E-Paper
Advertisement

OLED MacBook Pro: శాంసంగ్ డిస్‌ప్లేతో ఆపిల్ ల్యాప్‌టాప్.. ఓలెడ్ మ్యాక్‌బుక్ ప్రో లాంచ్ టైమ్‌లైన్ లీక్

OLED MacBook Pro: శాంసంగ్ డిస్‌ప్లేతో ఆపిల్ ల్యాప్‌టాప్.. ఓలెడ్ మ్యాక్‌బుక్ ప్రో లాంచ్ టైమ్‌లైన్ లీక్
Advertisement

OLED MacBook Pro| టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త టెక్నాలజీ డిస్‌ప్లేతో మ్యాక్‌బుక్ తీసుకురాబోతోంది. తాజా లీక్స్ ప్రకారం.. ఈ మ్యాక్‌బుక్ ప్రో OLED డిస్‌ప్లేతో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ ల్యాప్‌టాప్ టెక్నాలజీ చర్చల్లో ఉంది. లీక్స్ ద్వారా లాంచ్ టైమ్‌లైన్ గురించి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో శాంసంగ్ డిస్‌ప్లే తయారు చేసే OLED ప్యానెల్స్ ఉపయోగిస్తారని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రొడక్షన్ టార్గెట్స్ సమయానికి పూర్తి చేయడానికి ఆపిల్ భారీ స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించింది. ఈ మ్యాక్‌బుక్ ప్రోలో డిస్‌ప్లేతో పాటు చాలా మెరుగైన ఫీచర్లు కూడా ఉంటాయి.

లాంచ్ టైమ్‌లైన్ ఏమిటి?

కొరియన్ టెక్ పబ్లికేషన్ The Elec రిపోర్ట్ ప్రకారం.. ఆపిల్ ఈ డివైస్‌ను 2026 చివరి నాటికి లాంచ్ చేయవచ్చు. నాలుగో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2026) మార్కెట్‌లోకి అందుబాటుకి ఉంటుందని అంచనా. ఇందుకోసం శాంసంగ్ డిస్‌ప్లే OLED ప్యానెల్స్ ఉత్పత్తి వేగాన్నిపెంచిందని సమాచారం. ఆపిల్ లాంచ్ షెడ్యూల్‌కు తగినంత సప్లై అందుబాటులో ఉండేలా చూస్తోంది శాంసంగ్. ప్రీమియం ప్రొడక్ట్‌లకు ఆపిల్ సాధారణంగా ఎక్కువ టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్ చేస్తుంది. కొన్ని భాగాలు ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత రిపోర్టులు 2026 చివరి లాంచ్‌ను సూచిస్తున్నాయి.

OLED మ్యాక్‌బుక్ ప్రో డిస్‌ప్లే వివరాలు

Advertisement

శాంసంగ్ రెండు సైజుల్లో OLED ప్యానెల్స్ తయారు చేస్తోంది. 14 ఇంచ్, 16 ఇంచ్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రస్తుత మ్యాక్‌బుక్ ప్రో సైజులతో సమానంగా ఉంటాయి. ఈ OLED డిస్‌ప్లేలో మొదటిసారి టచ్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. ప్రొఫెషనల్ డివైస్‌లలో టచ్ కంట్రోల్స్‌ను ఆపిల్ క్రమంగా తీసుకొస్తోంది. OLED స్క్రీన్లు మినీ LED కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి. డీప్ బ్లాక్స్, బెటర్ కలర్స్, హై కాంట్రాస్ట్, మంచి వ్యూయింగ్ యాంగిల్స్, ఫాస్ట్ రెస్పాన్స్ టైమ్ ఇస్తాయి. కంటెంట్ క్రియేషన్, వీడియో ఎడిటింగ్ వంటి పనులకు చాలా బాగుంటుంది.

పెర్ఫామెన్స్, హార్డ్‌వేర్ అంచనాలు

ఆపిల్ కొత్త M6 సిరీస్ చిప్‌ను 2nm ప్రాసెస్‌తో తయారు చేస్తోంది. ఈ చిప్ వేగం, పవర్ ఎఫిషియెన్సీలో మెరుగ్గా ఉంటుంది. అడ్వాన్స్‌డ్ AI, క్రియేటివ్ వర్క్‌లోడ్స్‌ను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. ఈ మ్యాక్‌బుక్ ప్రోని ఆపిల్ తన అత్యంత పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌గా తీర్చిదిద్దుతోంది. థిన్నర్, లైట్‌వెయిట్ డిజైన్ వస్తుంది. ఇంటర్నల్ కాంపోనెంట్స్ రీడిజైన్ చేసి స్పేస్ సేవ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ మెరుగుపడుతుంది. మెరుగైన కూలింగ్ సిస్టమ్ కూడా రావచ్చు.

Advertisement

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా ఆఫ్ చేయండి

సేల్స్ లక్ష్యాలు, మార్కెట్ ప్రభావం

మొదటి ఏడాదిలో 20 లక్షల యూనిట్లు విక్రయించాలని ఆపిల్ టార్గెట్ పెట్టుకుంది. ఈ భారీ టార్గెట్ ఆపిల్ ప్రొడక్ట్ డిమాండ్‌ ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తోంది. OLED మ్యాక్‌బుక్స్.. విండోస్ ప్రీమియం ల్యాప్‌టాప్ యూజర్లను ఆకర్షిస్తాయి. ప్రొఫెషనల్ ల్యాప్‌టాప్‌లకు కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తాయి. క్రియేటర్లు, డెవలపర్లు, ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. భవిష్యత్తులో మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్‌పై కూడా ప్రభావం చూపవచ్చు.

ఆపిల్ OLED మ్యాక్‌బుక్ ప్రో ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. కానీ మాన్యుఫాక్చరింగ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో.. ఈ కొత్త రకం ల్యాప్‌టాప్ విజయవంతంగా లాంచ్ అయితే ఆపిల్ ప్రొడక్ట్ స్ట్రాటజీని మార్చే అవకాశం ఉంది.

Related News

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9 వచ్చేస్తోంది!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

Big Stories

Advertisement
×