E-Paper
Advertisement

సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన శాంసంగ్.. Galaxy S26 సిరీస్‌ ఫోన్లపై రూ.15,000 తగ్గింపు!

సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన శాంసంగ్.. Galaxy S26 సిరీస్‌ ఫోన్లపై రూ.15,000 తగ్గింపు!
Advertisement

Samsung Galaxy S26 and Ultra: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ప్రియులకు కంపెనీ తీపి కబురు చెప్పింది. శాంసంగ్ నుంచి వచ్చిన కొన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్ల రేట్ల కారణంగా చాలామంది కొనలేకపోయారు. అలాంటి వారి కోసమే ఇప్పుడీ అవకాశం వచ్చింది. తాజాగా మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ Galaxy S26 సిరీస్ ఫోన్లను ఇప్పుడు ఈ అధికారిక రీఫర్బిష్డ్ లిస్ట్‌లో చేర్చింది. అంటే.. ఈ సిరస్ ఫోన్లలో రెండు మోడల్స్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు అన్నమాట.

ఈ ఆఫర్ కింద టాప్‌ఎండ్ మోడల్ అయిన Galaxy S26 Ultraపై భారీగా ఆదా చేసుకోవచ్చు. 256GB వేరియంట్ కొత్తది మార్కెట్లో రూ.1,30,999 ఉండగా.. ఈ రీఫర్బిష్డ్ మోడల్ కేవలం రూ.1,18,999కే లభిస్తుంది. అంటే నేరుగా రూ.12,000 ఆదా అవుతుంది. ఇక 512GB మోడల్ మీద ఏకంగా రూ.15,000 తక్కువగా రూ.1,35,999కే ఇస్తున్నారు. Galaxy S26 విషయానికి వస్తే.. 256GB ఫోన్ రూ.74,799కి, 512GB ఫోన్ రూ.91,799కి లభిస్తోంది. కొత్త వాటితో పోలిస్తే వీటికి రూ.5,200 నుంచి రూ.8,200 వరకు తేడా వస్తుంది.

Advertisement

Also Read: షాపింగ్ ప్రియులకు అలర్ట్.. Flipkart Big Billion Days సేల్ డేట్స్ వచ్చేసాయోచ్!

చాలా మందికి రీఫర్బిష్డ్ ఫోన్లు అనగానే నాణ్యతపై అనుమానాలు వస్తుంటాయి. కానీ ఇది థర్డ్ పార్టీ వ్యక్తుల దగ్గర కొనే పాత ఫోన్ కాదు. నేరుగా శాంసంగ్ కంపెనీయే స్వయంగా తనిఖీ చేసి అమ్మే ఫోన్లు ఇవి. బయట లోకల్ రిపేర్లు చేయించినవి కావడంతో భయపడాల్సిన అవసరం లేదు. ఏ చిన్న లోపం ఉన్నా కంపెనీ ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వాడే రిపేర్ చేస్తుంది. అలాగే బ్యాటరీ పనితీరు కూడా స్టాండర్డ్స్ ప్రకారం పర్ఫెక్ట్‌గా ఉండేలా చూస్తారు. పాత యూజర్ల డేటా మొత్తం పూర్తిగా క్లీన్ చేసి, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వేసి మరీ మన చేతికి ఇస్తారు.

Advertisement

మనం లోకల్ మార్కెట్లో పాత ఫోన్లు కొంటే ఎలాంటి గ్యారెంటీ ఉండదు. కానీ శాంసంగ్ సర్టిఫైడ్ రిన్యూడ్ ఫోన్లపై కంపెనీ అఫీషియల్‌గా ఒక ఏడాది పాటు పూర్తి వారంటీ ఇస్తోంది. అంటే.. ఒక ఏడాది పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా ఫోన్‌ను వాడొచ్చు. బ్రాండ్ న్యూ ఫోన్ కొనే బడ్జెట్ లేని వాళ్లకు, అలాగని లోకల్ మార్కెట్‌లో రిస్క్ చేయలేం అనుకునే వాళ్లకు ఇది నిజంగానే ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ అనుభూతిని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ ఆప్షన్ బెస్ట్‌గా ఉంటుంది. బాక్స్ ప్యాక్డ్ కొత్త ఫోన్ కొనలేకపోయినా.. సేమ్ అదే లుక్, పెర్ఫార్మెన్స్ తక్కువ ధరకు పొందొచ్చు. డబ్బులు ఆదా అవుతూనే, కంపెనీ వారంటీ భరోసా కూడా దొరుకుతుంది కాబట్టి.. ఎలాంటి భయం లేకుండా ఈ Galaxy S26 ఫోన్లను ట్రై చేయొచ్చు.

Also Read: అలారం, డోర్‌బెల్, చిన్న పిల్లలు ఏడుపు.. అన్నింటినీ పసిపట్టేసే Apple Watch Series 12!

Tags

Related News

ఇయర్‌ఫోన్లు వాడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. 60/60 రూల్ పాటిస్తే అంతా సెట్!

6.5 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో రానున్న HMD Key 2.. ధర కూడా తక్కువే!

యూత్ ఫిదా అయ్యే లుక్ & ఫీచర్స్..మోటో కొత్త బడ్స్ లాంచ్!

షాపింగ్ ప్రియులకు అలర్ట్.. Flipkart Big Billion Days సేల్ డేట్స్ వచ్చేసాయోచ్!

రూ.781కే అదిరిపోయే సౌండ్..వినాయక చవితికి పర్ఫెక్ట్

పాత ఫోన్ నెంబర్ మార్చేశారా? తక్షణమే ఈ 4 పనులు చేయకపోతే రిస్కే!

అలారం, డోర్‌బెల్, చిన్న పిల్లలు ఏడుపు.. అన్నింటినీ పసిపట్టేసే Apple Watch Series 12!

Big Stories

Advertisement
×