EPAPER

CM Chandrababu Plan 2.0: కడపలో చంద్రబాబు యాక్షన్ 2.0.. ఎలా ఉండబోతుంది ?

CM Chandrababu Plan 2.0: కడపలో చంద్రబాబు యాక్షన్ 2.0.. ఎలా ఉండబోతుంది ?

How is Chandrababu Action 2.0 Going to be in Kadapa: ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నెలన్నర దాటింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు కూటమి చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేడరు వివరాలను సేకరిస్తున్నారట. ఐదేళ్ల జగన్ పాలనలో కడప జిల్లాలో టీడీపీ కేడర్ కుదేలైంది. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణుల్లో కసి వచ్చింది. చంద్రబాబు రిలీజ్ అయ్యే వరకు కడప జిల్లా వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో రోజూ నిరసనలు తెలిపారు. వైసీపీ వారి దాడులను తట్టుకుని పార్టీ కోసం కష్టపడ్డారు. ఇలా కష్టపడ్డ వారంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు.


కడప జిల్లాలో జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ ఏడు చోట్ల గెలుపొందింది. వైసీపీ స్థాపన నుంచి ఆ పార్టీకి కంచుకోటగా మారిన జగన్ సొంత జిల్లాలో టీడీపీ పాగా వేయగలిగింది. మిగిలిన జిల్లా సంగతి ఎలా ఉన్నా జగన్ సొంత జిల్లాలో టీడీపీ ఘన విజయం సాధించడం. ఇక పులివెందులలో కూడా జగన్ మెజార్టీని సమానికి సగం తగ్గించడం మామూలు విషయం కాదంటున్నారు. ఆ విజయం కోసం జిల్లా టీడీపీ నేతలు అహర్నిశలు కృషి చేశారు. కొందరు టికెట్ ఆశించి కష్టపడ్డారు. సమీకరణల నేపథ్యంలో వారికి టికెట్ ఇవ్వకుండా వేరేవారికి ఇచ్చారు. టికెట్ ఆశించి భంగపడ్డవారు కూడా పార్టీ విజయానికి కష్టపడ్డారు.

కడపలో టీడీపీ ఇన్చార్జిగా అమీరాబాబు కొనసాగారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన కడప ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అలాగే అలంఖాన్‌పల్లెకు చెందిన లక్ష్మీరెడ్డి కుటుంబం కూడా టికెట్ ఆశించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివి జన్లకు గాను ఒకేఒక్క డివిజన్లో టీడీపీ గెలుపొందింది. ఆ ఒక్కటీ అలంఖాన్ పల్లె లక్ష్మిరెడ్డి కుటుంబం వారిదే కావడం గమనార్హం. దీంతో కడప టికెట్ రేసులో లక్ష్మిరెడ్డి కోడలు, 19వ డివిజన్ కార్పొరేట్ ఉమాదేవి పేరు బలంగా వినిపించింది.


అనూహ్యంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవి తెరపైకి వచ్చారు. లక్ష్మి రెడ్డి, కోడలు ఉమాదేవి టికెట్ కోసం అప్పట్లో లోకేశ్ ను కూడా కలిశారు. న్యాయం చేస్తామంటూ అప్పట్లో లోకేశ్, చంద్రబాబు వారికి హామీ ఇచ్చారంటారు. అమీరాబాబు కూడా కడపలో టీడీపీ జెండా పాతడానికి తనవంతు కృషి చేశారు. అలా పార్టీ కోసం కష్టపడిన వారంతా వైసీపీ దాడులకు ఎదురొడ్డి నిలిచి తమ ఆస్తులు కూడా పోగొట్టుకున్నట్లు చెబుతారు. ఇఫ్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఎలా గైనా న్యాయం చేస్తారని వారంతా నమ్మకంతో కనిపిస్తున్నారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి పార్టీలో ఉన్నారు. టీడీపీ నిర్వహించే మహానాడు, ఎన్టీఆర్ జయంతి, వర్షంతి వేడుకలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. జగన్ జిల్లాలో ఎన్ని ప్రతిపబంధకాలు ఎదురైనా పార్టీ మారకుండా టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రస్తుతం ఆయన నామినేటెడ్ పదవిపై ఆశ పెట్టుకుని ఉన్నారు. వారితో పాటు నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి సైతం పదవి ఆశిస్తున్నారు. ఎన్నికల్లో ఆయన ఏరియాలో అన్ని పోలింగ్‌ బూతుల్లో టీడీపీకి అధిక్యత వచ్చింది. దీంతో. తనకు ఏదో ఒక పదవి వస్తుందని ఆయన నమ్ముతున్నారట.

Also Read: ఏపీ నేతల్లో బీపీ పెంచుతున్న ఆగస్టు ఫస్ట్..బాబుకు తొలి పరీక్ష

మరో వైపు బలిజ కోటాలో తనకు ఏదైనా పదవి వస్తుందని హరిప్రసాద్ అనే నాయకుడు భావిస్తున్నారంటారట. ఇంకా పలువురు ఆశ పడుతున్నారట. బద్వేలులో కూటమి ఆభ్యర్ధిగా బీజేపీ పోటీ చేసి ఓడింది. ఇప్పుడు అక్కడ పదవుల పంపిణీ చాలా కీలకంగా మారిందంటున్నారు. గతంలో వైసీపీలో ఉన్న నేతలే ఇప్పుడు మళ్లీ కూటమి పార్టీల్లో దీంతో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకు అన్యాయం జరుగుతుందేమో అని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. ఇక మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపుకోసం కుటమి శ్రేణులు కష్టపడ్యాయి. ఇప్పుడు పదవులపై మూడు పార్టీల్లో చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు.

ప్రొద్దుటూరులో ప్రస్తుత ఎమ్మెల్యే పరదరాజులరెడ్డితో పాటు మాజీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మరో టీడీపీ నేత సురేశ్‌నాయుడు టికెట్ ఆశించారు. వైసీపీ తప్పుడు కేసులు నమోదు చేయడంతో అప్పట్లో ప్రవీణ్ కుమార్రెడ్డి రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చారు. ఇక్కడ నామినేటెడ్ పదవుల సీజన్ మొదలవ్వడంతో ప్రవీణ్ కుమార్రెడ్డి, లింగారెడ్డి, సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య, ముక్తియార్ పాటు మరికొందరు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఇక జమ్మలమడుగులో బీజేపీ నుంచి ఆదినారాయణరెడ్డి గెలుపొంచారు.

పదవుల పంపిణీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, 10 శాతం బీజేపీకి ఇచ్చేలా రాష్ట్రస్థాయిలో నిర్ణయం జరిగిందంటున్నారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట ఆపార్టీకి 60 శాతం, టీడీపీకి 30, బీజేపీ 10 శాతం, బీజేపీ ఉన్న చోట ఆ పార్టీకి 50, మిగతా 50 శాతం పదవులు టీడీపీ, జనసేనలు పంచుకోనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమష్టిగా కష్టపడ్డాయి.

ఆ క్రమంలో జమ్మలమడుగులో 50 శాతం పదవులు బీజేపీకి పోతే మిగతావిటీడీపీ, జనసేన పంచుకోనున్నాయి. ఇక్కడ టీడీపీ ఇన్చార్జి భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తమ వర్గీయులకు పదవులు ఇప్పించుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. భూపేష్‌రెడ్డి స్వయంగా ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడే అవ్వడంతో పదవుల పంపకాలు సజావుగా సాయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కమలావురంలో పుత్తా చైతన్యరెడ్డి, పులివెంచులలో ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నేత్సత్వంలో పదవుల పంపిణీ జరగనుందట.

ఈ సారి ఎమ్మెల్యేలు, స్థానిక నేతల సిఫార్సులు లేకుండా కష్టపడ్డ వారిని గుర్తించి పదవులు ఇచ్చే దిశగా పార్టీల పెద్దలు అభిప్రాయసేకరణ చేస్తున్నారంట. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అవి ఎప్పుడు జరిగినా వైసీపీని అడ్రస్ లేకుండా చేయాల్న పట్టుదలతో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఉన్నారంట. అందుకే ఈ సారి రికమండేషన్స్‌ పట్టించుకోకుండా నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ హార్డ్‌కోర్ కేడర్‌కి పదవుల్లో ప్రయారిటీ ఉంటుందంటున్నారు.

 

Related News

Kiraak RP: మాకు ప్రవేట్ కాల్స్ వస్తున్నాయి.. మరి వాటి సంగతేంటి.. నిజాలు చెప్పాలి.. శ్యామలకు ఆర్పీ కౌంటర్

Guntur BJP Leaders: కొంపముంచిన రాసలీలల వీడియో.. ఇద్దరు కీలక నేతల రాజీనామా!

AP Liquor Shop Tenders 2024: అమెరికాను తాకిన ఏపీ మద్యం వాసన.. ఎక్సైజ్ శాఖకు ఆదాయమే ఆదాయం..

Pawan Kalyan: కేబినెట్ భేటీలో కనిపించని పవన్.. అసలు కారణం ఇదే !

Chandrababu Tears up: ముంబైలో రతన్ టాటాకు నివాళులర్పించిన చంద్రబాబు… కంటతడి!

Ys Jagan: అస్సలు ఊహించలేదు కానీ.. షాకిచ్చాడు.. ఆ నేతపై ఫస్ట్ టైమ్ కామెంట్స్ చేసిన జగన్

Madhuri On Pawan Kalyan: పవన్‌ను టార్గెట్ చేసిన దువ్వాడ జంట.. ఎందుకు?

Big Stories

×