E-Paper
Advertisement

రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు? దీని వెనుక మ్యాజిక్ ఏంటి? ఓతూరి తెలుసుకుంటే పోలా!

రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు? దీని వెనుక మ్యాజిక్ ఏంటి? ఓతూరి తెలుసుకుంటే పోలా!
Advertisement

Railway Tracks Mystery: దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థలో రైల్వేలు ముందు వరుసలో నిలుస్తాయి. నిత్యం వేలాది కిలోమీటర్లు రైళ్లు ప్రయాణిస్తూ.. లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అలాంటి రైళ్లు సాఫీగా ప్రయాణించాలంటే పట్టాలు ఎంతో కీలకం. అయితే ఈ పట్టాలు.. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలి ప్రభావానికి నిత్యం లోనవుతూనే ఉంటాయి. అయినప్పటికీ ఇవి ఎందుకు తుప్పుపట్టడం లేదన్న సందేహం చాలా మందిలో ఉంది. దీని వెనుక ఉన్న కారణాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ప్రత్యేకమైన లోహంతో తయారీ

రైలు పట్టాలను సాధారణ ఇనుము లేదా సాదా స్టీల్‌తో తయారు చేయరు. వీటిని మాంగనీస్ (Manganese), క్రోమియం (Chromium), వెనేడియం వంటి ఇతర లోహాలను కలిపి రూపొందించిన హై గ్రేడ్ అల్లాయ్ స్టీల్‌తో రూపొందిస్తారు. ఈ ప్రత్యేక మిశ్రమం పట్టాలకు సాలిడ్ దృఢత్వాన్ని, అధిక బరువును తట్టుకునే శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా వాతావరణంలోని తేమ వల్ల త్వరగా తుప్పు పట్టకుండా ఇది కాపాడుతుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.

రాపిడితోనే పైభాగం క్లీన్

Advertisement

పట్టాల పైభాగంలో తుప్పు పేరుకునే అవకాశం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రైలు చక్రాల రాపిడి. చక్రాలు నిరంతరం పట్టాలపై దొర్లుతూ ఉండటం వల్ల ఏదైనా స్వల్పంగా తుప్పు లేదా తేమ ఏర్పడినా వెంటనే తుడిచిపెట్టుకుపోతుంది. అయితే రైళ్లు తక్కువగా తిరిగే మార్గాలు, షంటింగ్ యార్డుల వద్ద పట్టాలపై తేలికపాటి తుప్పు కనిపించడం సహజం.

తుప్పుపట్టకుండా కోటింగ్

పట్టాల అడుగు భాగం, బోల్టులు, జాయింట్ల వంటి భాగాల్లో నీరు నిలిచే అవకాశం ఉంటుంది. అలాంటి చోట్ల తుప్పు పట్టకుండా జింక్ ప్రైమర్లు, ఎపాక్సీ, పాలియురేథేన్, నానో-సెరామిక్ వంటి ప్రత్యేక కోటింగ్‌లను ఉపయోగిస్తారు. తీర ప్రాంతాలు, ఉప్పు గాలులు ఉండే చోట, సొరంగాల్లో ఈ పూతలు పట్టాలకు కవచంలా పనిచేస్తాయని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.

నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థ

Advertisement

సాధారణంగా ఇనుము, స్టీల్ తుప్పు పట్టడానికి నీరు, ఆక్సిజన్ ప్రధాన కారణం. అందుకే ట్రాక్ కింద, దాని చుట్టుపక్కల పక్కల ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా పక్కా డ్రైనేజీ వ్యవస్థను రూపొందిస్తారు. నీరు త్వరగా ఇంకిపోయేలా, పక్కకు వెళ్లిపోయేలా చేయడం వల్ల పట్టాల అడుగు భాగం ఎక్కువసేపు తడిగా లేకుండా ఉంటుంది.

విద్యుత్ ప్రవాహాల నియంత్రణ

విద్యుదీకరించిన రైలు మార్గాలు, మెట్రో ట్రాక్‌ల వద్ద కొన్నిసార్లు ‘స్ట్రే కరెంట్’ కారణంగా ఎలక్ట్రోకెమికల్ తుప్పు వేగంగా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీన్ని నివారించడానికి పట్టాలను స్లీపర్లకు బిగించే చోట ఇన్సులేటింగ్ ప్యాడ్‌లు, గేజ్ బ్లాకులు వాడతారు. ఇవి విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడమే కాకుండా వేర్వేరు లోహాల మధ్య జరిగే గాల్వానిక్ తుప్పును కూడా అడ్డుకుంటుంది.

గ్రీజు, లూబ్రికెంట్లతో ప్రొటెక్షన్

పట్టాలను కలిపే ఫిష్‌ప్లేట్లు, స్విచ్ ప్లేట్లు, బోల్టుల వద్ద ప్రత్యేకమైన యాంటీ కొరోషన్ గ్రీజులు, లూబ్రికెంట్లను సైతం పూస్తారు. ఇవి చక్రాలు, పట్టాల మధ్య రాపిడిని తగ్గించడమే కాకుండా వాతావరణ మార్పుల వల్ల పట్టాలు వ్యాకోచించేటప్పుడు, సంకోచించేటప్పుడు తేమ చొరబడకుండా కాపాడుతుంది

Also Read: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు.. ఇంజిన్ ఒక ఊరిలో, చివరి బోగి మరో ఊరిలో.. ఎన్ని కి.మీ అంటే?

క్రమంతప్పకుండా పట్టాల చెకింగ్

రైల్వే ఇంజినీర్లు, తనిఖీ బృందాలు ఎప్పటికప్పుడు ట్రాక్‌లలో పగుళ్లు, తుప్పు, అరుగుదల వంటి సమస్యలను పరిశీలిస్తుంటారు. ప్రధాన మార్గాల్లో కొంతకాలం వాడిన తర్వాత పట్టాల నాణ్యతలో మార్పు వస్తే వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తారు. అలా తొలగించిన పట్టాలను వృథా చేయకుండా తక్కువ రద్దీ ఉండే యార్డులు, సైడ్ లైన్లలో తిరిగి ఉపయోగిస్తారు.

Also Read: నర్సు ఉద్యోగానికి గుడ్ బై.. 7 నెలల్లోనే రూ.1.75 కోట్ల సంపాదన.. కంటెంట్ క్రియేషన్ పవర్ అంటే ఇదీ!

Tags

Related News

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు.. ఇంజిన్ ఒక ఊరిలో, చివరి బోగి మరో ఊరిలో.. ఎన్ని కి.మీ అంటే?

భారతీయులకు ఫ్రీ ఎంట్రీ రద్దు.. వీసా రూల్స్ మార్చేసిన మలేసియా.. కారణం ఏంటంటే?

రైల్వే గ్రూప్ బుకింగ్ రూల్స్ ఛేంజ్.. ఇక ఎన్ని బెర్తులైనా బుక్ చేసుకోవచ్చా?

అక్వాన్ తుఫాను ఎఫెక్ట్.. 69 రైళ్లు రద్దు.. మీ ట్రైన్ కూడా ఉందా?

ఆర్మీ వాహనానికి ఫైన్.. మహిళా అధికారిణిపై వేటు! అసలేం జరిగింది?

సముద్రం కాదు.. కానీ, సముద్రంలా కనిపిస్తుంది.. నల్లగొండలో ఈ అద్భుతం చూశారా?

దర్వేశిపురం ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ.. రూ.15 కోట్లతో భారీ అభివృద్ధి!

Big Stories

Advertisement
×