Asia Cup 2025 : ఆసియా కప్ 2025 టోర్నీ ప్రస్తుతం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రేపు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండనుంది. ఈ నేపథ్యంలోనే భారత్-పాక్ మ్యాచ్ పై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏసీసీ, ఐసీసీ నిర్వహించే మల్టీనేషనల్ టోర్నీల్లో అన్ని దేశాలు పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతాయి. ప్రత్యర్థి జట్టుకు పాయింట్ ఇస్తారు. పాక్ తో భారత్ చాలా ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. ఇండియా పై పాక్ ఉగ్రవాదదాడులు ఆపే వరకు ఆ నిర్ణయం కొనసాగుతుంది ష అని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Salman Ali Agha : ఒమన్ కంటే దారుణంగా టీమిండియాను ఓడిస్తాం!
మరోవైపు టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఆడకూడదని పలువురు టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు. ఒకవేళ మనం మ్యాచ్ ఆడకుంటే నేరుగా పాకిస్తాన్ జట్టుకి పాయింట్ వెళ్తుంది. దీంతో టీమిండియా వెనుకంజలోకి వెళ్తుందని పేర్కొన్నారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ పై మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలకవ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించాల్సిన అవసరం ఏంటి..? అని ప్రశ్నించారు. ఈ మ్యాచ్ జరగకూడదని దేశం మొత్తం చెబుతుంది. అలాంటప్పుడు ఈ మ్యాచ్ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఇది కూడా ట్రంప్ ఒత్తిడితోనే జరుగుతోందా..? అని ప్రశ్నించారు. ట్రంప్ నకు ఇంకా ఎంతవరకు తలవంచుతారు అని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Also Read : Asia Cup 2025: పాకిస్థాన్ చేతిలో ఓడితే… టీమిండియా ప్లేయర్లను దేవుడు కూడా కాపాడలేడు !
సెప్టెంబర్ 14 ఆదివారం రోజు టీమిండియా కి రెండు క్రికెట్ మ్యాచ్ లు ఫ్యాన్స్ కి డబుల్ కిక్ ఇవ్వనున్నయి. ఇందులో భాగంగా దుబాయ్ వేదికగా ఆసియా కప్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆసియా కప్ టోర్నీకే హైలెట్ గా నిలువనుంది. రేపు రాత్రి 8 గంటలకు సోనీ స్పోర్ట్స్ లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతోంది. మరోవైపు ఐసీసీ వరల్డ్ కప్ ముందు టీమిండియా ఉమెన్స్ టీమ్ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 14న చండిఘర్ లోని ములాన్ పూర్ క్రికెట్ స్టేడియంలో ఫస్ట్ వన్డే మ్యాచ్ ఆదివారం ప్రారంభం కానుంది. దీంతో సెప్టెంబర్ 14న టీమిండియా ఫ్యాన్స్ కి పండుగ అనే చెప్పాలి. ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ తో టీమిండియా కి రెండో వన్డే మ్యాచ్ సెప్టెంబర్ 17, మూడో వన్డే సెప్టెంబర్ 20న జరుగనుంది. సెప్టెంబర్ 30 నుంచి ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగనుంది.