E-Paper
Advertisement

సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ప్రియా భవాని శంకర్!

సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ప్రియా భవాని శంకర్!
Advertisement

Priya Bhavani Shankar:ఇటీవల కాలంలో పలువురు నటీనటులు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు.ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ తమ భాగస్వామితో ఏడడుగులు వేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, అల్లు శిరీష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి సెలబ్రెటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా నేడు తన ప్రేయసితో గ్రీస్ లో ఏడడుగులు వెయ్యబోతున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ సడన్గా పెళ్లి చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మరీ సింపుల్ గా పెళ్లి చేసుకున్న ప్రియా భవాని శంకర్..

‘కళ్యాణం కమనీయం’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ నటి ప్రియా భవానీ శంకర్ తన క్లాస్మేట్ రాజ్ వేల్ రాజ్ తో ప్రేమలో ఉన్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సడన్గా దీపావళి సందర్భంగా నవంబర్ 10వ తేదీన తన ప్రియుడితో సింపుల్గా నిశ్చితార్థం చేసుకొని, ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దీంతో అభిమానుల సైతం సర్ప్రైజ్ అయ్యారు. అయితే ఇప్పుడు మరో సర్ప్రైజ్ ఇస్తూ చాలా సింపుల్ గా వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ ఎంత సింపుల్ అంటే వస్త్రధారణలో కూడా వీరు మరింత సింపుల్ గా కనిపించడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. స్టార్ సెలబ్రిటీ అయ్యుండి మరీ ఇంత సింపుల్గా వివాహం చేసుకోవడం ఏంట్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పదేళ్ల ప్రేమకు స్వస్తి పలుకుతూ పెళ్లితో నేడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది ప్రియా భవాని శంకర్.

ప్రియా భవాని శంకర్ భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే..

Advertisement

ప్రియా భవాని శంకర్ భర్త రాజ్ వేల్ రాజ్ విషయానికి వస్తే.. ఈయన ఫైనాన్స్ రంగానికి చెందిన వ్యక్తిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ట్రావెలింగ్, ఫిట్ నెస్ పై ఆసక్తి ఉన్న రాజ్ వేల్ జిమ్ వర్కౌట్స్ తో పాటు థాయిలాండ్ లో మాయ్ థాయ్ శిక్షణ కూడా పొందారు. మొత్తానికి అయితే ఇండస్ట్రీతో సంబంధం లేని ఫైనాన్షియర్ ను ఈమె వివాహం చేసుకున్నారు.

ALSO READ:రణవీర్ సింగ్ ఇంట్లో విషాదం.. అసలేం జరిగిందంటే?

ప్రియా భవాని శంకర్ ప్రస్తుత సినిమాలు..

Advertisement

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రంతో నటిగా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు తన చేతిలో సుమారుగా మూడు నుండి నాలుగు ప్రాజెక్ట్లు ఉండడం గమనార్హం. మంచు మనోజ్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో ఈమె నటిస్తోంది ఈ సినిమా 2027 జూలై 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ డెమోంటే కాలనీ 3లో కూడా ఈమె నటించింది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది పొంగల్ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు . అలాగే మరగాధ నాణయం 2 లో కూడా ఈమె నటిస్తోంది.

Related News

రణవీర్ సింగ్ ఇంట్లో విషాదం.. అసలేం జరిగిందంటే?

నేడే ఘనంగా కావ్య – అనిరుధ్ పెళ్లి.. ప్రత్యేకతలు ఇవే!

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ మూవీ లేనట్టేనా..?

Tollywood Updates : స్టార్ హీరోల సినిమాలు.. షూటింగ్ అప్డేట్స్..

దిశా పటాని నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

ప్రియా భవాని శంకర్ కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

మెగా ఫ్యామిలీ కాదు..డివోర్స్ ఫ్యామిలీ పవన్ పై రెచ్చిపోయిన తమన్నా సింహాద్రి!

Big Stories

Advertisement
×