BigTV English

National Flag host by a Bird: జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకున్న పక్షి..ఎక్కడో తెలుసా?

National Flag host by a Bird: జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకున్న పక్షి..ఎక్కడో తెలుసా?

National Flag got stuck at the top while hoisting in Kerala then A bird came: స్వాతంత్ర దినోత్సవం రోజున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జాతీయ జెండాని ఎగురవేసి దేశభక్తిని చాటుకుంటారు. మహనీయుల త్యాగఫలాన్ని వివరిస్తూ నాటి తరం పెద్దలు నేటి తరం పిల్లలను ఉత్తేజితులను చేయడం చూస్తుంటాం. చిన్నారులు కూడా గాంధీ, నెహ్రూ వేషధారణతో అలరిస్తుంటారు. పెద్దయ్యాక వాటిని తమ తీపి గుర్తులుగా చూసుకుని మురిసిపోతుంటారు. దేశమంతటా స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో మునిగిపోయివుంటే కేరళలో ఓ అద్భుతం చోటుచేసుకుంది.


అద్భుతం చేసిన పక్షి

ఒక నోరులేని మూగ జీవి ఆకాశంలో ఎగురుకుంటూ తన దారిన తాను వెళ్లిపోకుండా ఓ అద్భుతం చేసి మరీ వెళ్లింది. కేరళ రాష్ట్రంలో ఓ కుగ్రామంలో స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. జెండా ఎగురవేయడానికి ముఖ్య అతిధులు కూడా వచ్చేశారు. అంతా ఉత్కంఠగా జెండా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. అయితే ముఖ్య అతిధిగా విచ్చేసిన వ్యక్తి జెండా తాడును లాగుతూ అలా పైకి తీసుకువెళ్లాడు. జెండా పోల్ చివరి మొన ఇరుక్కోవడంతో జెండా ఎంతకీ విడిపోక ఇబ్బందులు పెడుతోంది. అంతా ఉత్కంఠగా చూస్తుండగా ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఓ పక్షి అలా ఎగురుకుంటూ రివ్వున వచ్చి పోల్ చివరి భాగంలో నుంచుని ఇరుక్కున్న జెండాను పైకి లాగింది. ఇంకేముంది జెండా రెపరెపలాడుతూ ఎగిరింది.


చర్చనీయాంశంగా మారిన ఘటన

ఒక్కసారి ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అంతా ఆనందపరవశులయ్యారు. నిజంగా ఓ పక్షి ఏమిటి..ఇరుక్కున్న జెండాను బయటకు లాగడమేమిటి అని అంతా వింతగా చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ను స్థానిక గ్రామస్తుడు ఒకరు తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొందరైతే ఆ పక్షికి గతజన్మ స్మృతి ఉండివుంటుంది..అందుకే ఆ దేశభక్తిని ఇలా నిరూపించుకుంది అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆ పక్షి జెండా రంగులను చూసి అదేదో పండు అనుకుని వచ్చి వాలి ఉంటుంది. అంతకన్నా ఏమీ లేదని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటన అక్కడి గ్రామస్తులనే కాదు..దేశ వ్యాప్తంగా ఆలోచన రేకెత్తిస్తోంది. పక్షికి..దానికున్న దేశభక్తికి సెల్యూట్ చేస్తున్నారు.

fla

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×