RGV On Media : ఒకప్పుడు సంచలనాత్మకమైన దర్శకుడిగా పేరు సాధించుకున్న ఆర్జీవి ఇప్పుడు వివాదాస్పద దర్శకుడుగా పేరు సాధించాడు. ఈ మధ్యకాలంలో ఆర్జీవి చుట్టూ చాలా వివాదాలు తిరుగుతూ వస్తున్నాయి. శివ, సత్య, అంతం, గాయం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ఆర్జీవి ఇప్పుడు అంతా కూడా నాసిరకం కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికీ కూడా ఒక ఫిలిం మేకర్ గా ఆర్జీవిని గౌరవించిన వాళ్లు కూడా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులు కూడా రామ్ గోపాల్ వర్మ కి మంచి రెస్పెక్ట్ ఇస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ పొలిటిక్స్ లో రామ్ గోపాల్ వర్మ ఇన్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతూ ఒకప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా పోస్టులు ట్విట్టర్ లో పెట్టారు. అయితే ఆర్జీవి మాటల్లోనే చెప్పాలంటే ఒక రోజుకు 10,15 పోస్టులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్లపై వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ చాలామందిని ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేశారు. ఇక ప్రస్తుతానికి ఆర్జీవి పై కూడా ఒక నాలుగు ప్రాంతాల్లో కొంతమంది కేసులు పెట్టారు.
Also Read : Puri Jagannadh : మంచి కథ రాయమంటే, కథలు చెప్తున్నావ్ ఏంటి బాసు .?
పోలీసులు ఆర్జీవికి కూడా నోటీసులు అందించారు. ఇకపోతే ఆర్జీవిని పోలీసులు అరెస్టు చేస్తారు అంటూ కొన్ని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆర్జీవిని వెతుక్కుని పోలీసులు హైదరాబాద్ కూడా వచ్చారు. అయితే రెండు రోజులు సినిమా షూటింగ్లో ఉన్నాను నాకు కొంచెం టైం కావాలి అంటూ ఆర్జీవి అడిగినట్లు ఆర్జీవి లాయర్ కూడా చెప్పారు. రీసెంట్ గా వీటన్నిటికీ క్లారిటీ ఇస్తూ పలు రకాల ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. అంతే కాకుండా ఒక ప్రెస్ మీట్ కూడా రీసెంట్ గా పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ అసహనం వ్యక్తం చేశారు.
ఒక ప్రముఖ జర్నలిస్ట్ రామ్ గోపాల్ వర్మను రెండు రోజులు షూటింగ్ లో ఉన్నాను అన్నారు కదా, ఇంతకీ మీరు ఏ షూటింగ్ లో ఉన్నారు.? అని అడిగినప్పుడు, నేను ఏ షూటింగ్ లో ఉన్నాను మీకెందుకు చెప్పాలి అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఎప్పటిలానే ఆర్జీవి తన లాజిక్ తో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏదేమైనా కూడా తాను ఎక్కడికి పారిపోలేదని, ఇక్కడే ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి మీడియా పైన తనదైన శైలిలో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వర్మ విషయంలో ఇలాంటి పరిణామాలు చాలా జరిగాయి.
Also Read : Pushpa 2 movie In AP : ఏపీలో అసలు ఏం జరుగుతుంది… పుష్ప 2 రిలీజ్ ఉందా..? లేదా..?