E-Paper
Advertisement

రూ.781కే అదిరిపోయే సౌండ్..వినాయక చవితికి పర్ఫెక్ట్

రూ.781కే అదిరిపోయే సౌండ్..వినాయక చవితికి పర్ఫెక్ట్
Advertisement

iNFiRe Fusion 12W Bluetooth speaker: మ్యూజిక్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారా? ప్రయాణాల్లో లేదా ఇంట్లో ఉన్నప్పుడు పాటలను హై వాల్యూమ్‌లో ఎంజైజ్ చేయాలని చూస్తున్నారా? అయితే ..మీకోసం మార్కెట్లో ఒక అద్భుతమైన బడ్జెట్ ఆప్షన్ వచ్చేసింది. అదే ఈ బ్లూ టూత్ స్పీకర్. కేవలం రూ.781 అతి తక్కువ ధరలో లభిస్తున్న ఈ స్పీకర్, అద్భుతమైన సౌండ్ ,ట్రెండీ ఫీచర్లతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిన్న స్పీకర్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1. కాంప్యాక్ట్ డిజైన్, స్టైలిష్ లుక్:

ప్రస్తుత కాలంలో బ్లూటూత్ స్పీకర్స్ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇదొక ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారిపోయింది. ఈ మోడల్ చాలా కాంపాక్ట్ , లైట్‌వెయిట్ డిజైన్‌తో వస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కడికైనా ఈజీగా మీ బ్యాగ్‌లో లేదా చేతిలో పట్టుకుని ప్రయాణించవచ్చు. దీని మోడరన్ బ్లాక్ కలర్ ఫినిషింగ్ , ప్రీమియం గ్రిల్ డిజైన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చిన్న పార్టీలు, పిక్నిక్‌లు లేదా రూమ్ పార్టీలకు ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Advertisement

2.12W పవర్‌ఫుల్ సౌండ్ .. TWS టెక్నాలజీ:

ఈ స్పీకర్ సైజు చిన్నగా ఉన్నప్పటికీ, సౌండ్ విషయంలో .. మాత్రం అస్సలు తగ్గదు. ఇందులో ఏకంగా 12 వాట్స్ పవర్‌ ఫుల్ స్పీకర్ అవుట్‌పుట్ లభిస్తుంది. ఇది స్టీరియో ఛానెల్ సపోర్ట్‌తో వస్తుంది కాబట్టి, పాటలు వింటున్నప్పుడు సౌండ్ చాలా క్లియర్‌గా, బేస్‌తో కలిసి వస్తుంది.

Advertisement

దీనిలో ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్ TWS. అంటే మీ దగ్గర ఇలాంటి రెండు iNFiRe స్పీకర్లు ఉంటే.. రెండింటిని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి మరింత ఎక్కువ సౌండ్‌ను ఎంజాయ్ చేయెచ్చు. చిన్న గదిలో హోమ్ థియేటర్ లాంటి ఫీల్ పొందడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

3.మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్:

కేవలం బ్లూటూత్ ద్వారానే కాకుండా.. ఈ స్పీకర్‌ను రకరకాల పద్ధతుల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ .. ఉండటం వల్ల మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌ టాప్‌తో క్షణాల్లో పేర్ అవుతుంది. బ్లూటూత్ కనెక్షన్ కాకుండా USB.. డ్రైవ్ (పెన్ డ్రైవ్),SD కార్డ్ (మెమరీ కార్డ్) సపోర్ట్ కూడా ఇచ్చారు. దీనివల్ల మీ దగ్గర ఇంటర్నెట్ లేకపోయినా,.. పెన్ డ్రైవ్‌లో ఉన్న పాటలను నేరుగా ప్లే చేసుకోవచ్చు.

Also Read: ఈ ట్యాబ్ ఉంటే..ల్యాప్ టాప్ అవసరమే లేదు తెలుసా ?

4.బ్యాటరీ బ్యాకప్,ఈజీ ఆపరేషన్:

మ్యూజిక్ లవర్స్‌కు బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. ఈ మోడల్ పవర్ ఫుల్ బిల్ట్-ఇన్ బ్యాటరీతో వస్తుంది. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 8 గంటల పాటు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ లేకుండా రోజంతా పాటలు వినొచ్చు. అలాగే స్పీకర్ పైభాగంలో వాల్యూమ్ కంట్రోల్స్, ప్లే/పాజ్ బటన్స్ చాలా ఈజీగా వాడేందుకు డిజైన్ చేశారు.

ధర, ఎవరికి బెస్ట్?

ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ అసలు ధర కేవలం రూ. 781 మాత్రమే. వెయ్యి రూపాయల లోపు బడ్జెట్‌లో.. 12W పవర్, TWS ఫీచర్, 8 గంటల బ్యాటరీ బ్యాకప్, యూఎస్‌బీ/ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ దొరకడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. స్టూడెంట్స్, తక్కువ బడ్జెట్‌లో మంచి సౌండ్ కోరుకునే మ్యూజిక్ లవర్స్‌కు ఇది ఒక అద్భుతమైన, వ్యాల్యూ ఫర్ మనీ ఛాయిస్!

Related News

షాపింగ్ ప్రియులకు అలర్ట్.. Flipkart Big Billion Days సేల్ డేట్స్ వచ్చేసాయోచ్!

పాత ఫోన్ నెంబర్ మార్చేశారా? తక్షణమే ఈ 4 పనులు చేయకపోతే రిస్కే!

అలారం, డోర్‌బెల్, చిన్న పిల్లలు ఏడుపు.. అన్నింటినీ పసిపట్టేసే Apple Watch Series 12!

ఈ ట్యాబ్ ఉంటే..ల్యాప్ టాప్ అవసరమే లేదు తెలుసా ?

Whatsappలో ఇక మెసేజ్ లాగే మనీ ట్రాన్స్‌ఫర్.. ఫోన్‌పే, గూగుల్ పేలకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయం!

పీతల పెంకులతో బ్యాటరీనా? శాస్త్రవేత్తల ప్రయోగం చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

కేవలం 3.8 గ్రాముల బరువు, 50 గంటల బ్యాటరీ లైఫ్.. వివో కొత్త బడ్స్ భారత్‌లో లాంచ్!

Big Stories

Advertisement
×