BigTV English

Train Reservation : ట్రైన్ టికెట్ బుకింగ్, UPI పేమెంట్స్, క్రెడిట్‌ కార్డ్స్ బిల్స్, గ్యాస్‌ సిలిండర్ ధరల్లో కొత్త రూల్స్

Train Reservation : ట్రైన్ టికెట్ బుకింగ్, UPI పేమెంట్స్, క్రెడిట్‌ కార్డ్స్ బిల్స్, గ్యాస్‌ సిలిండర్ ధరల్లో కొత్త రూల్స్

Train Reservation : రైల్వే రిజర్వేషన్ లో కొత్త మార్పులు వచ్చాయి. దీంతో పాటు UPI నగదు బదిలీ, క్రెడిట్‌ కార్డులు, గ్యాస్‌ సిలిండర్ ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గత నెలలోనే ఈ నిర్ణయం జరిగినప్పటికీ తాజాగా అమలులోకి వచ్చాయి.


ఇండియన్ రైల్వే టికెట్ రిజర్వేషన్ లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్ధం టికెట్ బుకింగ్, లగేజీ తరలింపుల్లో కొత్త అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ ట్రైన్ టికెట్‌ లను 120 రోజుల గడువుతో బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉండేది. అయితే తాజాగా వచ్చిన నిబంధనలతో కేవలం 60 రోజుల ముందుగానే మాత్రమే టికెట్లను బుకింగ్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఇందుకు కారణాలు సైతం వెల్లడించిన రైల్వే.. 120 రోజుల ముందు రైల్వే టికెట్‌ లను బుకింగ్ చేసుకుంటున్న వారిలో 21 శాతం మంది టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటున్నారని తెలిపింది. దీంతో పాటు మరో 5 శాతం వరకు.. టికెట్లు కలిగి ఉన్నప్పటికీ ప్రయాణాలు చేయడం లేదని పేర్కొంది. దీంతో అత్యవసర సమయాల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపింది.

అందుకే ఇటువంచి సమస్యలకు చెక్ పెట్టేందుకే మార్పులు చేస్తూ కేవలం 60 రోజుల ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇక లగేజీ విషయంలోనూ రైల్వే మార్పులు చేసింది. ఇప్పటివరకూ విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే అదనపు రుసుము చెల్లించాల్సి ఉండేది. ఇకపై ఈ నిబంధనలను రైల్లో ప్రయాణించే ప్రమాణికులు అమలుచేసేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమైంది. పరిమితికి మించి లగేజీ తీసుకువస్తే జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపింది. ఇక ఉచిత లగేజీ విషయంలోనూ అనుమతించిన దాని కంటే ఎక్కువ తీసుకొస్తే అదనంగా వసూలు చేస్తామని తెలిపింది.


ALSO READ : మొన్న ఐఫోన్స్.. ఈరోజు గూగుల్ ఫోన్స్ పై నిషేధం, ఇండోనేషియా ఎందుకు ఇలా చేస్తోంది?

భారతీయ బ్యాకింగ్ దిగ్గజం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కూడా తన నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. దేశీయ నగదు బదిలీ కోసం కొత్త రూల్స్‌ ను తెచ్చింది. నగదు చెల్లింపుల వ్యవవ్థను మెరుగుపరచడం, బ్యాంకింగ్‌ అవుట్‌లెట్ లభ్యత, KYC రూల్స్‌ ను సులభతరం చేయడం వంటివి ఉన్నాయి

ఇక ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపులు యాప్ యూపీఐ.. సైతం తన నిబంధనల్లో కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకూ UPI లైట్‌ నుంచి రూ.500 వరకు పంపేందుకు మాత్రమే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ నింబంధనలను మారుస్తూ రూ. 1000 వరకు నగదు బదిలీ చేసుకునే అవకాశాన్ని యూపీఐ కల్పించింది.

SBI సైతం తన క్రెడిట్‌ కార్డు ఫైనాన్స్‌ ఛార్జీలను పెంచేసింది. ఇప్పటివరకూ 3.5 శాతంగా ఉన్న క్రెడిట్‌ కార్డు ఫైనాన్స్‌ ఛార్జీలను 3.75 శాతానికి పెంచింది. ఇక ఒక బిల్లింగ్ సైకిల్‌లో యుటిలిటీ పేమెంట్స్ సైతం రూ.50 వేలు దాటితే 1 శాతం సర్ ఛార్జ్ వసూలు చేస్తామని తెలిపింది.

ఇక నిత్యావసరాల్లో ఒకటిగా ఉన్న గ్యాస్‌ సిలిండర్ ధరలు సైతం అమాంతం పెరిగాయి. వాణిజ్య సిలిండర్‌ ధరను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌పై రూ.62 పెరిగింది. అయితే ఇది ఇంట్లో వినియోగించే 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధరకు వర్తించదని తెలిపింది.

 

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×