BigTV English

Moto G35 5G: మోటో మామ మామూలోడు కాదు.. మార్కెట్‌లోకి మరో బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

Moto G35 5G: మోటో మామ మామూలోడు కాదు.. మార్కెట్‌లోకి మరో బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

Moto G35 5G Launching Soon In India: మోటరోలా దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త కొత్త టెక్నాలజీతో ఫోన్లను లాంచ్ చేస్తూ సత్తా చాటుతోంది. అన్ని సిగ్మెంట్‌లలో వివిధ మోడళ్లను లాంచ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. త్వరలో తన G సిరీస్‌లో Moto G35 పేరుతో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ G సిరీస్‌ నుంచి ఇప్పటికే వచ్చిన Moto G34 మార్కెట్‌లో బాగా ప్రజాదరణ పొందింది. కంపెనీ ఈ Moto G34ను అతి తక్కువ ధరలో తీసుకొచ్చింది. అంతేకాకుండా అందులోని ఎక్కువ ఫీచర్లు అదించి ఫోన్ ప్రియులను ఆకట్టుకుంది.


దీంతో ఈ సిరీస్‌ బడ్జెట్‌ ధరలో మెరుగైన స్పెసిఫికేషన్‌ల కోసం ప్రసిద్ధి చెందింది. జీ 34 కి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు కంపెనీ జీ 35ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పుడు Moto G35 అనేక సర్టిఫికేషన్‌ ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించింది. రాబోయే ఈ Moto G35 స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Moto G35 గ్లోబల్ మోడల్ త్వరలో దేశీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికి ఈ ఫోన్ Geekbench, TUV, EUT, FCC, EEC, IMEI, UL డెమ్కో అనేక సర్టిఫికేషన్‌లలో లిస్ట్ చేయబడింది. ఈ సర్టిఫికేషన్ల ప్రకారం.. ఈ ఫోన్‌కు సంబంధించిన చాలా సమాచారం కూడా బయటకొచ్చింది. దాని ప్రకారం.. ఈ ఫోన్‌లో 5G సపోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ 4,850mAh బ్యాటరీని కలిగి ఉంటుందని UL డెమ్కో సర్టిఫికేషన్ డేటాబేస్ చెబుతోంది. ఈ ఫోన్ 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని చెప్పబడింది.


Also Read: వాసివాడి తస్సాదియ్య.. మోటో నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు కెవ్ కేక..!

Geekbench లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్‌లో UNISOC T760 SoC చిప్‌సెట్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 8 GB RAMతో వస్తుందని చెప్పబడింది. అంతేకాకుండా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OSతో రావచ్చని సమాచారం. సింగిల్ కోర్ టెస్ట్‌లో ఫోన్ 743 పాయింట్లు సాధించగా, మల్టీకోర్ టెస్ట్‌లో 2,363 పాయింట్లు సాధించింది. కాగా దీని ధర వివరాలు ఇంకా తెలియరానప్పటికీ కొందరు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అంచనా ప్రకారం.. ఈ ఫోన్‌ను రూ.15,999 ల ధరతో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Moto G34

Moto G34 ఫోన్ విషయానికొస్తే.. ఇది 6.5 అంగుళాల HD + (720×1,600 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAMను కలిగి ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది. ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులోని ప్రధాన సెన్సార్ 50 మెగాపిక్సెల్, 2 MP మాక్రో సెన్సార్ అందించబడింది. ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. Moto G34 5G 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 20W టర్బో పవర్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

Related News

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Flipkart Budget Phones: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. ₹20,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే..

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Big Stories

×