Mohan Babu Case : సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఫ్యామిలీ వివాదం ఆయనను మరిన్ని చిక్కుల్లోకి నటిన సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు – మనోజ్ మధ్య జరిగిన గొడవలో… మోహన్ బాబు జర్నలిస్ట్ లపై దాడి చేయడంతో ఆయనపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదైంది. తాజాగా ఈ కేసు విచారణకు రాగా, మోహన్ బాబు అరెస్టు భయంతో దుబాయ్ పారిపోయినట్టుగా తెలుస్తోంది.
తాజాగా మోహన్ బాబు (Mohan Babu) ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. మోహన్ బాబు ఇటీవలే ముందస్తు బెయిల్ కోసం ట్రై చేయగా, కోర్టు నిరాకరించింది. అయితే తాజాగా మరోసారి విచారణ జరగగా, కోర్టులో బాధితుల తరపు న్యాయవాది అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడంతోనే మోహన్ బాబు జర్నలిస్ట్ హాస్పిటల్ లో కలిశారని అన్నారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి కాబట్టి మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని వాదించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా అరెస్టు భయంతో మోహన్ బాబు దుబాయ్ వెళ్ళాడని కోర్టులో వెల్లడించారు.
అయితే మోహన్ బాబు (Mohan Babu) తరఫున సీనియర్ న్యాయవాది రవిచంద్రన్ వాదించారు. ఆయన దుబాయ్ పారిపోలేదని రవిచందర్ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. దీంతో మోహన్ బాబు ఇక్కడే ఉన్నాడు అన్న విషయాన్ని అఫీడవిట్ రూపంలో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని మోహన్ బాబును అరెస్ట్ చేయకుండా సోమవారం వరకు రిలీఫ్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోరగా, నాట్ టు అరెస్టుకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు మరోసారి నిరాకరించినట్టుగా సమాచారం. ఈ కేసులో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
మోహన్ బాబు (Mohan Babu) దాడి చేసిన జర్నలిస్ట్ కు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయనపై ఈ విషయంలో తీవ్రమైన నెగెటివిటీ రావడంతో అటెంప్ట్ టు మర్డర్ కింద కేసును నమోదు చేశారు పోలీసులు. ముందుగా ఇందులో తమ తప్పేమీ లేదన్నట్టుగా వ్యవహరించారు. తీవ్రమైన నెగెటివిటీ రావడంతో మోహన్ బాబు తగ్గక తప్పలేదు. బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో పాటు ఇటీవలే సదరు జర్నలిస్ట్ ను ఆసుపత్రిలో పరామర్శించారు మంచు మోహన్ బాబు. ఈ సందర్భంగా బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కానీ మరోవైపు పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు (Mohan Babu) తన దగ్గర ఉన్న రెండు గన్ లను ఇప్పటికే పోలీసులకు అప్పగించారు. ఇక అరెస్ట్ అవుతాననే భయంతో మోహన్ బాబు పరారీలో ఉన్నారు అనే వార్తలు రాగా, ఆయన స్పందిస్తూ ఎక్కడికీ పారిపోలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే బెయిల్ కోసం మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారు. కానీ తాజాగా మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో మోహన్ బాబుకు హై కోర్టులో చుక్కెదురైంది.