Shani Shukra yuti: కొత్త సంవత్సరం 2025లో అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. వీటి ప్రభావం 12 రాశులపై ఉంటుంది. కానీ అంతకు ముందు శని, శుక్రుడి కలయిక జరగనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం, డిసెంబర్ 28, 2024 నాడు, దైత్యగురువు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.ఇప్పటికే శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించడం వల్ల కుంభరాశిలో శని, శుక్రుల కలయిక జరగనుంది. అయితే ఇది 3 రాశుల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. మరి ఈ గ్రహ సంయోగం వల్ల ఏ రాశుల వారు అదృష్టాన్ని పొందనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
శని, శుక్రుల కలయిక వృషభ రాశి ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ వ్యక్తుల కెరీర్ లో పురోగతి ఉంటంది. అంతే కాకుండా వ్యాపారంలో మీ భాగస్వాముల నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మీరు మీ ఆఫీసుల్లో సీనియర్ అధికారుల నుండి ప్రశంసలకు అర్హులు అవుతారు. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు తొలగిపోతాయి. అంతే కాకుండా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
కర్కాటక రాశి:
శని, శుక్ర సంయోగం యొక్క సానుకూల ప్రభావం కర్కాటక రాశి వారి జీవితాలపై ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా ఈ వ్యక్తులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డబ్బును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడనున్నాయి. అంతే కాకుండా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో మీరు సంతోషంగా ఉంటారు.
Also Read: అరుదైన దత్తాత్రేయుని ఆలయం.. దేశంలో మరెక్కడా లేని ప్రత్యేకతలు
తులా రాశి:
శని, శుక్రుల కలయిక తులా రాశి ప్రజల జీవితాలలో అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే వ్యక్తుల కల నెరవేరుతుంది. అలాగే కుటుంబ సభ్యుల సహకారంతో ఎన్నో పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఏదైనా పాత వ్యాధి నయం కావచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.