ్లు తింటే అద్భుతమైన రుచి, ఆస్వాదనమో గానీ.. నయం కానీ రోగాల బారిన పడటం ఖాయమనే పేరును మూటగట్టుకుంటోంది ఈ మామిడిమార్కెట్. జగిత్యాల, కరీంనగర్ మార్కెట్ లో ప్రతి ఏటా సుమారు 70 నుంచి 80 కోట్ల రూపాయల టర్నోవర్ తో బిజినెస్ జరుగుతుంది. 35 వేల నుంచి 45 వేల టన్నుల మామిడి ఈ మార్కెట్ కు చుట్టుపక్కల తోటల నుంచి తరలివస్తుంది. అయితే, ఈ మార్కెట్ స్థానికుల చేతుల్లోంచి.. ఏకంగా ఇతర రాష్ట్రాలవారి చేతుల్లోకి వెళ్లిపోయింది.

ఇక్కడి నుంచి ఉత్తరాదికి ముఖ్యంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలకు మామిడిపండ్లను ఎగుమతి చేస్తారు. అయితే, ఆ మామిడి పళ్లల్లో కార్బైడ్ కలపడం వివాదాస్పదంగా మారుతోంది. హైకోర్ట్ కూడా మామిడి పండ్లను మాగబెట్టే విషయంలో కార్బైడ్ వాడకంపై.. పర్యవేక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ లేకపోవడంపై ప్రభుత్వంపై సీరియస్ అయింది. కాని ఏది మారలేదు.. కాల్షియం కార్బోనేట్ పోయి ఇథనల్ రీపేనర్ వచ్చింది అంతే.. డబ్బాలలో, అట్టపెట్టెలలో ఈ ప్యాకెట్ తో పాటు ప్యాక్ చేసి మామిడి పండ్లను మాగబెట్టి కేవలం ఒకటి, రెండు రోజుల్లోనే ఎలా పండ్లు గా మారుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.


అవి ఎక్కడ?
మామిడి మార్కెట్ లో మనకు అక్కడక్కడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్ అయిన ఇథలీన్ రీపెనర్ కవర్స్ దర్శనమిస్తాయి. ఈ ప్యాకెట్స్ లో పౌడర్ ద్వారానో.. లేక, గ్యాస్ పద్ధతిలోనో మాగబెట్టడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ, ఈ ప్యాకెట్స్ మనకు మార్కెట్ లో కనిపిస్తున్నా, లోలోపల వాడేది మాత్రం కాల్షియం కార్బైడే. ఎప్పుడైతే ఒక ప్యాకెట్ ను నీళ్లల్లో ముంచుతున్నారో అది ఇధలీన్ రీపెనర్ కాదన్నట్టు. అయితే, జరుగుతున్న ఈ లోగుట్టును పట్టించుకునే అధికారులు లేక ఇక్కడ విషం నింపిన మామిడి పండ్లు ఎగుమతవుతూ, మార్కెట్ లోకి పోటెత్తుతున్నాయి.

కాల్షియం కార్బైడ్ ఎంత విషమంటే.. సరిగ్గా హిమాచల్ ప్రదేశో, ఢిల్లీకో వెళ్లేందుకు సిద్ధం చేసే కాటన్ లో వీటిని వేసి పెడతారు. ఒకవేళ అవి సమయానికి రీచ్ కాక.. ఓ రెండురోజులు ఆలస్యమైతే ఆ పండ్లన్నీ పనికిరానంతగా కుళ్లిపోతాయి. అలాంటిది ఆ కార్బైడ్ వేసిన నీళ్లల్లో వేసి మాగబెట్టిన పండ్లు తింటే ఎలాంటి రోగాలు వస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై కొందరు సామాజిక కార్యకర్తలు ఇప్పటికీ ఫైట్ చేస్తుండగా.. మరోవైపు వైద్యులు కాల్షియం కార్బైడ్ వల్ల క్యాన్సర్ వంటి రోగాలు రావడంతో పాటు.. కిడ్నీలపైనా ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు.

Also Read: Indonesia Rituals: శవాలతో మాటలు, పలకరింపులు.. వీరెక్కడి మనుషులు బాబోయ్..

కార్బైడ్ విషంతో మామిడిని మాగబెట్టే ఫల ప్రక్రియపై హైకోర్ట్ 2015లోనే సీరియస్ అయింది. ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించాలని అక్షింతలు వేసింది. అయినా, పరిస్థితులు మారలేదు సరికదా.. ఇప్పుడైతే ఆ ఫుడ్ సేఫ్టీ అధికారుల జాడ పత్తానే లేకుండా పోయింది. ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలు, తోటలు పండించేందుకు మళ్లీ చాలామంది మొగ్గు చూపుతున్న క్రమంలో ఇంకా కరీంనగర్ జగిత్యాల మార్కెట్ లో మాత్రం రసాయనాలతో పండ్లను మాగబెట్టే పద్ధతులు కొనసాగుతుండటంపై పెద్ద రచ్చే జరుగుతోంది. ఇతర దేశాల్లో కార్బైడ్ కలిపిన పండ్లను మార్కెట్ లోకి తీసుకుని వస్తే అంతే సంగతులన్నంత నిషేధం కొనసాగుతోంది. మార్కెట్లలో యదేచ్ఛంగా కార్బైడ్ వాడకం కొనసాగుతోంది.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×