E-Paper
Advertisement

‘ఇరుముడి’ రిలీజ్.. ఈ మూవీ ఎందుకు చూడాలంటే?

‘ఇరుముడి’ రిలీజ్.. ఈ మూవీ ఎందుకు చూడాలంటే?
Advertisement

Irukmudi Movie: రవితేజ..మాస్ మహారాజాగా మనందరికీ దగ్గరైన ఈ వెటరన్ హీరో గత కొంతకాలంగా సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోతున్నాడు.ఇదిగో సరిగ్గా ఈ సమయంలోనే ‘ఇరుముడి’ అంటూ శివ నిర్వాణతో అయ్యప్ప స్వామి దీక్ష బ్యాక్ డ్రాప్ లో మరో సినిమాతో మన ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు.

ఇక ఈ సినిమా ఆగస్ట్ 21న అంటే రేపే రిలీజ్ కి రెడీ అయిపొయింది.అయితే రవి తేజ చేసిన గత సినిమాలకి,ఈ సినిమాకి చాలా వైవిధ్యం కనిపిస్తుంది.ముఖ్యంగా ఎప్పుడూ లేనంత పాజిటివ్ వైబ్స్ ఈ సినిమా చుట్టూ ఉండటం విశేషం.మరి మిగతా సినిమాల కన్నా ఇది ఎందుకు ప్రత్యేకమో, ఆడియన్స్ ఈ సినిమాని అసలు ఎందుకు మిస్ కాకూడదో ఒకసారి చూద్దాం.

తండ్రి కూతుళ్ళ బంధం 

Advertisement

సినిమా విషయానికి వస్తే ‘ఇరుముడి’అని టైటిల్ పెట్టగానే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లాగే ఇది కూడా అయ్యప్ప దీక్ష చుట్టూ తిరుగుతుందేమో అనుకున్నారు అంతా.కానీ రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే కూతురి కోసం ఒక తండ్రి అయ్యప్ప దీక్షను తీసుకోవాల్సి రావడం,ఆ క్రమంలో అతనికి ఎదురయ్యే సవాళ్లు, ఆ భక్తి వెనుక ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వంటి అంశాలను బ్లెండ్ చేయడం.. వీటన్నింటిని చూస్తే రవితేజని కేవలం  భక్తుడిగానే కాకుండా ఒక కూతురి కోసం ఏమైనా చేసే తండ్రిగా సరికొత్త పాత్రలో దర్శకుడు శివ నిర్వాణ చూపించబోతున్నాడని అర్థం అవుతుంది.

అంటే మాస్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా థియేటర్లకు రప్పించేలా తండ్రీకూతుళ్ల బంధాన్ని డిజైన్ చేశాడన్న మాట.

రూట్ మార్చిన మాస్ మహారాజ్ 

Advertisement

ఇప్పటి వరకు గత కొన్నేళ్లుగా రవితేజ అంటే మాస్ ,యాక్షన్, రొమాన్స్ సినిమాలే అని బ్రాండ్ వేసుకున్న పరిస్థితి.అలాంటి ఈ టైమ్ లో ఇలా ఒక ప్యూర్ ఇంటెన్సిటీ ఉన్న సినిమాని ఒప్పుకోవడంతోనే రవితేజ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.ఇక దర్శకుడు శివ ట్రాక్ చూస్తే ‘నిన్ను కోరి’,‘మజిలీ’,‘ఖుషి’ వంటి సినిమాలతో ఎమోషన్ ని ఎంత బాగా పండించగలడో మనం చూశాం కూడా.

ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివ నిర్వాణ మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంతటి ఇంటెన్స్ ఉన్న సినిమా రాలేదు అని సగర్వంగా చెప్పగలను అని చెప్పడం తో సినిమా అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

పూనకాలు రావడం మాత్రం పక్కా

ఇక ఈ సినిమాకి నేషనల్ అవార్డు విన్నర్ జీవి ప్రకాష్ సంగీతం మెయిన్ అసెట్ అని చెప్పాలి.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన ఇరుముడి కట్టు సాంగ్, మల్లెపూల పల్లకి పాటలు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మల్లెపూల పల్లకి డీజే వెర్షన్ కి థియేటర్‌లో పూనకాలు రావడం మాత్రం పక్కా అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

మొత్తంగా సినిమా నుండి వస్తున్న సాంగ్స్, ట్రైలర్,అప్ డేట్స్ కి వస్తున్న పాజిటివ్ బజ్ చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఒకవైపు తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్, మరోవైపు అయ్యప్ప స్వామి దీక్ష వెనుక ఉన్న భక్తి, వీటితో పాటు రవితేజ మార్క్ మాస్ యాక్షన్ సినిమాకి మెయిన్ ఎసెట్ అని తెలుస్తుంది.

ఈ సినిమాని థియేటర్లలో ఒకసారి చూడాల్సిందే

ఇక ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా జోడీ కట్టగా రవితేజ కుతురిగా బేబి నకాస్త్ర నటించింది. సాయి కుమార్, అజయ్ ఘోష్ వంటి యాక్టర్‌లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి నిర్మించిన సంగతి తెల్సిందే.

also read :విజయవాడలో స్టార్స్ సందడి: ఘనంగా ముగిసిన విబి ఎంటర్టైన్మెంట్స్ అవార్డుల వేడుక

ఏది ఏమైనా ఇప్పటిదాకా చేసిన రాడ్డు సినిమాలతో పోలిస్తే ఎంచక్కా తనకి తగ్గ తండ్రి పాత్రని వేసిన రవితేజని చూసేందుకైనా ఈ సినిమాని థియేటర్లలో ఒకసారి చూడాల్సిందే !

Tags

Related News

విజయవాడలో స్టార్స్ సందడి: ఘనంగా ముగిసిన విబి ఎంటర్టైన్మెంట్స్ అవార్డుల వేడుక

టికెట్ రేట్ల ‘జీఓ’పై ఫైర్: తెలంగాణ సర్కార్‌కు థియేటర్ ఓనర్ల డెడ్‌లైన్!

తేదీలు, వారాల పేర్లతో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే.. అనిల్ ప్లాన్ అదుర్స్!

నా బెడ్ రూమ్ గురించి పగటి కలలు కనొద్దు.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్!

ఎన్టీఆర్, భూమిక మూవీల తర్వాత మాదే.. ‘మోడ్రన్ మిస్సమ్మ’ నుండి ఫస్ట్ సింగిల్!

‘ఇరుముడి’ హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా..?

పవిత్ర గౌడ మాజీ భర్త మృతి.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×