Motorola 55 inch QLED TV: మీ లివింగ్ రూమ్‌ని ఒక అల్ట్రా-మోడ్రన్ థియేటర్‌గా మార్చాలనుకుంటున్నారా? అయితే మోటోరోలా నుంచి వచ్చిన లేటెస్ట్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బాంబ్ Motorola 139.7 cm (55 inch) QLED Ultra HD TVపై ఒక లుక్కేయాల్సిందే. సరి కొత్త గూగుల్ 5.0 ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ , ఏకంగా 50 వాట్ల పవర్‌ఫుల్ స్పీకర్లతో ఈ టీవీ మార్కెట్లోకి దూసుకొచ్చింది. బడ్జెట్ ధరలో ప్రీమియం క్వాలిటీ కోరుకునే సినిమా లవర్స్ కోసం తీసుకొచ్చిన ఈ క్రేజీ స్మార్ట్ టీవీ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
సాధారణ LED టీవీలతో.. పోలిస్తే QLED టీవీల క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఈ మోటోరోలా 55 ఇంచుల స్మార్ట్ టీవీలో అట్రా హెచ్డీ ప్యానెల్‌ను ఉపయోగించారు. దీని వల్ల ప్రతి కలర్ చాలా రిచ్‌గా, రియలిస్టిక్‌గా కనిపిస్తుంది. మీరు వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీలు చూసినా, లేదా హై-గ్రాఫిక్స్ యాక్షన్ సినిమాలు చూసినా.. స్క్రీన్ మీదే లైవ్‌గా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దీని బెజెల్-లెస్ డిజైన్ మీ ఇంటి హాల్‌కు ఒక లగ్జరీ లుక్‌ను ఇస్తుంది.
చాలా టీవీల్లో పిక్చర్ బాగుంటుంది కానీ సౌండ్ కోసం విడిగా హోమ్ థియేటర్ లేదా సౌండ్‌బార్ కొనాల్సి వస్తుంది. కానీ.. ఈ మోటోరోలా టీవీ ఉంటే ఆ ఖర్చు ఆదా. ఎందుకంటే ఇందులో ఏకంగా 50 వాట్ల పవర్‌ఫుల్ స్పీకర్లను ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో వచ్చే ఈ స్పీకర్లు ఇచ్చే సౌండ్ అవుట్‌పుట్ మీ రూమ్‌ని బేస్‌తో షేక్ చేస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు డైలాగ్స్ చాలా స్పష్టంగా, క్రిస్టల్‌లా వినిపిస్తాయి.
ఈ ఎడిషన్ టీవీలో లేటెస్ట్ గూగుల్ టీవీ 5.0 OS ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇది చాలా స్మూత్‌గా, ఎలాంటి లాగ్స్ లేకుండా పనిచేస్తుంది. మీ వాచింగ్ హిస్టరీని బట్టి మీకు నచ్చిన కంటెంట్‌ను హోమ్ స్క్రీన్ పైనే రికమండ్ చేస్తుంది. కిడ్స్ మోడ్, పర్సనల్ ప్రొఫైల్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఉండనే ఉంది.. రిమోట్‌తో పనిలేకుండా నోటితో చెప్తే చాలు ఛానల్స్ మారిపోతాయి.
గేమింగ్ ఇష్టపడే.. కుర్రాళ్లకు కూడా ఈ టీవీ బాగా నచ్చుతుంది. ఇందులో.. హై-రిఫ్రెష్ రేట్, తక్కువ లాటెన్సీ ఉండటం వల్ల పీఎస్5 లేదా ఎక్స్‌బాక్స్ కనెక్ట్ చేసి స్మూత్‌గా గేమింగ్ ఆడుకోవచ్చు. అలాగే.. మల్టిపుల్ HDMI పోర్టులు, USB పోర్టులు, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై వంటి అన్ని రకాల కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో లోడ్ చేసి ఇచ్చారు.
ఒకప్పుడు 55 ఇంచుల ప్రీమియం క్యూఎల్ఈడీ టీవీ కొనాలంటే.. లక్షల్లో పెట్టాల్సి వచ్చేది. కానీ మోటరోలా ఈ ఎడిషన్ టీవీ ద్వారా తక్కువ బడ్జెట్‌లోనే.. 50W సౌండ్, గూగుల్ 5.0 ఓఎస్ వంటి ఫ్యూచరిస్టిక్ ఫీచర్లను అందిస్తోంది. మీ ఇంటిని ఒక మినీ థియేటర్‌లా మార్చుకోవడానికి ఇదొక పక్కా ‘పైసా వసూల్’ స్మార్ట్ టీవీ.