Dinesh Karthik On U-19 Pakistan: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Under-19 Asia Cup 2026 tournament) విజేతగా టీమిండియా జూనియర్ జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. మొన్న శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును ఒకే ఒక్క వికెట్ తేడాతో జూనియర్ టీమ్ ఇండియా చిత్తు గా ఓడించి.. తొమ్మిదవ సారి ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఈ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన టీమిండియా క్రికెటర్లు… పాకిస్తాన్ ప్లేయర్ల ముందుకు వెళ్లి అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
అయితే ఈ సెలబ్రేషన్స్ పై పాకిస్తాన్ మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో టీమిడియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ( Dinesh Karthik) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా క్రికెటర్ల సెలబ్రేషన్స్ గురించి మాట్లాడే వెధవలు… ముందు అండర్ 19 ఆసియా కప్ ఆడిన పాకిస్తాన్ క్రికెటర్ల బర్త్ సర్టిఫికెట్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశాడు. 30 సంవత్సరాలు దాటిన వాళ్లతో అండర్ 19 ఆసియా కప్ ఆడించారని ఆరోపించాడు. అంకుల్స్ ను తీసుకువచ్చి అండర్ 19 ఆసియా కప్ ఆడిస్తారా? అంటూ ప్రశ్నించాడు. దీనిపై వెంటనే ఐసీసీ విచారణ చేయాలని కూడా కోరాడు. దీంతో దినేష్ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో పాల్గొన్న పాకిస్తాన్ జట్టు ప్లేయర్లపై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నమెంట్ లో అందరినీ మోసం చేసి.. 25-30 సంవత్సరాలు దాటిన ఆటగాళ్లను బరిలోకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దింపిందని మండిపడ్డాడు. అండర్ 19 ఆసియా కప్ దాదాపు మూడుసార్లు ఆడిన అలీ రాజా అను ఎలా ఆడిస్తారు ? అని నిలదీశాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఒకరిద్దరు తప్ప అందరూ 25 సంవత్సరాలు దాటిన వాళ్లే ఉన్నారని తనకు అనుమానంగా ఉందని పేర్కొన్నాడు.
టోర్నమెంట్ ముగిసినప్పటికీ ఈ అంశంపై ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కచ్చితంగా విచారణ చేయాలని డిమాండ్ చేశాడు. అంకుల్స్ ను తీసుకువచ్చి అండర్ 19 ఆసియా కప్ ఆడిస్తే ఎలా? అంటూ ప్రశ్నించాడు. ఈ విషయంలో తాను తగ్గబోనని… అసలు విషయం బయటపడే వరకు ఊరుకోబోనని స్పష్టం చేశాడు. టీమిండియా క్రికెటర్ల అగ్రెసివ్ సెలబ్రేషన్స్ పై రెచ్చిపోయి మాట్లాడుతున్న పాకిస్తాన్ మాజీలు… ముందు అండర్ 19 పాకిస్తాన్ క్రికెటర్ల బర్త్ సర్టిఫికెట్లు బయటపెట్టాలని ఆగ్రహించాడు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ అండర్ 19 ప్లేయర్లపై దినేష్ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.