E-Paper
Advertisement

గిఫ్ట్‌గా ఇచ్చిన టోస్టర్ కోసం పిచ్చెక్కించే రచ్చ… డార్క్ కామెడీ మూవీ తెలుగులో స్ట్రీమింగ్

గిఫ్ట్‌గా ఇచ్చిన టోస్టర్ కోసం పిచ్చెక్కించే రచ్చ… డార్క్ కామెడీ మూవీ తెలుగులో స్ట్రీమింగ్
Advertisement

Dark Comedy on OTT: అయ్యయ్యో… ఒక టోస్టర్ కోసం ఎవరైనా ఇంతగా గొడవ పడతారా ? ఈ సినిమాలో చేస్తారు. మరి అది సాధారణ టోస్టర్ అయితే పర్లేదు… కానీ ఏకంగా రూ.5,499 పెట్టి కొన్న ఖరీదైన టోస్టర్ కదా! దాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన తర్వాత పెళ్లి పెటాకులు కావడంతో… తిరిగి తెచ్చుకోవాలని ఓ వ్యక్తి పట్టుబడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అదే కాన్సెప్ట్‌ను డార్క్ కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో కలిపి తెరకెక్కించిన సినిమా ‘టోస్టర్’ (Toaster). ఒక పిసినారి వ్యక్తి తన డబ్బు కోసం మొదలుపెట్టిన చిన్న ప్రయత్నం… చివరికి మర్డర్లు, కిడ్నాప్‌లు, బ్లాక్‌మెయిలింగ్‌ల మధ్యకు ఎలా తీసుకెళ్లిందనేదే ఇందులోని ఆసక్తికరమైన విషయం. మరి ఆ టోస్టర్‌ లో అంత ప్రత్యేకత ఏముంది ? రమాకాంత్ చివరికి దాన్ని దక్కించుకున్నాడా ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రమాకాంత్ (రాజ్‌కుమార్ రావు) సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి. కానీ అతని కంజూసితనానికి మాత్రం హద్దులుండవు. మొబైల్ బిల్లులో కొన్ని రూపాయలు ఎక్కువ వచ్చినా కస్టమర్ కేర్‌తో వాదించేంత పిసినారి. ఇంట్లో లైట్ వెలగడం, ఫ్యాన్ తిరగడం కనిపిస్తే వెంటనే ఆఫ్ చేసేస్తుంటాడు. అలాంటి రమాకాంత్ భార్య శిల్ప (సాన్యా మల్హోత్రా). ఒక పెళ్లికి వెళ్లాల్సి రావడంతో, కొత్త జంటకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని శిల్ప నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఏకంగా రూ.5,499 విలువైన బ్రాండెడ్ టోస్టర్ కొనేస్తుంది.

Advertisement

భార్య అంత డబ్బు ఖర్చు చేయడంతో రమాకాంత్‌కు మైండ్ బ్లాంక్ అవుతుంది. కానీ పెళ్లి కాబట్టి తప్పక గిఫ్ట్ ఇచ్చేస్తారు. అసలు కథ అక్కడి నుంచే మొదలవుతుంది. పెళ్లి జరిగింది అనుకునేలోపే పెటాకులు అవుతుంది. దీంతో రమాకాంత్‌కు ఓ విచిత్రమైన ఆలోచన వస్తుంది. తాము ఇచ్చిన గిఫ్ట్ వాళ్ల దగ్గర ఎందుకు ఉండాలి ? పెళ్లే లేనప్పుడు టోస్టర్‌ను తిరిగి తెచ్చేసుకుంటే డబ్బు ఆదా అవుతుందని ఫిక్స్ అవుతాడు. టోస్టర్ కోసం రమాకాంత్ చేసే ప్రయత్నం మొదట్లో చాలా కామెడీగా అనిపిస్తుంది.

కానీ అతను ఆ ఇంటికి వెళ్లిన తర్వాత పరిస్థితులు ఊహించని మలుపు తీసుకుంటాయి. అక్కడ జరుగుతున్న కొన్ని అనుమానాస్పద వ్యవహారాల మధ్య రమాకాంత్ ఇరుక్కుపోతాడు. మర్డర్లు, కిడ్నాప్‌లు, బ్లాక్‌మెయిలింగ్‌లు… ఇలా ఒక్కొక్కటిగా క్రైమ్ వ్యవహారాలు బయటపడటంతో, అసలు ఆ టోస్టర్ చుట్టూ ఏం జరుగుతోందనే ప్రశ్న మొదలవుతుంది. తాను కేవలం తన ఖరీదైన గిఫ్ట్‌ను వెనక్కి తీసుకోవడానికి వచ్చిన రమాకాంత్… చివరికి క్రిమినల్స్ మధ్యలో చిక్కుకుపోతాడు.

Advertisement

ఆ తర్వాత టోస్టర్ కోసం మొదలైన వేట… రమాకాంత్‌ను మరింత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. తన భార్య శిల్ప కూడా ఈ గందరగోళంలోకి రావడంతో పరిస్థితులు మరింత కష్టంగా మారతాయి. అసలు ఆ టోస్టర్ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి ? దాని కోసం ఇంతమంది ఎందుకు వెంటపడుతున్నారు ? రమాకాంత్, శిల్ప ఈ క్రైమ్ గేమ్ నుంచి ఎలా బయటపడ్డారు ? అనేది తెలియాలంటే ఈ సినిమా క్లైమాక్స్ ను చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

‘టోస్టర్’ ప్రస్తుతం Netflixలో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాను చూడొచ్చు. రాజ్‌కుమార్ రావు, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు విచిత్రమైన సంఘటనలతో నవ్విస్తూనే ఉంటుంది. పిసినారి భర్త కథగా మొదలైన సినిమా… చివరికి క్రైమ్ మిస్టరీగా మారడమే ‘టోస్టర్’ ప్రత్యేకత. డార్క్ కామెడీ, క్రైమ్, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులతో కూడిన సినిమాల కోసం ఓటీటీలో వెతుకుతుంటే… ఈ మూవీపై ఒక లుక్కేయండి. మంచి టైమ్‌పాస్ మూవీ మావా. ముఖ్యంగా రాజ్‌కుమార్ రావు కంజూస్ రమాకాంత్ పాత్రలో చేసే కామెడీ హైలెట్ గా ఉంటుంది.

Read Also: 17 ఏళ్లుగా కూతురి కోసం వేట… రియల్ స్టోరీతో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×