BigTV English

Moto S50 Neo: దూసుకుపోతున్న మోటో.. మరో క్లాసిక్ ఫోన్‌ వచ్చేస్తుంది.. ఫీచర్లు అరాచకం..!

Moto S50 Neo: దూసుకుపోతున్న మోటో.. మరో క్లాసిక్ ఫోన్‌ వచ్చేస్తుంది.. ఫీచర్లు అరాచకం..!

Moto S50 Neo Launching Soon: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మోటోరోలా కంపెనీ తనదైన శైలిలో అదరగొడుతోంది. తరచూ కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటు ధరలో అధునాతన టెక్నాలజీ ఫీచర్లను అందించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే కంపెనీ తన లైనప్‌లో ఉన్న Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు కంపెనీ తన లైనప్‌లో ఉన్న మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.


ఈ సారి Moto S50 Neo పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌లో చైనాలో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్‌ను ఒక టిప్‌స్టర్ అందించారు. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ చైనాలో నెట్‌వర్క్ యాక్సెస్ అప్రువల్ కూడా పొందింది. దీంతో ఈ ఫోన్ XT2409-5 మోడల్ నంబర్‌తో చైనాకి చెందిన TENAA సర్టిఫికేషన్‌ను పొందింది. అయితే టిప్‌స్టర్ రాబోయే ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల గురించి కూడా కొంత సమాచారాన్ని అందించారు. దీని ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ LPDDR4X RAM + UFS 2.2 స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది.

ఇది మూడు కలర్ ఆప్షన్‌లతో లాంచ్ చేయబడుతుందని పేర్కొన్నారు. Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ చిన్న-స్క్రీన్ వెర్షన్‌గా Moto S50 Neo స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను Motorola లాంచ్ చేయవచ్చని చైనీస్ టిప్‌స్టర్ ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. రాబోయే ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించిన సమాచారం కూడా పోస్ట్‌లో ఇవ్వబడింది. దీని ప్రకారం.. Moto S50 Neo స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 7 Gen 1 ఎన్‌హేన్స్‌డ్ ఎడిషన్ అందుబాటులో ఉంటుంది. అలాగే Moto S50 Neo స్మార్ట్‌ఫోన్‌ 6.36-అంగుళాల (2670×1200 పిక్సెల్‌లు) OLED హైపర్‌బోలిక్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది.


Also Read: మోటో మామ మామూలోడు కాదు.. మార్కెట్‌లోకి మరో బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1600nits వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతునిస్తుందని తెలుస్తోంది. కాగా డిస్ప్లే 10 బిట్ కలర్ డెప్త్, హెచ్‌డిఆర్ 10+, డాల్బీ అట్మోస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్టివ్ గ్లాస్‌కు సపోర్ట్ చేస్తుందని కూడా చెప్పబడింది. అదే సమయంలో ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే OIS-మద్దతు గల 50-మెగాపిక్సెల్ Sony LYT-700 ప్రధాన వెనుక సెన్సార్ ఉంటుంది.

ఇందులో 13- మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 10-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లో మెగాపిక్సెల్ టెలిఫోటో (3x) లెన్స్ ఉంటాయి. ఫోన్ 4,310mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 68W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుందని చెప్పబడింది. కాగా ఈ ఫోన్‌ని జంగిల్ గ్రీన్, సాఫ్ట్ పీచ్, కోలా గ్రే కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేయవచ్చు. అంతేకాకుండా ఫోన్‌లో మెటల్ మిడిల్ ఫ్రేమ్ బిల్డ్ ఉండే అవకాశం ఉంది. ఇది IP68 రేటింగ్‌ని పొందవచ్చు. Moto S50 Neoలో డ్యూయల్ స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్, బ్లూటూత్ 5.2 సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

Related News

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

Big Stories

×