Motorola Buds 2 TWS: మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో.. అద్భుతమైన గాడ్జెట్లు విడుదలవుతుంటాయి. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ కోసం ప్రముఖ బ్రాండ్ మోటోరోలా మార్కెట్లోకి ఒక అద్భుతమైన ఇయర్ బడ్స్‌ను తీసుకువచ్చింది. బెస్ట్ 55dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), భారీ బ్యాటరీ బ్యాకప్ , డ్యూయల్ డ్రైవర్లతో వస్తున్న ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ధర కేవలం రూ. 2,799 మాత్రమే. ఈ లేటెస్ట్ గాడ్జెట్ ప్రత్యేకతలు, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
1.పాంటోన్ డిజైన్, ప్రీమియం లుక్:
ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్టుగా మోటోరోలా కంపెనీ ఈ ఇయర్ బడ్స్‌ను చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసింది. ప్రముఖ ‘పాంటోన్’ సంస్థ సహకారంతో తయారు చేసిన ఈ ఇయర్ బడ్స్ ‘పాంటోన్ కార్బన్’ కలర్ ఆప్షన్‌లో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇవి చెవిలో.. పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉండి, ఎక్కువ సేపు వాడినా ఎలాంటి నొప్పి రావు. చిన్న బాడీలో పెద్ద ఫీచర్లు ఇమిడి ఉన్న ఈ ఇయర్ బడ్స్ ప్రీమియం ఫీల్‌ను అందిస్తాయి. అలాగే ఇవి IP54 వాటర్ , స్వెట్ రెసిస్టెంట్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. కాబట్టి జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు.. లేదా చిన్నపాటి వర్షంలోనూ ఇవి పాడవకుండా ఉంటాయి.
మ్యూజిక్ లవర్స్‌ను దృష్టిలో.. ఉంచుకుని మోటోరోలా ఇందులో అద్భుతమైన సౌండ్ ఆర్కిటెక్చర్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఇయర్ బడ్స్‌లో 11mm డైనమిక్ డ్రైవర్ , 6mm మైక్రో ప్లానార్ మాగ్నెటిక్ డ్రైవర్లతో ఉన్న డ్యూయల్ డ్రైవర్ సెటప్ ఉంది. ఇది డీప్ బేస్‌తో పాటు స్పష్టమైన మిడ్స్ , హై ఫ్రీక్వెన్సీ ఆడియోను అందిస్తుంది. దీనికి తోడు హై-రెస్ ఆడియో, LDAC కోడెక్ సపోర్ట్ ఉండటం వల్ల పాటల్లోని ప్రతి చిన్న మ్యూజికల్ బీట్‌ను స్పష్టంగా ఎంజాయ్ చేయొచ్చు.
బయట ఉండే సౌండ్స్ పూర్తిగా అణచివేయడానికి ఇందులో పవర్ ఫుల్ 55dB డైనమిక్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను యాడ్ చేసారు. కాబట్టి ఇది మీ చుట్టూ ఉండే పరిసరాలలోని శబ్దాలను ఆటోమేటిక్‌గా గుర్తించి తగ్గిస్తుంది. అలాగే మ్యూజిక్ వింటూనే.. బయట ప్రపంచాన్ని గమనించడానికి ‘ట్రాన్స్‌పరెన్సీ మోడ్’ కూడా అందుబాటులో ఉంది.
ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు.. ప్రతి ఇయర్‌బడ్‌లో 3 చొప్పున మొత్తం 6 మైక్రోఫోన్ల సెటప్‌ను అందించారు. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, క్రిస్టల్‌టాక్ ఏఐ టెక్నాలజీ సాయంతో రద్దీగా ఉండే రోడ్లపై వెళ్తున్నప్పటికీ మీ గొంతు అవతలి వారికి స్పష్టంగా వినిపిస్తుంది.
బ్యాటరీ బ్యాకప్, లేటెస్ట్ కనెక్టివిటీ:
ఈ ఇయర్ బడ్స్ అతిపెద్ద హైలైట్ వాటి బ్యాటరీ లైఫ్. ఒక్క సారి ఛార్జ్ చేస్తే .. ఇయర్ బడ్స్ సుమారు 11 గంటల వరకు నిరంతరం ప్లేబ్యాక్ ఇస్తాయి. ఇక ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి వాడితే ఏకంగా 53 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది! అంటే.. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. దాదాపు రెండు రోజుల పాటు ఛార్జింగ్ గురించిన టెన్షన్ ఉండదు. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. సుమారు 3 గంటల పాటు మ్యూజిక్ ఎంజాయ్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
Also Read: రూ.781కే అదిరిపోయే సౌండ్..వినాయక చవితికి పర్ఫెక్ట్
కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇవి లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ సపోర్ట్‌తో వస్తాయి. దీని వల్ల కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే.. ఒకే సమయంలో రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే ‘డ్యూయల్ డివైజ్ కనెక్షన్’ఫీచర్ కూడా ఉంది. స్మార్ట్ వేర్ డిటెక్షన్ ద్వారా ఇయర్ బడ్స్ చెవిలో నుంచి తీయగానే పాట ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
ఇండియన్ మార్కెట్లో ఆఫర్లతో కలుపుకుని ఈ మోడల్ ధర కేవలం రూ. 2,799 మాత్రమే. రూ. 3,000 లోపు బడ్జెట్‌లో 55dB ANC, 53 గంటల బ్యాటరీ, Hi-Res ఆడియో, డ్యూయల్ డ్రైవర్లు కోరుకునే వారికి ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బ్లూటూత్ హెడ్‌సెట్ అని చెప్పొచ్చు!