E-Paper
Advertisement

నీటిలో మునిగినా, కింద పడినా ఏమీ కాదు.. మోటరోలా నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ 5G ఫోన్ లాంచ్!

నీటిలో మునిగినా, కింద పడినా ఏమీ కాదు.. మోటరోలా నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ 5G ఫోన్ లాంచ్!
Advertisement

Moto G Max 5G: టెక్ ప్రియులను ఆకట్టుకోవడానికి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా తమ G సిరీస్‌లో సరికొత్త ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. Moto G Max 5G పేరుతో లాంచ్ అయిన ఈ మిడ్‌రేంజ్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భారీ కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీతో ఈ ఫోన్ విడుదలైంది. ప్రస్తుతం బ్రెజిల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర భారత కరెన్సీలో సుమారు రూ.47,000గా ఉంది. ఇది లైట్ బ్లూ, గ్రాఫైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

కళ్లు చెదిరే డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను అందించారు. ఇది 1,272 x 2,772 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. దీనివల్ల స్క్రీన్‌పై స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 5,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i ని ఉపయోగించారు.

Advertisement

Also Read: ధర తక్కువే కానీ, సౌండ్ మాత్రం ఊరమాస్.. ఈ రేంజ్ బేస్ ఇచ్చే సౌండ్ బార్‌ను ఎప్పుడైనా చూశారా?

200 మెగాపిక్సెల్ కెమెరా ప్రత్యేకత:

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని వెనుక భాగంలో ఉన్న 200MP ప్రైమరీ కెమెరా. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండటం వల్ల ఫొటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా వస్తాయి. దీంతో పాటు 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 8MP అల్ట్రావైడ్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం ముందు వైపు 32MP కెమెరా ఉంది. ఈ ఫోన్ ద్వారా 30fps వేగంతో 2K క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ ప్రాసెసర్.. సరికొత్త సాఫ్ట్‌వేర్:

Advertisement

Moto G Max 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 8GB RAM, 256GB స్టోరేజ్ అనే ఒకే ఒక్క వేరియంట్ అందుబాటులో ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UI సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది.

మిలిటరీ గ్రేడ్ రక్షణ:

ఎక్కువ సమయం ఛార్జింగ్ బ్యాకప్ ఇచ్చేందుకు దీనిలో 5,200mAh బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక ఈ ఫోన్‌కు ధూళి, నీటి నుంచి రక్షణ కోసం IP66, IP68, IP69 రేటింగులతో పాటు మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు. అంటే.. ఫోన్ కింద పడ్డా, నీటిలో తడిచినా తట్టుకునేలా దీనిని డిజైన్ చేశారు. ఇండియా లాంచ్‌పై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also Read: ఇంట్లోనే Vitamin-D అందించే Philips సీలింగ్ లైట్.. ఫీచర్లు అద్భుతం కానీ, ఆ ఒక్కటే మైనస్!

Related News

పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్

రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

అంతరిక్షంలో అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

Big Stories

Advertisement
×