E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో..అదిరిపోయే మిక్సీ కావాలా?

తక్కువ బడ్జెట్‌లో..అదిరిపోయే మిక్సీ కావాలా?
Advertisement

Nexachef DuoChef 500W juicer mixer grinder:  ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో వంట పనులను త్వరగా పూర్తి చేయడానికి స్మార్ట్ కిచెన్ అప్లయెన్సెస్ చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా కొత్తగా హాస్టల్స్‌లో ఉంటున్న స్టూడెంట్స్, బ్యాచిలర్స్ లేదా చిన్న కుటుంబాల కోసం తక్కువ ధరలో మంచి మిక్సీ గ్రైండర్ దొరకడం గ్రేట్. ఆ కోవకే చెందిన ‘Nexachef DuoChef 500W’ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్, దీని అమేజింగ్ ఫీచర్లు, అతి తక్కువ ధరతో మార్కెట్లో ప్రస్తుతం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.కేవలం రూ.1012 ధరకే అందుబాటులో ఉన్న ఈ మిక్సీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Nexachef DuoChef 500W ఫీచర్లు:

1.స్టైలిష్ డిజైన్, కలర్ కాంబినేషన్:

Advertisement

ఈ కిచెన్ అప్లయెన్స్ చూడడానికి.. చాలా మోడ్రన్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. బ్లాక్, గ్రే కలర్ కాంబినేషన్ వంట గదికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. కాంపాక్ట్ సైజ్‌లో.. ఉండటం వల్ల ఇది కిచెన్ కౌంటర్‌ టాప్‌లో చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీనిని ఒక చోటు నుంచి మరో చోటుకి మార్చడం కూడా చాలా ఈజీ.

2.500W పవర్, 2 జార్ల సపోర్ట్:

సైజు చిన్నదే అయినప్పటికీ, ఇందులో బెస్ట్ 500W మోటార్‌ను అందించారు. ఇది రోజు వారీ వంట పనులకు అంటే మసాలాలు రుబ్బడానికి, చట్నీలు చేసుకోవడానికి, జ్యూస్ ల తయారీకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాకేజింగ్‌లో భాగంగా 2 బెస్ట్ క్వాలిటీ జార్లు కూడా అందించారు. వీటిని వివిధ రకాల పదార్థాల తయారీకి వాడొచ్చు. అంతే కాకుండా వీటిలోని బ్లేడ్ల క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాబట్టి ఇది తక్కువ సమయంలో ఎక్కువ పనులను పూర్తి చేస్తుంది.

3.వాడకం, క్లీనింగ్:

Advertisement

ఈ మిక్సర్ గ్రైండర్‌ను ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ. ఎలాంటి క్లిష్టమైన సెట్టింగ్స్ ఉండవు కాబట్టి ఎవరైనా సరే దీన్ని చాలా ఈజీగా వాడొచ్చు. అలాగే.. వాడకం పూర్తయిన తర్వాత జార్లను కడగడం, మెషీన్‌ను శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ. బేసిక్ కిచెన్ అవసరాలు.. ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు.

Also Read: ట్రెండీ లుక్,సూపర్ బ్యాటరీతో..బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్

4. ధర:

ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లలో ఈ మోడల్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ ధర కేవలం రూ.1012 (ఆఫర్లను బట్టి కొద్దిగా మారొచ్చు)మాత్రమే ఉంది. కేవలం వెయ్యి రూపాయల బడ్జెట్‌లో.. ఇంత మంచి అప్లయెన్స్ లభించడం నిజంగా వాల్యూ ఫర్ మనీ.

మొత్తానికి చూస్తే..తక్కువ బడ్జెట్‌లో.. మంచి పవర్‌ఫుల్ మోటార్, స్టైలిష్ లుక్, అవసరమైన జార్లు కోరుకునే వారికి ఈ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీ కిచెన్ అవసరాలను మరింత ఈజీ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.

Related News

ఆన్ లైన్ షాపింగ్ చేయకపోయినా పార్శిల్ వచ్చిందా? ఇలా చేస్తే..నిలువునా మోసపోతారు!

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×