E-Paper
Advertisement

భారత్‌లోకి Motorola Edge 70 Neo 5G.. ఈ ఫోన్ కోసం ఎదురుచూడటానికి ముఖ్య కారణాలివే!

భారత్‌లోకి Motorola Edge 70 Neo 5G.. ఈ ఫోన్ కోసం ఎదురుచూడటానికి ముఖ్య కారణాలివే!
Advertisement

Motorola Edge 70 Neo 5G: స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నవారికి మోటరోలా నుంచి మరో ఆసక్తికరమైన ఫోన్‌ రాబోతోంది. ఎడ్జ్ 70 సిరీస్‌లో కొత్తగా చేరనున్న Edge 70 Neo 5G గురించి ఇప్పటికే కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్ కనిపించడంతో భారత్‌లో లాంచ్ దగ్గర్లోనే ఉందనే అంచనాలు పెరిగాయి. నవంబర్ 26, 2026న విడుదల కావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే కంపెనీ ఇంకా తేదీని, పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ధర రూ.30,000 నుంచి రూ.35,000 మధ్య ఉండొచ్చని అంచనా. ఈ ఫోన్ కోసం వెయిట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..

ప్రీమియం కర్వ్డ్ డిస్‌ప్లే..

ఈసారి మోటరోలా డిస్‌ప్లే విషయంలో పెద్ద అప్‌గ్రేడ్ ఇస్తోంది. ఇందులో 6.78 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండబోతోంది. 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఏకంగా 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కూడా ఉంది. సినిమాలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి ఈ స్క్రీన్ సూపర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

స్మూత్ పెర్ఫార్మెన్స్..

Advertisement

వేగవంతమైన పనితీరు కోసం ఇందులో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌ను వాడుతున్నారు. ఇది 4nm టెక్నాలజీతో తయారైంది కాబట్టి.. ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా పనిచేస్తుంది. అంతేకాదు.. ఇందులో 6GB లేదా 8GB LPDDR5X ర్యామ్‌తో పాటు వేగవంతమైన 128GB, 256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లు కూడా లభిస్తాయి. గేమింగ్ ఆడేవాళ్లకు ఇది మంచి ప్లస్ పాయింట్.

Also Read: పదేళ్ల తర్వాత ఐఫోన్‌లో భారీ మార్పులు.. నాలుగు వైపులా వంపు తిరిగిన గ్లాస్ డిస్‌ప్లేతో iPhone 20 Pro!

భారీ 7000mAh బ్యాటరీ..

Advertisement

సాధారణంగా స్లిమ్ ఫోన్లలో బ్యాటరీ తక్కువగా ఉంటుంది. కానీ మోటరోలా ఇందులో ఏకంగా 7000mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందిస్తోంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా బ్యాటరీ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.

మార్కెట్‌లో గట్టి పోటీ ఖాయం..

ఇక కెమెరా విషయానికొస్తే.. వెనుకవైపు OIS సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంటాయి. సెల్ఫీల కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ ధరలో వస్తున్న రెడ్‌మీ, రియల్‌మీ, వన్‌ప్లస్, శాంసంగ్ ఫోన్లకు మోటరోలా గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయం.

Also Read: పోయిన ఐఫోన్ దొరికిందని మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. కేంద్రం వార్నింగ్!

Tags

Related News

పదేళ్ల తర్వాత ఐఫోన్‌లో భారీ మార్పులు.. నాలుగు వైపులా వంపు తిరిగిన గ్లాస్ డిస్‌ప్లేతో iPhone 20 Pro!

BSNL బంపరాఫర్.. రూ.51కే కొత్త సిమ్.. అపరిమిత కాల్స్, డైలీ 2GB డేటా!

రూ.299కే 1.5GB డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏడాది పాటు ఆ సేవలు ఉచితం!

72 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీగా హాట్ స్టార్, అన్‌లిమిటెడ్ 5G.. ఈ జియో ప్లాన్‌ భలే ఉందే!

పోయిన ఐఫోన్ దొరికిందని మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. కేంద్రం వార్నింగ్!

స్మార్ట్‌ఫోన్లకు పోటీగా HMD 2320 Flip 4G ఫ్లిప్ ఫోన్.. వాకీ-టాకీ ఫీచర్, టైప్-సీ ఛార్జింగ్‌తో అదరగొట్టే స్పెసిఫికేషన్లు!

క్రియేటర్లు, స్టూడెంట్లకు జియో బంపర్ గిఫ్ట్.. రూ.349 రీఛార్జ్‌తో ఏడాది పాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్!

Big Stories

Advertisement
×