BigTV English

No More OTPs : ఆ రోజు నుంచే ఓటీపీ సేవలు బంద్..! షాక్ ఇచ్చిన ఇండియన్ రెగ్యులేటరీ

No More OTPs : ఆ రోజు నుంచే ఓటీపీ సేవలు బంద్..! షాక్ ఇచ్చిన ఇండియన్ రెగ్యులేటరీ

No More OTPs : ఎటువంటి ఆన్లైన్ లావాదేవీలు చేయాలన్నా ఓటీపీలు తప్పనిసరి. టెలికాం సంస్థల నుంచి ప్రముఖ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ అన్ని కూడా ఓటీపీల పైన ఆధారపడే పని చేస్తాయి. షాపింగ్ యాప్స్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్, బ్యాంకింగ్ రిలేటెడ్ ఫ్లాట్ ఫామ్స్ అన్నింటికి కూడా ఓటీపీలదే ఆధారం. ఇక తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధనలు వీరందరికీ షాక్ ఇచ్చేయనే చెప్పాలి. నవంబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్ అమలు చేయటానికి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఓటీపీలను రద్దు చేయాలని తెలుపుతూ టెలికాం సంస్థలకు కొత్త ప్రతిపాదనలను పంపింది. ఈ విషయంపై భారతీ ఎయిర్టెల్, జియో వంటి ప్రముఖ టెలికాం సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


ఓటీపీ సేవలు నిలిపివేయాలని ప్రముఖ టెలికాం సంస్థలకు ట్రాయ్ కొత్త రూల్స్ ప్రతిపాదించింది. అయితే ఈ నిబంధనలపై ఎయిర్టెల్, జియో సాహా ప్రముఖ సంస్థలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయానికి తాము ఒప్పుకోమని తెగేసి చెబుతున్నాయి. ఈ రూల్స్ తెచ్చి తీరుతామని ట్రాయ్ తెలపటంతో కొన్ని రోజులు గుడువైనా ఇవ్వాలని ఆ సంస్థలు కోరుతున్నాయి. అయితే ట్రాయ్ చెప్తున్న నిబంధనల ప్రకారం… ఇష్టారాజ్యంగా కస్టమర్స్ కు మెసేజెస్ పంపడం, ఓటీపీలు రావడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని అడ్డుకొని తీరుతామని చెబుతున్నాయి.

ఇక 2023 ఆగస్టులోనే బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చే ఓటీపీలను నియంత్రణ చేయాలని ట్రాయ్ ఆదేశించింది. టెలికాం సంస్థలు సైతం ఓటీపీలు నియంత్రించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ విషయంపై వివాదం ఇప్పటివరకు కొనసాగుతూ వస్తుంది. దీంతో నవంబర్ 1, 2024 నుంచి ప్రముఖ టెలికాం సంస్థలన్నీ ఓటీపీ సేవలు బంద్ చేయాలని తెలిపింది. ఇక ఈ విషయం ప్రస్తుతం చర్చకు దారితీసింది.


సైబర్ స్కామ్స్ అరికట్టే దిశగా కేంద్రం చర్యలు

ఇక విదేశాల నుంచి కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లను అరికట్టే దిశగా కేంద్రం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ ఇన్ కమింగ్ స్ఫూఫ్డ్ కాల్స్ ప్రివెన్సెన్ సిస్టమ్ ను కస్టమర్స్ కు పరిచయం చేస్తుంది. భారతీయ నంబర్లతో కాల్ చేసే నేరగాళ్లను అడ్డుకునేందుకు ఈ సిస్టమ్ పనిచేస్తుందని.. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

భారతీయులకు ముప్పు

ఇండియాలో  సైబర్ ముప్పు సైతం క్రమక్రమంగా పెరిగిపోతుంది. అంతర్జాతీయంగా కాల్స్ వస్తున్నాయి. సైబర్ ఫ్రాడ్ స్టర్ అధికారులమంటూ వీడియో కాల్స్ సైతం చేస్తున్నారు. తప్పుడు నేరాలను క్లెయిమ్ చేసే బాధితులను సైతం టార్గెట్ చేస్తున్నారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీటన్నింటినీ అరికట్టేందుకు ట్రాయ్ భద్రతా కార్యక్రమాలను చేపడుతోంది.

OTP నియంత్రణతో లాభాలు

ట్రాయ్ చెబుతున్నట్లు ఓటీపీ నిబంధనలు ఆపే అవకాశం ఉంటే తాత్కాలికంగా ఈ స్కామ్స్ కు అంతరాయం ఏర్పడుతుంది. సైబర్ నేరగాళ్లు ఓటీపీలతో మోసం చేేసే అవకాశం ఉండదు. డిజిటల్ సెక్యూరిటీ, ఆన్లైన్ సెక్యూరిటీ లో భద్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

 

Related News

Dinosaur Eggs: అంగారక గ్రహంపై ‘డైనోసార్ ఎగ్స్’.. ఒకప్పుడు అక్కడ జీవులు మనగడ ఉండేదా?

Google Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 10 కంటే పిక్సిల్ 9 బెటర్.. ఎందుకంటే?

Grok Imagine AI: ఇప్పుడు ఏఐ వీడియో, ఇమేజ్‌‌లు చేయడం అంతా ఫ్రీ.. అందరికీ అందుబాటులో గ్రోక్ ఇమేజిన్

Lava Play Ultra 5G: కేవలం రూ.14999కే సూపర్ గేమింగ్ ఫోన్.. 64MP కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్

Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇండియాలో విడుదల.. అద్భుత కెమెరా, పవర్ ఫుల్ ఏఐ ఫీచర్లు

Vivo V60: 50MP కెమెరా, పెద్ద బ్యాటరీ.. వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ పై భారీ డిస్కౌంట్

Big Stories

×