BigTV English

Motorola Edge 50 Neo: మోటో మామ ఇచ్చిపడేశాడు.. ఇండియాలోకి వచ్చేస్తున్న మెస్మరైజింగ్ స్మార్ట్‌ఫోన్, చుక్కలు కనబడతాయ్!

Motorola Edge 50 Neo: మోటో మామ ఇచ్చిపడేశాడు.. ఇండియాలోకి వచ్చేస్తున్న మెస్మరైజింగ్ స్మార్ట్‌ఫోన్, చుక్కలు కనబడతాయ్!

Motorola Edge 50 Neo Price: మోటోరోలా దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతుంది. పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్లను మార్కెట్‌లో లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇప్పటికే ఎన్నో ఫోన్లను రిలీజ్ చేసింది. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటు ధరలో లాంచ్ చేస్తూ మరింత పాపులర్ అయింది. ఇక గత నెలలో అంటే ఆగస్టులో Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్‌ను యూరప్‌లో లాంచ్ చేసి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఆ మొబైల్‌ను ఇండియాలో లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.


భారతదేశంలో ఈ Motorola Edge 50 Neo విడుదల తేదీని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ మొబైల్ భారతీయ వేరియంట్ గ్లోబల్ వెర్షన్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా దీని డిజైన్, ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్లు లాంచ్‌కు ముందే వెల్లడయ్యాయి. అలాగే Motorola Edge 50 Neo కలర్ ఆప్షన్‌లు కూడా బయటకొచ్చాయి. కాగా ఇందులోని బేస్ మోటరోలా ఎడ్జ్ 50, ఎడ్జ్ 50 ప్రో ఇప్పటికే భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి.

Motorola Edge 50 Neo India Launching Date


Motorola Edge 50 Neo భారతదేశంలో ఈ నెల అంటే సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 12 గంటలకు IST లాంచ్ అవుతుంది. ఇది దేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ టీజర్‌లో ‘‘1-hour flash sale’’ సేల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. Motorola Edge 50 Neo దేశంలో Pantone క్యూరేటెడ్ కలర్‌లలో, వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో అందుబాటులో ఉంటుంది. ఫోన్ గ్రిసైల్, లాట్టే, నాటికల్ బ్లూ, పోయిన్సియానా వంటి నాలుగు కలర్‌ ఆప్షన్‌లలో అందించబడుతుంది.

Also Read: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ దేశీయ ధరలు.. ఫస్ట్ సేల్‌లో రూ.5000 భారీ తగ్గింపు!

Motorola Edge 50 Neo Features

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ MIL-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. అంతేకాకుండా ఇది యాక్సడెంటల్ డ్రాప్స్, విపరీతమైన టెంపరేచర్, ఉష్ణమండల తేమను తట్టుకోగలదని కంపెనీ తెలిపింది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత హలో UIతో వస్తుంది. ఐదేళ్లపాటు OS అప్‌గ్రేడ్‌లతో పాటు ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్‌లను పొందుతుంది. Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ Flipkart microsite ప్రకారం.. ఇది AI స్టైల్ సింక్, AI మ్యాజిక్ కాన్వాస్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కలిగి ఉంటుంది.

Motorola Edge 50 Neo ఫోన్ 3000 nits గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది SGS ఐ ప్రొటెక్షన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సేఫ్టీతో LTPO 120Hz అడాప్టివ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ 50-మెగాపిక్సెల్ సోనీ లిటియా 700C ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్, 30x డిజిటల్ జూమ్ మద్దతుతో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్‌తో వస్తుంది. అదే సమయంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అమర్చబడి ఉంది. అలాగే Motorola Edge 50 Neo ఫోన్ గ్లోబల్ వేరియంట్ MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 68W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4310mAh బ్యాటరీతో వస్తుంది. ఎంపిక చేసిన యూరోపియన్ మార్కెట్‌లలో దీని ధర EUR 499 (దాదాపు రూ.46,000)గా నిర్ణయించబడింది.

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×