Noise ALT Buds S: ప్రస్తుత రోజుల్లో తక్కువ బడ్జెట్‌లో.. అదిరిపోయే ఫీచర్లు అందించే గాడ్జెట్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ విషయంలో.. యూత్ రకరకాల ఆప్షన్లను కోరుకుంటోంది. ప్రముఖ లైఫ్‌స్టైల్ టెక్ బ్రాండ్ ‘నాయిస్’ తన కస్టమర్ల కోసం మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదే.. ‘నాయిస్ ఆల్ట్ బడ్స్’. 45 గంటల బ్యాటరీ బ్యాకప్, క్వాడ్ మైక్ ENC వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న.. ఈ ఇయర్‌బడ్స్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ ఇయర్ బడ్స్ డిజైన్ చాలా ప్రీమియమ్‌గా ఉంటుంది. చెవులలో.. పెట్టుకున్నప్పుడు ఎంతో కంఫర్టబుల్‌గా ఉండేలా వీటిని డిజైన్ చేశారు. ముఖ్యంగా ‘చోసెన్ వైట్’ కలర్ వేరియంట్ చూడటానికి.. చాలా క్లాసీగా, ట్రెండీగా కనిపిస్తుంది. రోజంతా వాడినా కూడా చెవులకు ఎలాంటి నొప్పి కలగకుండా లైట్‌వెయిట్ బాడీతో ఇవి వస్తాయి.
ఎక్కువ సేపు ప్రయాణాలు చేసేవారికి.. లేదా మ్యూజిక్ వినేవారికి బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. నాయిస్ ఆల్ట్ బడ్స్ ఛార్జింగ్ కేస్‌తో ..కలిపి ఏకంగా 45 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజుల తరబడి ఛార్జింగ్ గురించిన టెన్షన్ ఉండదు. అంతే కాకుండా ఇందులో ‘ఇన్‌స్టాఛార్జ్’టెక్నాలజీ ఉంది. దీని వల్ల కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తేనే.. గంటల కొద్దీ మ్యూజిక్ లేదా కాల్స్ కి ఉపయోగించవచ్చు.ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది.
బయట రద్దీగా ఉండే ప్రాంతాలలో లేదా ప్రయాణ సమయాల్లో ఫోన్ మాట్లాడటం చాలా కష్టంగా మారుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఇందులో క్వాడ్ మైక్ సిస్టమ్‌తో పాటు ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ కన్సలేషన్ టెక్నాలజీని అందించారు. దీని వల్ల చుట్టూ ఉండే అనవసరమైన శబ్దాలు తగ్గిపోయి, అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా, క్లియర్‌గా వినిపిస్తుంది. ఆఫీస్ కాల్స్, ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అయ్యే వారికి ఇది చాలా ఉపయోగ పడుతుంది.
Also Read: రూ.22,990కే 43 ఇంచుల టీవీ..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు
ఈ బడ్జెట్‌లో లభించే మరో గొప్ప ఫీచర్ ‘డ్యూయల్ పేరింగ్’. దీని సహాయంతో ఒకే సమయంలో.. రెండు వేర్వేరు డివైజ్‌లకు ఇయర్‌బడ్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నాయిస్ డెడికేటెడ్ యాప్ సపోర్ట్ ద్వారా టచ్ కంట్రోల్స్ కస్టమైజ్ చేసుకోవడం, ఈక్వలైజర్ సెట్టింగ్స్ మార్చుకోవడం వంటివి కూడా ఈజీగా చేయవచ్చు.
అన్ని లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ ట్రూ బడ్స్ అసలు ధర మార్కెట్లో కేవలం రూ. 1,599 మాత్రమే. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్ , క్లియర్ కాల్ క్వాలిటీ కోరుకునే వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఇంకెందుకాలస్యం వెంటనే ఆర్డర్ చేసేయండి.