BigTV English
Advertisement

This Week Launching Mobiles: ఈవారం లాంచ్ కానున్న ఫోన్లు.. టాప్ సిక్స్ ఇవే.. లిస్టుపై ఓ లుక్కేయండి!

This Week Launching Mobiles: ఈవారం లాంచ్ కానున్న ఫోన్లు.. టాప్ సిక్స్ ఇవే.. లిస్టుపై ఓ లుక్కేయండి!

This Week Launching Mobiles: ఇండియా స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్‌లో అగ్రగామిగా ఎదుగుతుంది. టెక్ కంపెనీలు అన్ని దేశంలో తమ మానుఫ్యాక్చురింగ్ యూనిట్లను స్థాపించేందుకు సిద్దమవుతాయి. సరికొత్త టెక్నాలజీతో ఫోన్లను మొబైల్ ప్రియులకు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే వారం టెక్ మార్కెట్ ఫుల్ రష్‌‌గా మారబోతుంది. అనేక ప్రముఖ కంపెనీలు కొత్త ఫోన్లను విడుదల చేయనున్నాయి. ఇందులో ఒప్పో, రియల్‌మీ, షియోమీ, మోటరోలా, పోకో, నథింగ్‌కు చెందిన ఫోన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా 5జీ ఫోన్లు. వీటిలో బెస్ట్ ఫీచర్లను చూడొచ్చు. ఆ ఫోన్ల ఫీచర్లు, ధరలు, లాంచ్ తేదీల గురించి వివరంగా తెలుసుకుందాం.


1. Oppo K12x 5G
ఈ 5G ఫోన్ జూలై 29 న దేశంలో లాంచ్ కానుంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానుంది. దాని మైక్రోసైట్ కూడా ప్రత్యక్ష లైవ్ అవుతుంది. దీనిలో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే.. ఫోన్ సరిగ్గా వన్‌ప్లస్ నార్డ్ CE 4 Lite 5G లాగా ఉంటాయి. ఫోన్ 360 డిగ్రీ డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్ బాడీతో వస్తుంది. అంటే ఫోన్ పడిపోతే విరిగిపోతుందనే భయం ఉండదు.

ఇది IP54 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్ 7.68 మిమీ అల్ట్రా స్లిమ్ బాడీతో రానుంది. ఇది స్ప్లాష్ టచ్‌ సపోర్ట్ ఇస్తుంది. అంటే తడి చేతులతో కూడా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5100 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.


2. Xiaomi 14 Civi Limited Edition
ఈ కూల్ ఫోన్ జూలై 29 అంటే ఈ రోజు దేశంలో లాంచ్ కానుందిద. ఇది డ్యూయల్ టోన్ ఫినిషింగ్ కలిగి ఉంటుంది. దీనిని పాండా డిజైన్ అని పిలుస్తారు. దీని బ్యాక్ ప్యానెల్‌లో సగం గాజుతో ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ బ్లూ, పింక్, వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రొఫెషనల్ కెమెరా ట్యూన్ చేయబడిందని లైకా వెల్లడించింది. సెల్ఫీ కోసం, ఫోన్‌లో రెండు 32 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. అన్ని కెమెరాలలో 4K రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంటుంది.

ఫోన్ 1.5K రిజల్యూషన్ సపోర్ట్‌తో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనిలో క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను ఉంటుంది. ఇది HDR10+, Dolby Vision Atmosకి సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB RAM + 512GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 67W వరకు వైర్డు టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ కేవలం 7.4 మిమీ సన్నగా ఉంటుంది. దీని బరువు 177 గ్రాములు.

3. Realme 13 Pro Series
ఈ ఫోన్‌లు జూలై 30 న దేశంలో విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌లో రియల్‌మీ 13 ప్రో 5 జీ, రియల్‌మీ 13 ప్రో ప్లస్ 5 జీ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. రియల్‌మీ Watch S2, Buds T310 ఇయర్‌బడ్‌లు కూడా ఫోన్‌తో పాటు అందుబాటులోకి వస్తాయి. రాబోయే Realme ఫోన్‌లలో Snapdragon 7s Gen 2 5G 4nm ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్‌లు 9-లేయర్ 3D VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. ఈ టెక్నాలజీ ఫోన్ వేడెక్కకుండా చేస్తుంది. ఈ సిరీస్‌లో 5200mAh బ్యాటరీ ఉంది. ఫోన్ ఎర్లీ బర్డ్ సేల్ కూడా జూలై 30 సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది.

ఫోటోగ్రఫీ కోసం రియల్‌మీ 13 Pro+ 50 మెగాపిక్సెల్ Sony LYT-701 సెన్సార్, 50 మెగాపిక్సెల్ Sony LYT-600 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో ఉంటుంది. 120x వరకు జూమ్ సపోర్ట్ అందుబాటులో ఉందని కంపెనీ టీజ్ చేసింది. ఫోన్‌లో రెండు సోనీ సెన్సార్లు ఉంటాయి.రెండూ OIS సపోర్ట్‌తో వస్తాయి. ఇది పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోన్ అని కంపెనీ తెలిపింది. ఫోన్‌తో డీఎస్‌ఎల్‌ఆర్ లాంటి ఫొటోలు కూడా తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. AI అల్ట్రా క్లారిటీ, AI స్మార్ట్ రిమూవల్, AI గ్రూప్ ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్, AI ఆడియో జూమ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న అనేక AI ఫీచర్లు కూడా ఫోన్‌లో అందుబాటులో ఉంటాయి.

4. Nothing Phone (2a) Plus
ఈ ఫోన్ జూలై 31న భారతదేశంలో విడుదల కానుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఫోన్ MediaTek Dimensity 7350 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 12GB RAM 8GB RAM బూస్టర్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్టాండర్డ్ ఫోన్ 2ఎతో పోలిస్తే ప్లస్ మోడల్ చాలా అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ప్లస్ మోడల్‌లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అయితే స్టాండర్డ్ మోడల్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ 2a లాగా ప్లస్ మోడల్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే ఇది ముందు మోడల్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో పోలిస్తే 50W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

నథింగ్ ఫోన్ 2a ప్లస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అండర్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు NFC వంటి ఫీచర్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ 2a ప్లస్ కెమెరా సిస్టమ్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలలో 4K వీడియో రికార్డింగ్, HDR ఫోటోలు, HDR10+ ప్లేబ్యాక్‌కు ససోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ 5G, బ్లూటూత్ 5.3, Wi-Fi 6 ఉంటాయి.

5. Motorola Edge 50
ఈ ఫోన్ ఆగస్టు 1న దేశంలో లాంచ్ అవుతుంది. దీనిని ఫ్లిప్‌‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. సోనీ LYTIA 700C కెమెరా సెన్సార్, IP68 రేటెడ్ బిల్డ్‌తో ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత స్లిమ్ MIL-810H సర్టిఫైడ్ ఫోన్ అని కంపెనీ వెల్లడించింది. జంగిల్ గ్రీన్, పాంటోన్ పీచ్ ఫడ్జ్ వేగన్ లెదర్ ఫినిషింగ్, వేగన్ సూడో ఫినిషింగ్ కలిగిన కోలా గ్రే షేడ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులోకి వస్తుంది.

ఫోన్ 6.67 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, స్మార్ట్ వాటర్ టచ్ ఫీచర్‌తో వస్తుంది. Snapdragon 7 Gen 1 ప్రాసెసర్ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో మూడేళ్లపాటు OS అప్‌డేట్‌లు, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందింస్తామని కంపెనీ వెల్లడించింది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 700సి ప్రైమరీ కెమెరా మోటో AI ఫీచర్లు, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీ కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ 68W వైర్డ్ టర్బోపవర్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

6. POCO M6 Plus
ఈ ఫోన్‌ ఆగస్టు 1న దేశంలో విడుదల చేయనుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్. దీని మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. ఇది బ్యాక్ డ్యూయల్ టోన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ ఫ్లాట్ ఎడ్జ్‌లను కలిగి ఉంది. ఫ్రంట్ పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఫోన్ బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్/1.75 పెద్ద ఎపర్చర్‌తో వస్తుంది. 3x ఇన్-సెన్సార్ జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇందులో రింగ్ LED ఫ్లాష్ లైట్ కూడా ఉంది. అదే రోజు కంపెనీ ఫోన్‌తో పాటు POCO బడ్స్ X1 ఇయర్‌బడ్‌లను కూడా లాంచ్ చేస్తుంది.

Related News

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Big Stories

×